8, డిసెంబర్ 2012, శనివారం

వెదుకులాటలో......!!

అందని హద్దు ఆకాశం అయినా అందుకోమంటూ
దగ్గరగా రా రమ్మంటూ ఆహ్వానం పలుకుతూ
మురిపిస్తూ మెరిపిస్తూ దగ్గరైనట్లే అనిపిస్తూ
దూరం దూరం పోతూనే ఉంటుంది...అచ్చం నీ లానే...!!

ఇదిగో ఇక్కడే ఉంది ఆవలి తీరం అంటూ...
అంతే లేని తీరం తెలియని సంద్రంలా...ఉన్న నీ మదిలో....
వెదుకుతూనే ఉంటుంది కనపడని తీరాన్ని
చేరాలనే తపనతో....అర్ధం కాని నీ మనసు
కలశంలో ఓ చిన్ని బిందువులా నా జ్ఞాపకం...
దాగుందేమో అని చిరు ఆశతో...!!
ఆనవాలు ఏమైనా దొరుకుతుందని తపనతో...!!
మరి దొరుకుతుందో....!! లేదో....!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Lakshmi Raghava చెప్పారు...

bagundi

veera murthy (satya) చెప్పారు...

చక్కగా రాసారు...బావుంది!

Priya చెప్పారు...

Too good :)

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు లక్ష్మిరాఘవ గారు, సత్య గారు,
ప్రియ గారు

శ్రీ చెప్పారు...

చాలా బాగుంది మంజు గారూ!....పిక్ తీసేసుకున్నాను...:-)...@శ్రీ

చెప్పాలంటే...... చెప్పారు...

ఎవరికీ చెప్పకండి నేనూ అలానే తీసుకుని మార్చేసాను
థాంక్యు నచ్చినందుకు శ్రీ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner