20, డిసెంబర్ 2019, శుక్రవారం

మాటలు నీటి మీది రాతలు...!!

మాటలు నీటి మీది రాతలు...!!

ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్నారెవరో... ఓ ఇది మేనిఫెస్టోలో లేదు కదా.. అంటారా.. సరేనండి.. మెుత్తానికి రివర్స్ ముఖ్యమంత్రిగా, డైవర్షన్ ముఖ్యమంత్రిగా పేరు సంపాదించేసుకున్నారు...😊

మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందండి. ఓటు కోసం, మత ప్రచారం కోసం కాదు సార్ పని చేయాల్సింది. రాష్ట్రం కోసం పని చేయండి. చట్ట సభల్లో ఏం జరుగుతోందో అందరిని చూడనివ్వండి. చక్కని పదాలు మీ సభ్యుల నుండి నేర్చుకుంటారు. చరిత్ర కూడా బాగా తెలుసుకుంటారు.

ఆఁ.. రాష్ట్రం కోసం కష్టపడినోడికి ఏమిచ్చారు ఆంధ్రులంటారా..!!

అదీ నిజమేలెండి... 3 రాజధానులు కాకపోతే 33 రాజధానులు చేయండి. మీకడ్డేంటండి. భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న మీ కలను సాకారం చేసుకుని అదే భాషను లేకుండా చేయాలన్న మీ ప్రయత్నం ఎంత వరకు సమంజసమెా ఆలోచించండి. ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన రాష్ట్రం పురోగతిలో ప్రయాణించదండి.

ఓ రోజేమెా అక్రమ కట్టడాలంటారు. మరోరోజేమెా మద్యం అంటారు. ఇంకోరోజేమెా అమరావతే రాజధాని అని శాసనసభలో చెప్తారు. మళ్ళీ అదే సభలో 3 రాజధానులంటారు. తెలుగే తీసేస్తానంటారు. 21 రోజుల్లో న్యాయమంటారు. పరిపాలన పారదర్శకమంటారు. కేస్ పెట్టడానికి వెళితే ముప్పు తిప్పలు పెడతారు EASE అని చదవడం రాని పోలీసు పెద్దలు. మెుత్తానికి తిరిగి తిరిగి కేస్ పెడితే ఎఫ్ ఐ ఆర్ చెత్తబుట్టలో వేస్తారు. ఇదేనా అండి చట్టం, న్యాయం అందరికి సమానమంటే?

అభివృద్ధి గురించి అడిగినా, ఎన్నికల ముందు మీరు చేసిన, చెప్పిన వాగ్దానాల గురించి ఎవరైనా అడిగితే మేనిఫెస్టోలో చూడండి అంటారు. లేదంటే మీ పేటియం బాచ్ తో ట్రోల్ చేయిస్తారు. మీ అనుయాయులను ఎవరైనా ఏ చిన్న మాటన్నా కేస్ లు పెట్టి జైల్ లో పెట్టిస్తారు లేదంటే కొట్టడమెా, చంపించడమెా చేస్తారు. గత ప్రభుత్వం చేసిందంతా అవినీతేనంటారు.

మహిళలంటే అపారమైన గౌరవమంటారు. మాకు కనీస న్యాయం జరగడం లేదు. బిల్లులు, చట్టాలు చేసినంత త్వరగా వాటిని అమలు జరపండి. కనీసం పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆపడానికి ప్రయత్నించండి. పార్టీలకు, కులమతాలకు అతీతంగా పనిచేస్తున్నామంటూ మత ప్రచారం ముమ్మరంగా చేసుకుంటున్నారు. రంగులేయడం కాదండి ప్రజల అవసరాలు గమనించండి.

మీ రైతు భరోసా, చేనేత కార్మికుల, ఆటోవాలాల, కాపుల, వృద్ధుల, నిరుద్యోగుల, చదువుల వగైరా భరోసాలు, చేయూతలను అందుకోవడానికి పంచాయితీ కార్యాలయాల చుట్టూ తిరగడమే సరిపోతోంది. మా బతుకులన్నీ ఆధార్ కార్డ్, బాంక్ అకౌంట్ లు కాపీలు తీయించి ఇవ్వడానికే సరిపోతున్నాయి తప్ప రూపాయి వచ్చిన పాపాన పోలేదు. 

ఆరు నెలలు గడిచినా రోజూ ఏదోక దుమారం లేపి జనాన్ని దారి మళ్ళించడం కాకుండా కాస్త పని చూడండి సార్. ఏదో సామాన్యులం మా గోడు వెళ్ళబోసుకున్నాం. మామీద మీ అధికారాన్ని ఉపయెాగించక కాస్త ఆలోచించండి సార్. 





4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// "3 రాజధానులు కాకపోతే 33 రాజధానులు చేయండి" //

బాగా వ్రాశారండి. ఇవాళ టీవీ ఛానెళ్శలో ఒక వార్త మోత మోగిపోయింది. 3 రాజధానులు కాకపోతే 30 రాజధానులు పెట్టుకుంటాం, కేంద్రానికేం సంబంధం అని సాక్షాత్తు ఒక మంత్రి గారు (పెద్దిరెడ్డి‌ గారికి) సెలవిచ్చారని వార్త. తను ఉన్న పొజిషన్ గానీ, సమస్య పట్ల సంస్కారవంతంగా మాట్లాడదామని స్పృహ ఉన్నట్లు లేదు. ఏదో తమ బాస్ ని అన్నివేళళా సమర్ధిస్తున్నట్లు బాస్ కు చూపించుకోవాలనే తాపత్రయమే ఎక్కువలా ఉంది.

ఆంధ్రప్రజల దురదృష్టం.

అజ్ఞాత చెప్పారు...

People get the government they deserve విన్నకోట గారూ.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Of course, of course Anonymous గారూ. Very true.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలండి మీ స్పందనకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner