13, మే 2020, బుధవారం

ఏంటో పాపం...!!

నేస్తం,

  మనం మన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే వెసులుబాటున్నప్పుడు, అదే అవకాశం మిగతావారికి కూడా ఉంటుందని ఎందుకు ఆలోచించలేకపోతున్నాం. కళ్ళున్నా చూడలేని చదువుకున్న మూర్ఖులు ఎందరితోనో మనం కలిసి సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఒకరంటారు ప్రతిపక్షం సరైన బాధ్యత తీసుకోవడం లేదని. మరొకరంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీస బాధ్యతగా అసెంబ్లీకి రాని వాడికి అధికారం కట్టబెట్టిన జనాన్ని ఏమనాలని. విషవాయువుతో ప్రాణాలు కోల్పోయిన జీవాలకు కోట్లు వెదజల్లుతామంటున్నారు కాని దానికి కారణమైన వారిపై కనీస చర్యలు తీసుకోలేదు. ఎదురు బాధితులు మీద కేసులు పెట్టడం, కరంటు బిల్లులు ఇస్తున్న షాక్ నభూతో నభవిష్యతి.
మీకు వ్యక్తి నచ్చితే గుడి కట్టి పూజ చేసుకోండి,తప్పులేదు. కాని రాష్ట్రం ఏ స్థితి నుండి ఏ స్థాయికి పడిందో లేదా ఎగసిపడిందో, ఈ సంవత్సరం నుండి జరిగిన అభివృద్ధిపై కాస్త ఓ పోస్ట్ రాద్దురూ. మేమూ చూసి సంతోషంతో కడుపు నింపుకుంటాం. అంటే మీ దృష్టి కోణంలో పురోగతి ఏమిటో వివరించమని మనవి. పాలన చేయాల్సింది, రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టాల్సింది (మీ దృష్టి లో ఇంతకు ముందు ఏమి అభివృద్ధి జరగలేదు కదా) పాలకపక్షమని మరిచిపోతే ఎలాగండి? కుల వివక్షతో ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయని పాలనని మీకనిపించక పోవడం దురదృష్టం. పారదర్శకులమని చెప్పుకుంటే చాలదు. పార్టీలకు కొమ్ము కాయమని చెప్పుకుంటే సరిపోదు. ఎవరికి వారు అందరు గురువింద గింజలే మరి. మనం ఒకటి అంటే ఎదుటివారు వంద అనగలరు..పడే వాడికి తెలుస్తుంది ఆ బాధ. ఒడ్డున ఉండి సవాలక్ష చెప్తాం మనదేం పోయిందని. గౌరవం మనకంటూ మనం ఇచ్చేటట్లు ఎదుటివారి ప్రవర్తన ఉండాలి. పదవి, అధికారానికి విలువ ఇవ్వాలంటే  వాటికి వన్నె తెచ్చే వ్యక్తిత్వం వారికుండాలి. అంతేకాని అడుక్కుంటేనో, భయపెడితేనో గౌరవం ఇవ్వరు.. జర గుర్తుంచుకోండి సారూ... 😊

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

మాకవన్నీ తెల్వదంటే తెల్వదు, మా జగనన్న ఏమిచేసినా గొప్పే, కళ్లున్న కబోదులము, అందుకనే మమ్ములను ఓ రమేమంటే గిట్టని వారంటారు జఫ్ఫా లమని. ఓ కులమంటేనో, ఓ ప్రాంతమంటేనో, ఓ రాష్ట్రమంటేనో అంతెందుకు ఓ మతం అంటేనో పడని మా అందరకీ కావాల్సింది గన్నేరు పప్పు మంచిదనే. కాదంటారా మీ ఖర్మ, పాలెగాళ్ల కీర్తనలు తర తరాలుగా కీర్తించన మాకు తెలిసింది నయా పాలేగాళె గాడికి భట్రాజు పొగడ్తలు పొగడటమే, అది మా కొమ్మను నరుక్కోవటం అని తెలిసినా సరే.

చెప్పాలంటే...... చెప్పారు...

నిజం చెప్పారు..
థాంక్యూ

అజ్ఞాత చెప్పారు...

విజనరీ డౌన్ డౌన్..
ప్రిజనరీ జిందాబాద్..

అజ్ఞాత చెప్పారు...

మనఃశుద్దిగా ఒక నిజాన్ని ఒప్పుకొండానికి మన పాలెగాళ్ళెవరికి మనసు రాదు. మనకున్నది ఇద్దరు కామందులు. ఇక్కడ రాసేవాళ్ళెవరైనా సరే ఇద్దరిలో ఎవరో ఒకరి పాలేగాళ్లే. వీళ్ళది వాళ్ళూ, వాళ్ళది వీళ్ళూ, అది ఎంత మంచి విషయమైనా సరే ఒప్పుకోరు. మధ్యలో కొందరు వికట కావులు. కాదనే వారుంటే, ఒక్కటంటే ఒక్కటి, నిష్పక్ష పాతంగా రాసే బ్లాగ్ ఏదన్నా ఒకదానిని చూపిస్తే దణ్ణం పెడతాను. దొందూ దొందే కాదు అందరూ అందరే.

అజ్ఞాత చెప్పారు...

తర తరాలుగా పాలెగాళ్ళకు పద్యాలు పాడే భట్రాజు బ్యాచ్ వాళ్ళ పని మాత్రం మానరు అంటారు, అంతేగా :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner