4, మే 2013, శనివారం

ఎన్నికలని బహిష్కరించండి......!!

అవును మీరు చూసింది నిజమే....!! సరిగానే చూశారు....ప్రస్తుతం మనం అనుభవిస్తున్న జీవితానికి ఎన్నికలు, నాయకులు, ఆ పధకాలు, ఈ పధకాలు, వాగ్దానాలు అవసరం అంటారా...!! ప్రతిసారి ఓటు వేయాలి కాబట్టి ఎవరినో ఒకరిని నమ్మాలి అని ఓటు వేసేసి మన బాధ్యత తీరిందని చేతులు దులిపేసుకోవడం...తరువాత ఎవరు ఏ పార్టిలోకి పోయినా....పనికిరాని సమ్మెలు, ఉద్యమాలు చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకున్నా, తిన్నంత తిన్నా....ప్రజా ఖజానా ఖాళి చేసినా, దేవుని సొమ్ములు తిన్నా, ముఖ్యమంత్రులను మార్చినా, వాళ్ళ ఖాతాలు నింపుకోడానికి ఆ పన్నులని, ఈ పన్నులని మన మీద మోయలేని భారం వేస్తున్నా కడుతున్నామే కాని ఎదురు తిరగలేక పోతున్నాము. ఏం చేయలేక పోతున్నాము. అదేమంటే అంత శక్తి గల దేవుడే చూస్తూ ఊరుకుంటున్నాడు...సామాన్యులం మనమేం చేయగలం అంటూ చేతులెత్తేస్తున్నాం.....!!  ఎప్పుడో ఎవరో కాల్చిన కరంట్ కి మనకి సంబంధం లేక పోయినా కనపడని....పల్లెల్లో అస్సలు కనిపించని కరంట్ కి  పద్దులు కడుతూనే ఉన్నాము మాట్లాడకుండా....!! వాడెవడో తిని పోయాడు నేనేం చేయను అని ఒకడు....రామ రామ మా సొమ్మే పెడుతున్నాం...అయినా అన్యాయంగా నీలాపనిందలు మాపై వేస్తున్నారు అంటూ మరొకరు....పాదయాత్రలు, ప్రగతి పురోగమనానికి పధకాలు అంటూ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు అవాకులు చవాకులు విసురుకుంటూ మరికొందరు...ఇలా వాళ్ళ స్వార్ధం కోసం మాత్రమే పని చేసే నాయకులతో కూడిన ప్రజాస్వామ్యం మనకు ఎంత అవసరమో ఆలోచించండి...?? మన హక్కుల కోసం మనం ఎన్నుకున్న నాయకులకు వాటాలు వడ్డీలు సమర్పించుకోవడం అవసరమా...!! వాళ్ళు వాళ్ళ లాభం కోసం, పదవుల మీద వ్యామోహంతో పార్టీలు పార్టీలు మార్చుతూ శ్రీరంగ నీతులు వల్లిస్తూ మీటింగులు చెప్తూ ఉంటె గంగిరెద్దులా తల ఊపి గొర్రెల్లా వాళ్ళ వెనుక వెన్నెముఖ లేకుండా ఉండటం, వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తడం ఎంత అవసరమో ఆలోచించండి....?? కనీస సౌకర్యాలు లేని పల్లెల్లో....ఇచ్చే రేషన్ లో కల్తి...పురుగుల బియ్యం, ఉడకని పప్పు, ఉప్పొ మన్నో తెలియని అయోమయం...పంటలకు పట్టుగొమ్మలైన పల్లెలలో ఇదండీ ఉచిత పధకాల అమలు. ఆడపిల్లకు అన్ని అని చెప్తూ కాసింత రక్షణ ఇవ్వలేని ఈ అణా కాణి ఓట్ల పధకాలు...ఇంత అభివృద్ధి చెందిన టెక్నాలజీ ఉన్నఈ రోజుల్లో కనీస బస్సు సౌకర్యం లేదంటే చాలా హాస్యాస్పదంగా ఉంది....కాని ఇది నిజం...!! తాగడానికి మంచినీరు లేక పొతే వేసవిలో ఇబ్బందులకు తట్టుకోలేక మంచినీళ్ళ టాంక్ ఊరివాళ్ళ శ్రమ దానంతో....దాతల సాయంతో నిర్మించుకుంటున్నారు. ఎంత మంది నాయకులకి ఎన్ని అర్జీలు పెట్టినా రోడ్డు కాని బస్సు కాని లేని పల్లెల్లు కోకొల్లలు మన దేశంలో. ముసలి ముతకా అయినా ఎవరైనా సరే ప్రాణం పోతున్నా... ఎండ మండి పోతున్నా...మోకాలి లోతు బురదలో అయినా మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పటికి ఉందంటే నమ్ముతారా...!! ఏ నాయకుడు ఏమి చేయనప్పుడు ప్రభుత్వం స్పందిన్చనప్పుడు ఇలాంటి పల్లెలకు ఎన్నికలెందుకు...?? రాజకీయాలెందుకు....?? పార్టిలెందుకు...?? కాల్చని కరంటుకు బిల్లులెందుకు...?? అందుకే  మీకు ఉపయోగం లేని ఎన్నికలను....రాజకీయాలను ఒక్కసారి బహిష్కరించండి....!! ఫలితం చూడండి....!!  
 

10 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శ్యామలీయం చెప్పారు...

మీ‌ బాధ అర్థమయింది.
కాని యెన్నికలను బహిష్కరిస్తే యేం జరుగుతుంది?

- జనం ఓటు వేయకపోయినా పార్టీల అబిమానులూ అనుచరులూ యెలాగూ ఓట్లు వేస్తారు.

- జనం ఓట్ల పండక్కి రావటం లేదని తేలితే పార్టీలు యధేఛ్ఛగా రిగ్గింగుకు పాల్పడతాయి. చివరికి అందరి ఓట్లూ పోలవటం జరుగుతుంది. మీ ఓటూ యెవరికో‌ పడుతుంది, మీ‌ప్రమేయం లేకుండానే.

- ఎంతో కొంతమంది ఓటు వేస్తారు. పోలయిన కాసిని ఓట్లలోనూ ఒకటో రెండో యెక్కువ వచ్చిన వాడు ఓటు వేయని వాళ్ళతో సహా అందరికీ నాయకుడుగా యెన్నికవుతాడు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Shyamaleeyam gaari vyakhya tO ekeebhavisthunnaanu.

అజ్ఞాత చెప్పారు...

I too agree with @శ్యామలీయం

చెప్పాలంటే...... చెప్పారు...

అందుకే వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా ఎన్నికలని బహిష్కరించమని అడిగేది. స్పందించిన అందరికి ధన్యవాదాలు

కెక్యూబ్ వర్మ చెప్పారు...

మీ ధర్మాగ్రహం అభినందనీయం. ఆ రోజు వస్తుందనేది నా నమ్మకమూను..

చెప్పాలంటే...... చెప్పారు...

ఆ రోజు రావాలన్న నా కోరికతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు వర్మ గారు

Praveen Mandangi చెప్పారు...

Do we need to glorify the burqa system to call the people to boycott elections?

Srinivasarao Davuluri చెప్పారు...

Andaruu Bhojananiki kuurchunnavare Mari Vaddinchedi Evaro

చెప్పాలంటే...... చెప్పారు...

bhojanaaniki pilichina vaare vaddinchaali gaa....!!
Thank u Srinivas garu

చెప్పాలంటే...... చెప్పారు...

nenu musugu vesukuni piliva ledu kadandi ennikalani bahiksharinchamani...!! pic maatrame pettanu praveen garu...bahirangam gane cheptunna ennikalani bahishkatinchamani...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner