26, డిసెంబర్ 2013, గురువారం

రజతోత్సవం జరుగుతున్న రోజు....!!

సరిగ్గా ఈ రోజుకి అంటే డిసెంబరు ఇరవై ఆరుకి రెండు వర్గ పోరాటాల మధ్య సామాన్యులు, అమాయకులు నష్ట
పోయిన జీవితాలకి పాతిక సంవత్సరాలు నిండి రజతోత్సవం జరుగుతున్న రోజు.... బెజవాడ  తో సహా చుట్టుపక్కల జిల్లాలు, కోస్తా లోని చాలా ఊళ్ళు ఇప్పటికి మర్చిపోలేని రాక్షసత్వానికి ప్రతీకగా మిగిలిపోయిన రోజు....రెండు రౌడి వర్గాల మధ్య జరిగిన హత్యా రాజకీయాలు ఎందరికో శోకాన్ని..మరెందరికో జీవితాల్ని లేకుండా చేసినరోజు...!!
రంగా, మురళి ఎవరో కూడా తెలియని ఎందఱో ఈ క్రీడలో బలి అయ్యారు... అలా నష్ట పోయిన ఊళ్ళలో ఒకటి మా ఊరు కూడా.. జరిగి పాతిక ఏళ్ళు అయినా తలచుకుంటే ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది ఆ రోజు... అంతకు ముందు రోజే మా అరుగుల మీద కూర్చుని అందరికి పీపుల్ ఎన్ కౌంటర్ పుస్తకంలో ముద్రగడ పద్మనాభం ఇంటర్వూలో  "రంగా కి ఏమైనా జరిగితే ఆంధ్రా లో మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది" అని చదివి వినిపిస్తూ ఎవరీ రంగా ఏంటి గొడవ అనుకున్నా...మరుసటి రోజు పొద్దున్నే గోల గోలగా ఉంది అవనిగడ్డలో సూర్యనారాయణ గారి రైస్ మిల్లు తగలబెట్టారు అని కాస్త  వెళ్లి చుస్తే బాగా పొగలు కనిపించాయి...మన ఊఋ కుడా వస్తారంట అందరు జాగ్రత్తగా ఉండండి అని అనుకుంటున్నారు అందరు...మధ్యాన్నం రానే వచ్చింది.. సాయంత్రం నాలుగు ఐంది అనుకుంటా కారం పొట్లాలు ఆడవాళ్ళను  ఊరి మధ్యలో గుడి దగ్గరకు రమ్మని చెప్పారు అందరిని.. తీరా వెళితే ఏముంది అక్కడ చుట్టూ అన్ని తలకాయలే కనిపించాయి నల్లగా కనుచూపు మేరా.... అప్పటికే అందరు పొలాల్లోకి పారిపోయారు... ఇంట్లో అందరమూ అన్ని దారులు అయ్యాము..పొలాల్లో దాక్కున్నాము...నేను మా ఇంటి దగ్గర అక్క వాళ్ళతో వెళ్తూ వాళ్ళ ఇంట్లో నుంచి అక్క వాళ్ళ అమ్మాయి కర్చీఫ్ లు మాతరం తెచ్చింది.. అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నాము... నాకేమో నోరు ఊరుకుని చావదాయే ఏదో ఒకటి ఆ టైములో కూడా జోక్స్ వేస్తూనే ఉన్నా కాస్త భయం పోగొట్టడానికి అన్నట్టుగా....పాపం అందరు టెన్షన్ లో ఉన్నారుగా మమల్ని తిట్టారు...ఈ లోపల మా నాన్న వాళ్ళు వెదుక్కుంటూ వచ్చారు.. వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని పిలుస్తుంటే విళ్ళేమో పలకొద్దంటారు... మొత్తానికి ఊళ్లోకి వెళ్తే ఏముంది అక్కడ చుట్టూ మంటలు, నిప్పులు, పొగలు... ఊరు మొత్తం తగలబెట్టేసారు.... పెంట కుప్పలతో సహా...!! ఇద్దరినీ చంపేశారు.. కొంత మందిని బాగా కొట్టారు...మా ఇంటికి ఏం కాలేదు కాని తా రోజు వేయని భయం తరువాత నెల రోజులు నిద్ర పొతే ఒట్టు... నాలుగైదు రోజులు చీకటి పడితే చాలు ఇంట్లో ఎవరిని ఉండనివ్వలేదు నేను... అంతా చుసానేమో బాగా భయం వేసింది..నాలుగైదు కుటుంబాలు మా ఇంట్లోనే ఉన్నారు..రోజు ఖాళి లేకుండా వచ్చి చూసి పోయేవారికి లెక్కే లేదు... సంక్రాంతికి ముందు కొందరైతే అరిసెలు, ఇంకా ఏవో తెచ్చి పంచి పెట్టారు.. మా ఇల్లు బానే ఉంది మాకు వద్దు అంటే ఇలా ఉంది మీరేం చేసుకుంటారు అని బలవంతంగా ఇచ్చి పోయారు....చాలా అందంగా ఉండే మా ఊరు బూడిద కుప్పలా మారిపోయింది...!! ఎందుకో టి వి చూస్తుంటే నాకు ఆ రోజు జరిగింది గుర్తు వచ్చి ఇలా మీతో పంచుకుంటున్నా....!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

"రెండు రౌడి వర్గాల మధ్య జరిగిన హత్యా రాజకీయాలు ఎందరికో శోకాన్ని .... మరెందరికో జీవితాల్ని లేకుండా చేసినరోజు ...."
దానే జరిగిపోయిన బీభత్సానికి రజతోత్సవ సంతాప దినం అనొచ్చేమో మంజు గారు....కళ్ళతో చూస్తున్నట్లే ఉంది ఘటనను చదువుతున్నంత సేపూ. చాలా బాగా రాసారు.

చెప్పాలంటే...... చెప్పారు...

నిజమే చంద్ర గారు ...ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

ఈ విషయం మీద గతంలో డిసెంబరు 26 అని నేను ఒక టపా వ్రాసాను. వీలైతే చదవండి. http://bonagiri.wordpress.com/2009/12/27/%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%81-26/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner