30, జనవరి 2014, గురువారం

వేసిన ముడులు ముళ్ళుగా తగులుతుంటే...!!

అదేంటో మరి అందరిలా నేను ఉంటే సరి పోయేదేమో....ఎందుకులే అని సరిపెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఎప్పుడూ సర్దుకు పోవడమే సరి పోతోంది... అది కావాలి ఇది కావాలి అని రాచి రంపాన పెట్టిన పాపాన పోలేదు...ఉన్న దానితో సరిపెట్టుకుంటుంటే అదే తప్పుగా మిగిలి పోయింది...నీలా బాధ్యతలను గాలికి వదిలేసి మంచితనం అనే ముసుగును కప్పుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు...తప్పుని సరిపెట్టుకోలేని నిస్సహాయత నాది కావచ్చేమో...కాని మనసుని చంపేసిన నీ మంచితనం నాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు...నీ బతుకు కోసం నీ వాళ్ళ కోసం బతికి చూడు అప్పుడు తెలుస్తుంది నీకు కుటుంబం బంధం భాద్యత అసలైన సంతోషం అంటే ఏమిటో....!! నీ చుట్టూ తిప్పుకుంటున్న నలుగురు నీ ఆపదలో అడ్డు పడ్డారా ఎప్పుడైనా...!! అబద్దంలో బతకడంలో నీకు ఆనందం ఉందేమో అది నిజమైన సంతోషం కాదు...నీతో నువ్వు నిజాయితీగా ఉండగలుగుతున్నావా ఎప్పుడైనా....నీతో నీకే బతకడం రానప్పుడు ఇక మాతో ఏం కలిసి బతకగలవు...సున్నితమైన బంధాలు నీకు ఈ జన్మకి అర్ధం కావేమో.. అహంకారాన్ని అభిమానంగా మార్చి చూడు...అసలు నిజాలు తెలుస్తాయి...అహంకారమే ఆత్మాభిమానం అనుకుంటే...నువ్వు ఎందరున్నా ఎవరు నీకంటూ లేని ఏకాకి లా మిగిలి పోతావు...నీ గొప్ప నువ్వు చెప్పుకోవడం కాదు నలుగురు చెప్పుకోవాలి... అంతే కాని గొప్ప కోసం ఇంట్లో వాళ్ళని ఉసురు పెట్టి భజన చేయించుకోవడం కాదు.. కాస్తయినా మానవత్వం ఉన్న మనిషి అయితే బతుకుతున్న ఈ జీవితం ఎవరి వల్ల వచ్చిందో...మన కృతజ్ఞత ఎంత వరకు వాళ్ళ పట్ల ఉందో.... ఒక్కసారి మనసుని అడిగితే అది చెప్పే సమాధానం వింటే..వినగలిగే మనసు నీకుంటే నీ కుటుంబం నీకు మళ్ళి కొత్తగా పరిచయం అవుతుంది...కుటుంబం అనేది నీ గొప్ప కోసం నలుగురికి చెప్పుకోవడానికి కాదు...అనుబంధాలను, అభిమానాలను, ఆప్యాయతలను, కష్టాలను, కన్నీళ్ళను కలసి పంచుకోవడం...కట్టుకున్న బంధానికి, మనసుకు, మనిషికి ఆసరా, భరోసా...నేను మీతో ఉన్నా..ఉంటా ...అన్న నమ్మకం..ముడి వేసుకున్న పాశానికి అనుక్షణం ఆలంబనగా ఉంటావన్న నిజాయితీ తో కూడిన ఆత్మీయత పంచగలిగితేనే ఆ బంధానికి అసలైన అర్ధం...!!వేసిన ముడులు ముళ్ళుగా తగులుతుంటే తట్టుకునే శక్తి ఎన్నో రోజులు ఉండదు...మనసుని జీవితాన్ని... మరచి పోవడానికి కాలం సాయం చేస్తుంది...కాని ఆ ముళ్ళు గుచ్చిన గాయాల గురుతులు మాసిపోక యుగాల వరకు కాల్చుతూనే ఉంటాయి...అందమైన జ్ఞాపకాలుగా మిగిలి పోక అసంపూర్తి జీవితంగా ఉండి పోతుంది....తప్పు ఎవరిదో తెలిసే సరికి ఓ జీవిత కాలం ఆలస్యమై పోతుంది...మరి మార్పు ఎవరిలో రావాలో...!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Unknown చెప్పారు...

మంజుగారు చాలా బాగా రాసారు అని పొడిమాటల్లో చెబితే సరిపోదు.నా హృదయాన్ని బాగా కదిలించింది. ఎంతో నిజాయితీగా రాసారు, జీవితంలో ఎంతోమంది ఇలాంటి బాదననుభవిస్తున కuూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో వున్నారు. అటువంటి వారి బాధను గుర్తమంచి మీరిది రాసినట్లుగా అనిపించింది. మన మనసు ఒక్కోసారి ఎవ్వరికీ చెప్పుకోలేని మానసిక వ్యధను అనుభవిస్తుంది. అలాంటప్పుడు ఇలా్ మాటలరూపం లో రాసుకన్నదది చదదివితే మనసుకి ఎంతో స్వాంతనగా వుంటుంది.

Unknown చెప్పారు...

మంజుగారు చాలా బాగా రాసారు అని పొడిమాటల్లో చెబితే సరిపోదు.నా హృదయాన్ని బాగా కదిలించింది. ఎంతో నిజాయితీగా రాసారు, జీవితంలో ఎంతోమంది ఇలాంటి బాదననుభవిస్తున కuూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో వున్నారు. అటువంటి వారి బాధను గుర్తమంచి మీరిది రాసినట్లుగా అనిపించింది. మన మనసు ఒక్కోసారి ఎవ్వరికీ చెప్పుకోలేని మానసిక వ్యధను అనుభవిస్తుంది. అలాంటప్పుడు ఇలా్ మాటలరూపం లో రాసుకన్నదది చదదివితే మనసుకి ఎంతో స్వాంతనగా వుంటుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

నిజమే భారతి గారు చూస్తున్నది...మనసు అనుభవిస్తున్నది రాశాను...ఎవరికీ చెప్పడానికి ఎవరు లేరు అనుకున్నప్పుడు ఇలా అక్షరాల్లో పంచుకుంటే ఎందుకో బావున్నట్టుగా అనిపిస్తుంది ....అర్ధం చేసుకున్న మీ మంచితనానికి నా మనఃపూర్వక వందనాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner