4, డిసెంబర్ 2009, శుక్రవారం

నా ఆలోచన

హాయ్, నా పేరు మంజు అండి. నా సంతోషాన్ని మీ అందరి తో పంచుకోవాలి అనిపించింది. అందుకే ఈ మెయిల్. బోర్ కొడితే సారీ అండి.నాకు చిన్నప్పటి నుంచి OLDAGE హోం స్టార్ట్ చేయాలి అని బాగా వుండేది.ఒక సారి సతీష్ తో ఏదో మాట్లాడుతూ చెప్తే తను ఓల్డేజ్ హోం కన్నా చిన్నపిల్లలకి ఏదైనా చేస్తే బాగుంటుంది నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను చాలా పెద్ద ప్రాజెక్ట్ అని అన్నాడు.సరే చుద్దాములే అనిఅనుకున్నాను, అప్పటికి నేనే సెటిల్ కాలేదు.౩ ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారికి చెప్పాను. అమ్మ నాన్న లేని పిల్లలకు ఏదైనా చేయాలి కనీసమోక్కళ్ళకి అయినా హెల్ప్ చేయాలి అని .......అలా ఆ... ఆలోచనే ఈ రోజు ఒక ఛారిటబుల్ ట్రస్ట్ గా రూపొందింది .అమ్మ నాన్న లేని పిల్లలు ఎంత వరకు చదువుకుంటే అంతవరకు హెల్ప్ చేయడం వాళ్ళు జాబు లో సెటిల్ ఐయ్యే వరకు హెల్ప్ చేయడమని స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ ఇద్దరికి ఇచ్చాము, కానీ ఈ ఇయర్ 50 మందికి ఇచ్చాము. కొంత మందికి బుక్స్, కొంతమందికి ఫీజు మరి కొంత మందికి బుక్స్+ ఫీజు + ఫుడ్ ఇలా వీలైనంత వరకు చేసాము.స్టార్ట్ చేసింది 2008 జనవరి 23. కానీ అంతకు ముందు నుంచే మొదలు పెట్టాము.2007 లో ఇద్దరి తో మొదలు పెట్టి ఈ ఇయర్ కి మొత్తం ఫిఫ్టీ మెంబెర్స్ కి ఇవ్వగలిగాము.నాతొ పాటు మా నాన్న గారి ఫ్రెండ్స్, మా వురి వాళ్ళు అందరు కలిస్తే నే ఇది సాద్యం ఐంది ఇప్పటికి.
నేను అమెరికా లో వున్నప్పుడు పేపర్స్ లో చిన్న పిల్లల్ని వదిలేయడం, పారవేయడం ఇలా ఎన్నో రోజూ చదువుతూ వుండే దాన్ని.ఆ న్యూస్ చూసినప్పుడల్లా ఇలా జరగకుండా ఏదైనా చేయాలి అనిపించేది. ఆ ఆలోచనకు రూపమే ఈ ట్రస్ట్. ఒక రోజు నా ఫ్రెండ్ అన్నది కుడా నిజమే కదా."ఓల్డ్ ఏజ్ వాళ్ళకుచేయాలి కానీ చిన్న పిల్లలు ముందు.వీళ్ళకు ఏదైనా చేస్తే వాళ్ళు మంచిగా సెటిల్ అవుతారు కదా అనిపించింది.నెక్స్ట్ దీనిలోనే ముందు ముందు ఓల్డ్ ఏజ్ హోం కుడా ఆడ్ చేస్తాము. నా ఫ్రెండ్ కి చాలా చాల థాంక్స్ చెప్పాలి ఈ విషయం లో. నాసంతోషాన్ని మీ అందరి తో పంచుకుందాము అని అనిపించి ఇది రాసాను. బోర్ కొట్టిస్తే క్షమించండి...........మంజు
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner