29, డిసెంబర్ 2013, ఆదివారం

ప్రయాణమా... పైకి పోవడమా....!!

ప్రయాణంలో పదనిసలు అని ఒకప్పటి మాట...మరి ఇప్పుడో మనకి తెలియకుండా చనిపోవడానికి చక్కని ప్రయాణ ప్రమోద మార్గం...!! ప్రయాణమా... పైకి పోవడమా....!! అనిపిస్తోంది...ప్రతి రోజు జరుగుతున్న ఈ ఘోరాలు చూస్తుంటే...ఇంట్లో ఉన్నా ఎప్పుడు ఏ దారిలో వస్తుందో తెలియని వింతలా మృత్యువు తలుపు తట్టకుండా వచ్చేస్తోంది....ప్రశాంతంగా నిద్ర పోయే సమయంలో ఇంట్లోకి లారీల భూతాలు...చల్లగా ఉంటుంది కదా అని శీతల వాహనాల్లో ఖరీదైన ప్రయాణాలు కాస్త జాగ్రత్తగా ఉంటాయని మనం అనుకుంటుంటే అవే మన ప్రాణాలను ఖరీదుకు అమ్మేస్తున్నాయి.... రూపంలో సహాయ నిధుల కింద...!! లోపం ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఎన్ని బస్సు , రైలు ప్రమాదాలు జరిగినా ప్రభుత్వాలు అన్ని నిమ్మకు నీరెత్తినట్టుగా మా పరిధి కాదు అని కేంద్రం, మాకు సంబంధం లేదు అని రాష్ట్రాలు తప్పించుకుంటున్నాయి...ప్రభుత్వ,  ప్రైవేటు సంస్థలు కాస్తయినా వాళ్ళ వాళ్ళ లాభాల గురించి ఆలోచించడం మానేసి ప్రయాణికుల క్షేమాన్ని కాంక్షిస్తే ఈ ఘోరాలు కాస్తయినా తగ్గుతాయి...అన్ని లంచాలతో కలుషితం అయిపోయి డబ్బులకు అమ్ముడు పోయి జనాల ప్రాణాలతో మాడుతున్నాయి... ఓ రకంగా ఇందుకు మనము భాద్యులమే అనిపిస్తుంది...మన పని తొందరగా అవడం కోసమో... మరొకందు కోసమో డబ్బిచ్చి మనమే అలవాటు చేస్తున్నామేమో...!! అంతా సరిగా ఉందొ లేదో అని సరి చూడాల్సిన అధికారులు నామ మాత్రంగా చేసి కనీసం తాము తీసుకునే జీతానికి కూడా ఆ కాస్త పని చేయకుండా ఇలా జనం ప్రాణాలతో ఆడుకుంటున్నారు....!! మీ మీ అవసరాల కోసం అమాయక ప్రాణాలను బలిగొనవద్దని వేడుకుంటున్నాము...!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

మరో ప్రస్థానం, మహా ప్రస్థానం అవుతోంది.

చెప్పాలంటే...... చెప్పారు...

అవునేమో అండి .. ధన్యవాదాలు

vemulachandra చెప్పారు...

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కాస్తయినా వాళ్ళ వాళ్ళ లాభాల గురించి ఆలోచించడం మానేసి ప్రయాణికుల క్షేమాన్ని కాంక్షిస్తే ఈ ఘోరాలు చాలా వరకు తగ్గుతాయి. స్వార్దం తో కలుషితం అయి అటు అదికారులు ఇటు ప్రైవేటు వ్యాపారులు జనాల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు.
చక్కని సామాజిక భావన ప్రతి ఒక్కరమూ ఆలోచించాల్సిన విషయం
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner