15, నవంబర్ 2013, శుక్రవారం

మీలో నింపుకోండి...!!

నిన్న టి వి లో పుత్తడిబొమ్మ సీరియల్ చూస్తుంటే "కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని ఎవరికీ చెప్పలేనప్పుడు మనతో మనమే చెప్పుకుంటే బాధ కాస్త తీరుతుంది అని" .. నవ్వు  వచ్చింది నాకు  మొన్న నేను చెప్పుకుంది నీకంటూ ఎవరు మిగలని రోజు..!! లో అదేకదా అనిపించింది. నాలా ఆలోచించేవాళ్ళు కూడా కొందరు ఉంటారేమో అనిపించింది..నా చిన్నప్పటి నుంచి కోపం వచ్చినా, బాధ అనిపించినా అది అక్షరాల్లో పెట్టడం అలవాటై పోయి అదే వ్యాపకంగా కూడా అయ్యింది..ఏదైనా నాకు నేను చెప్పుకోవడమే అలవాటై పోయింది. కాకపొతే ఇప్పటికి మోసపోతూనే ఉన్నామే అని అనిపిస్తూ ఉంటుంది...అవును మరి ఎవరైనా మనం వాళ్ళని నమ్మితేనే కదా సులభంగా మోసం చేయగలరు...మోసం అనేది ఒక్క డబ్బులు అనే కాదు...మనసులను, మనుష్యులను, బంధాలను, అనుబంధాలను, ప్రేమలను, అభిమానాలను,స్నేహాలను....ఇలా మానవ బంధాలను అన్నింటిని మోసం అనే ముసుగులో మాయ చేయవచ్చు..మనలో జాలి అనేది ఉంటే ఇంటా బయటా మోసపోతూనే ఉంటాము...!! ప్రతి ఒక్కరు మంచివాళ్ళే అనుకుంటూ మనం మోసపోతూనే ఉంటాము ఎప్పటికి...కాస్తయినా కఠినంగా ఉండక పొతే...!! నేను అనుకుంటూ ఉంటాను ఈ మోసపోయే జాబితాలో అన్ని రకాలుగా ముందు ఉన్నది నా పేరేనేమో అని...!! కాకపొతే ఒక్కటే అనుకుంటాను నన్ను మోసం చేసిన వాళ్ళు కనీసం ఒక్కసారయినా నా బాధను అనుభవించక పోతారా...!! అని...అలా అనుకోవడం కన్నా ఏం చేయలేను కదా వాళ్ళను...!! కాకపొతే ఒక్కటి చెప్పగలను అందరిని సులువుగా మోసం చేయలేరు అని....మోసపూరిత మనసుతో నటిస్తే ఆ నటన పైవాడి ఖాతాలో జమ అవుతుంది..లెక్కలు వాడే తేలుస్తాడు ఎవరివయినా...!! మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది...మన తప్పు ఒప్పులు మనకన్నా బాగా దానికి తెలుసు...దానిని నిద్ర పుచ్చకండి జోల పాడి..మనసు మాటలు వింటూ ఉండండి అప్పుడప్పుడు....!! మీకు తెలియని మీలొ మిమ్మల్ని మీకు చూపిస్తుంది...అద్దంలో ప్రతిబింబంలా....అప్పుడు నిజాన్ని ఒప్పుకోగలిగే గుండె ధైర్యాన్ని మీలో నింపుకోండి...!! అప్పుడు మన తప్పులను ఒప్పుకోగలిగే ఆత్మస్థైర్యం మెండుగా ఉండాలి....మనకు బావుందని అబద్దంలో బతకకుండా కష్టమైనా నిజంలో నిజాయితీగా గర్వంగా బతకగలిగితే ఎంత బావుంటుందో ఒక్కసారి ఊహించి చూడండి....నిజమే కదా ఆ ఊహే ఇంత బావుంటే అదే వాస్తవం అయితే ఇంకెంత బావుంటుంది చెప్పండి...!! 

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

"జాలి అనేది ఉంటే ఇంటా బయటా మోసపోతూనే ఉంటాము...! ప్రతి ఒక్కరు మంచివాళ్ళే అనుకుంటూ, నేను అనుకుంటూ ఉంటాను ఈ మోసపోయే జాబితాలో అన్ని రకాలుగా ముందు ఉన్నది నా పేరేనేమో అని...!
...........
మనస్సాక్షి అనేది ఒకటి ఉంది...మన తప్పు ఒప్పులు మనకన్నా బాగా దానికి తెలుసు...దానిని నిద్ర పుచ్చకండి"

మనసు మాటలు మంచి మాటలు చాలా బాగా చెప్పారు. "మీలో నింపుకోండి..." ప్రోస్ లో. మంజు గారు అభినందనలు

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చంద్ర గారు మీ ఆత్మీయ స్పందనకు

అజ్ఞాత చెప్పారు...

ఎప్పుడూ మంచితనాన్ని పోగొట్టుకోకండి. మనస్సాక్షే మనకెప్పుడూ తోడు.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అను గారు :) నన్ను నేను ఎప్పుడు పోగొట్టుకోను

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner