29, అక్టోబర్ 2013, మంగళవారం

రాతిరి తెరలే.....!!

మనసు మధనం మనిషి చలనం
హృదయ గమనం కాల చక్రం
పురుడు పోసుకున్న అక్షర కవనం

జ్వలించే జ్వలనం ప్రజ్వలనం
దహించే రూపం శాపం
వేధించే జ్ఞాపకాలు చిరపరిచితం

గుచ్చుకుంటున్న గాయాలకు లేపనం
మరపు మందుని సైతం
దగ్గరగా రానీయని అలసత్వం

చెదిరి పోయిన కధల కలలు
విడిచి పోయిన నిట్టూర్పుల నిరాశలు
పోగు చేసుకున్న జీవితాలు

చీకటిలో రంగుల లోకం
చూడాలనుకునే అమాయకత్వం
కాల రాస్తున్న పాషాణ హృదయాలు

అద్దంలో చూసుకున్న ప్రతిబింబం
వెలుగుల జిలుగుల్లో విరజిమ్మే కాంతి రేఖలు
ఒక్కసారికే తట్టుకోలేని అసహాయత్వం

చెంతన లేని చెలిమి చెప్పిన స్వాంతన
దూరంగా ఉన్నా చేరువగా అనిపించే తలపు 
రెప్ప పడక పోయినా రాతిరి తెరలే బావున్నాయి..

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

జ్ఞాపకాల గాయాలకు లేపనం మరపు మందుని సైతం దగ్గరగా రానీయని అలసత్వం
చెదిరిన కలల విడిచిన నిట్టూర్పులు
రంగుల లోకం చూడాలనుకునే అమాయకత్వం
ను
కాల రాస్తున్న పాషాణ హృదయాలు
నిజమే! పగటి వేళల్లో స్పష్టత ఎక్కువై జీర్ణించుకోలేని వాస్తవాలు అవి.
తలపుల రెప్ప పడక పోయినా ఒక్కోసారి ఆ రాతిరి తెరలే బావున్నాయి .... అని అనిపిస్తుంది.
బాగా రాసారు మంజు గారు! అభినందనలు.

Unknown చెప్పారు...

kaburlu kaakaragaayalu aalochimpajesidigaa undi. simply superb,totalgaa post adubutamgaa undi
http://www.googlefacebook.info/

చెప్పాలంటే...... చెప్పారు...

మీ అద్భుత విశ్లేషణ ఆత్మీయ స్పందనకు వందనాలు చంద్ర గారు
మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు అజయ్ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner