31, మార్చి 2011, గురువారం

అజ్ఞాతవ్యక్తి ఎవరో....మరి!!

నిన్నటి అసలు సిసలైన ఆటలో పరుగుల్లో ప్రావీణ్యం తనవంతుగా దురదృష్టం కొద్ది చూపలేక పోయిన యువరాజ్ అభిమానుల్ని కొద్దిగా కాదు బాగానే నిరాశ పరిచినా వికెట్లు తీయడంలోను, కాచ్ పట్టడంలోను, ఫీల్డింగ్ లోను తనదైన ప్రతిభని బానే చూపించాడు. మరి తన మెరుగుపడిన ఆటకు స్పూర్తి అయిన తన వెనుకున్న అజ్ఞాతవ్యక్తిని ఎప్పుడూ పరిచయం చేస్తాడో అందరికి? మనం అందరం ఆ కనపడని అజ్ఞాతవ్యక్తి కి అభిననదనలు చెప్పాల్సిందే....!!

కొన్నాళ్ళకు కనుమరుగయ్యేవి......

గతాన్ని మర్చిపోలేము....జ్ఞాపకాల్ని మర్చిపోలేము....
బంధాలు అనుబంధాలతో మిళితమైన జ్ఞాపకాలు...
అవి పంచిన అనుభూతుల పరిమళాల ఆస్వాదనలు
ఎప్పటికీ మిగిలి పోతాయి నిత్యనూతనంగా....
ఎన్నో జ్ఞాపకాల అరల దొంతరల్లోని ఓ జ్ఞాపకం
ప్రతి క్షణం పలకరించే ఏదో ఒక జ్ఞాపకపు తలపు
మనలోని సంతోషానికో బాధకో నెలవు....
అలా మనతోనే ముడిపడిన, మనతోనే వున్న...
ప్రతి గతకాలపు జ్ఞాపకము....ఓ తీపి/చేదు గురుతు...
కొన్నాళ్ళకు కనుమరుగయ్యేవి జ్ఞాపకాలు కాదు....మనమే..!!

30, మార్చి 2011, బుధవారం

టీంఇండియా గెలవాలి....కప్ మనదే కావాలి....!!

గెలవాలి గెలవాలి భారతీయులుగా గెలవాలి. ఆడాలి ఆడాలి భారతీయులుగా ఆడాలి...అప్పుడే గెలుపు తలుపు తడుతుంది....వంద కోట్ల మంది భారతీయుల కల నిజమౌతుంది....ఎన్నో రోజులుగా ఎదురు చుసిన తరుణం వచ్చేసింది, బాధ్యతగా, కలసికట్టుగా ఆడితే తిరుగులేని విజయం మనసొంతం. రికార్డులు, రివార్డులు, అవార్డులు, డబ్బులు కాకుండా సమిష్టిగా జట్టు విజయానికి కృషి చేస్తే అదే అదే భరతమాతకు అంకితమిచ్చే గెలుపుని అందుకున్న వారమై ఎగరేస్తాం భరత జాతి విజయకేతనం. ప్రపంచమంతా రెప రెపలాడుతూ సగర్వంగా నింగికెగురుతుంది మన జెండా!! ఆ క్షణం కోసమే ప్రపంచ మంతా వున్న కోట్లాది మంది ఎదురు చూస్తున్నతరుణం వచ్చేసింది. ఇదే అసలైన పోరు...గెలుపు కోసం మనం ఎదురు చూడటం కాకుండా ప్రపంచమంతా ఉత్కంఠభరితంగా ఈ రోజు ఫలితం కోసం ఎదురు చూడటమనేది ప్రపంచ చరిత్రలోనే ఇంతకు ముందు లేదు. ఎప్పుడైనా భారత పాకిస్తాన్ జట్ల మద్య జరిగే క్రికెట్ పోటికి వున్నంత ఉత్కంఠత మరే జట్ల మద్య వుండదు. యావత్ ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న క్షణాలు దగ్గరకు
వచ్చేసాయి ఫలితం కోసం ప్రతి ఒక్కరు
ఎదురు చూస్తూనే వున్నారు మరి ఏమౌతుందో ఏమో....!!
అందరి పూజలు ప్రార్ధనలు ఫలించి టీంఇండియా గెలవాలి....
రోజు ఉత్కంఠ భరితమైన ఆట కోసం తప్పక చూడండి
www.cricdude.com


29, మార్చి 2011, మంగళవారం

ఆలోచిస్తారు కదూ...!!















నిన్నటి పాడుతా తీయగా ఎంతమంది చూసారో నాకు తెలియదు గాని, పిల్లల ఫైనల్స్ అని మొదలు పెట్టి పద్మభూషణ బిరుదాంకితుడు, ఎన్నో ఆణిముత్యాలాంటి పాటలకు చిరునామా అయినా వాణిజయరాం గారు ఇద్దరు ఒకరిని ఒకరు పోగుడుకోవడానికి సరిపోయింది కాలమంతా!! పాటలు పాడిన పిల్లలను మాత్రం వారికి ఇష్టమైన వారిని కొద్ది గా పొగిడి మిగిలిన ఇద్దరినీ అంతా బాగానే పాడారు కాని పాటలో జీవించలేదు, సంగీత పరంగా, సాహిత్య పరంగా అంతా చాలా బావుంది అని మార్కులు మాత్రం వారి ఇష్టం వచ్చిన వారికి వేసారు. అనుకున్నట్లే మొదటి స్థానం వారు అనుకున్న వారికి ఇచ్చి బాగోదని రెండో స్థానం ఈ సారికి వేరే వారికి ఇచ్చారు. ఆఖరు గా మాత్రం వారు అనుకున్న వారికే ఇస్తారు ఎవరు ఎంత బాగా పాడినా....ఇంతకుముందు ఈ టి వి లో ఇలాంటి పిల్లల పాటల ప్రోగ్రాం లో వేటూరి గారు, అనంత శ్రీరాం గారు ఈసారి ముఖ్య అతిధి శ్రీమతి వాణి జయరాం గారు జడ్జిలు గా వున్నారు. అప్పుడు కుడా వాణి జయరాం గారు ఇలానే చేసారు. చాలా కార్యక్రమాలకు ముఖ్య అతిధి, జడ్జి గా న్యాయమైన తీర్పు చెప్పే స్థానంలో వుండి పక్షపాతం చూపించడం చాలా బాధగా వుంది చూడటానికి. పాటలో లీనమై, శృతి, లయలలో, గమకాలు పలికిస్తూ పాడటం ముఖ్యం కాని...నువ్వు నవ్వలేదు పాటను ఫీల్ అవుతూ పాడలేదు అనడం సబబు కాదు బాగా పాడినా కుడా!! ఒకప్పుడు చాలా సార్లు బాలు గారే శృతి తప్పకుండా స్పష్టంగా వంక పెట్టలేనట్లు పాడుతున్నావని ఇప్పుడు ఫీల్ లేకుండా పాడుతున్నావని ఫైనల్ లో అనడంలో నిజం ఎంతో బాలు గారి మనస్సాక్షికి తెలుసు. నాకు ఈ ప్రోగ్రాంలో బాగా ఇద్దరి స్వోత్కర్ష ఎక్కువైనట్లు అనిపించింది. ఇద్దరు గొప్ప వాళ్ళే....కాని ఒకరి గురించి మరొకరు చెప్పుకోవడమే మిగిలింది స్టేజ్ పైన. పిల్లల ప్రోగ్రాంని పిల్లల ప్రోగ్రాం లానే ఉండనివ్వండి. మీరు ఎంత ప్రతిభావంతులో ప్రపంచం అందరికి తెలుసు కొద్దిగా చెప్తే చాలు...ఇంక ఆపండి మీ సొంత గొప్పలు అనిపించుకోకండి. మా మనస్సులో మీరు, మీ ఆణిముత్యాల పాటలు ఎప్పటికీ అజరామరంగా మిగిలి పోతాయి. మిమ్మల్ని కోరేది ఒక్కటే న్యాయమైన తీర్పు చెప్పమని....మాత్రమే....ఆలోచిస్తారు కదూ...!!

25, మార్చి 2011, శుక్రవారం

ఎప్పుడూ...ఎప్పటికీ....!!

నీతో మాటలు లేనప్పుడు....
ఎప్పుడూ నీతో కబుర్లు చెప్పాలనే వుండేది....
నీతో మాటలు మొదలు పెట్టాక...
అంతులేని ప్రవాహంలా అలా వస్తూనే వున్నాయి....
ఓ పక్క భయం.. మరో పక్క దిగులు...
నా మాటలతో నీకు విసుగేమో అని భయం!!
మాటలు లేని మౌనాన్ని చూస్తే దిగులు...
ఎప్పటికీ మాట్లాడలేనేమో అని....
అమ్మ ఆవకాయ్ ఎప్పటికీ విసుగు రానట్లే
నేను కుడా నీ తలపుల్లో అలానే ఎప్పటికీ ఉండిపోవాలని....!!

24, మార్చి 2011, గురువారం

ఏమౌతుందో..!! ఏమో..!!

ఈ రోజు భయం భయంగా దేవునికి దణ్నం పెట్టుకుంటూ అందరూ కోరే కోరిక ఒక్కటే.....!! అదే టీంఇండియా గెలవాలని...!!
దేవునికి దణ్నం పెట్టుకుంటూ ఎప్పుడూ ఏమి అడగని నేను... దణ్నం పెట్టుకునేటప్పుడు ఏమి అడగాలో అస్సలు గుర్తు రాదు ఎప్పుడూ...కాని ఈ రోజు టీంఇండియా కప్ గెలవాలని కోరుకున్నాను. ఇది నాతొ పాటుగా ప్రపంచమంతా వున్న భారతీయుల ఆశ....కోరిక...దానికి మొదటి అంకం పూర్తి అయ్యి రెండో అంకం లోనికి అడుగిడుతున్న టీంఇండియా..............
ఈ రోజు గెలిచి తరువాత చిరకాల ప్రత్యర్ధి పై గెలిచి ఫైనల్ లో ప్రవేశించి కప్ సాధించి తీరాలని
ఏకైక లక్ష్యంతో ముందడుగు వేస్తే.........ఆ సంకల్పానికి కోటానుకోట్ల భారతీయుల ఆశిస్సులు తోడుంటాయని.....
గెలవగల సత్తా, ఆడగల నేర్పు ఓర్పు అన్ని వున్న మన టీంఇండియా గెలవాలని మనస్పూర్తి గా కోరుకుంటూ.........
క్రికెట్ అభిమానుల కోసం లింక్
www.cricdude.com

23, మార్చి 2011, బుధవారం

బాలు గారికి మనవి .....!!

బాలు గారికి,
ఈ టి వి సగర్వంగా సమర్పిస్తున్న పాడుతా తీయగా ప్రోగ్రాం లో విజేతను....అందరికి ఎంతో నచ్చే పాటలతో అలరిస్తున్న పిల్లలలో మీకు ఇష్టమైనవారికి కాకుండా ప్రతిభకు పట్టం కట్టమని సవినయంగా మనవి చేస్తున్నాను. పాట బాగుందా లేదా అని కాకుండా పాటకు పిల్లలు సరిగా న్యాయం చేసారో లేదో చూడండి. పాటల సాహిత్యం గురించి మీకు నచ్చక పొతే ముందే వాళ్లకు చెప్పి మీకు నచ్చే పాటలు ఇవ్వండి, అంతే కాని పాడిన తరువాత పాట సాహిత్యం బాలేదు, ఇలాంటి పాటలు ఎందుకు రాస్తారో!! లాంటి మాటలతో బాగా పాడిన చిన్నారులను చిన్నబుచ్చకండి దయచేసి. కోపం తో కాకుండా అర్ధం చేసుకుని అందరూ మెచ్చే విధంగా విజేతను ప్రకటిస్తారని కోరుకుంటూ....

21, మార్చి 2011, సోమవారం

చెప్పాలని వుంది...గొంతు విప్పాలని వుంది....

అపుడు పెదవి దాటి రాని మాట ఇపుడు పదే పదే
చెప్పాలని వుంది...గొంతు విప్పాలని వుంది....
నువ్వు వింటే నీ కళ్ళలో ఆ ఆనందం నేను చూడాలని వుంది...
సరదాగా నీతో చెప్పాలనుకున్నా...మనసులోని ఓ మాట
పెదాల పరదాలు దాటి తరలి రానంటోంది ఈవలికి...
అందరూ చెప్పే మాటే...అందరికి తెలిసిన పలుకే...
అమ్మతో చెప్పినా...నాన్నతో చెప్పినా...
రక్త బంధంతో చెప్పినా...ఆత్మ బంధువుతో చెప్పినా...
చిన్న మాటే....అయినా మనసుకిస్టమైన మాట
నేనంటే నాకిష్టం...నాకన్నా....నువ్విష్టం!!
తరచూ పలకరించే నీ ప్రేమ నిండిన పిలుపు ఇష్టం
నాతొ నువ్వు చెప్పే ఊసులు, నులివెచ్చని నీ స్పర్శ..
కధలు, కబుర్లు చెప్పి...లాలిపాటల లాల పోసినా..
నేయిగారే గోరుముద్దల మురిపాల బువ్వ పెట్టినా...
జోల పాటల ఊయలలో జోకొట్టినా....
కలత నిదురలో ఉలికి పడితే....నేనున్నానంటూ....
నీ ఆలంబన నాకింకా గుర్తే... అందుకే ... అమ్మా!! అమ్మమ్మా!!
నాకన్నా....నువ్విష్టం మరీ...మరీ...ఇష్టం!!

17, మార్చి 2011, గురువారం

ఏటి ఒడ్డున..... సెలఏటి మాటున....!!

మబ్బుల మాటునున్న పున్నమి చందురుని రూపం
కనపడి కనపడని నీటిలోని ప్రతిబింబపు వెలుగులలో
నడిరేయిలో, మలిఝాములో, సడిలేని ఏకాంతంలో
నీ తలపులు చుట్టుముట్టి నాతో సరాగాలాడుతుంటే
జాడ లేని నీ కోసం పైరగాలి పిల్లతెమ్మెర
సున్నితంగా తాకి వెళిపోతూ వుంటే
మదిలోని నీ రూపం కనుల ఎదుట
కనపడే క్షణం!! ఏదో చెప్పాలన్న ఆరాటంలో
ఏమి చెప్పలేక మూగబోయిన గొంతు సవ్వడి
మాటల్లేని మౌన నిశ్శబ్దంలో వినిపించే అంతే లేని
ఆశల ఊహల ఊసులు, కలల సౌధాలు....
నీకు చేరాయో లేదో!!
(మాలా గారు ఈ ఫోటోకి కవిత రాయమంటే.....)

16, మార్చి 2011, బుధవారం

అనుకున్నదే అయ్యింది...

అనుకున్నదే అయ్యింది....సౌత్ ఆఫ్రికా తో మన వాళ్ళు ఓడిపోయి చెల్లించిన మూల్యం ఏంటో కనీసం ఇప్పటికైనా అర్ధం చేసుకుంటే...బౌలింగ్ లోనూ, ఫీల్డింగ్ లోనూ కాస్త శ్రద్ధ పెడితే కనీసం చివరి వరకు పోరాడగలిగితే....!! కోట్లాదిమంది భారతీయుల ఆశలను, కలలను సాకారం చేయడానికి ప్రయత్నిస్తారో లేదో మన టీం ఇండియా!! అలనాటి కెప్టెన్ కపిల్ అందించిన అలవికాని ఆనందాన్ని మళ్ళి మనం సొంతం చేసుకోగలమా!! అన్న సందేహం ప్రతి ఒక్క భారతీయుడిలోను ప్రస్పుటం గా కనిపిస్తోంది. జరుగుతున్న మాచ్ లు చూస్తున్న కొద్ది అస్సలు చివరి వరకు పోరాడగలరా!! అనిపిస్తోంది. ఆటలో ప్రతి క్షణం ముఖ్యమే...పరుగైనా, వికెట్టు అయినా, కాచ్ అయినా....ఇలా ప్రతిదీ, టీం లోని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూసుకోక పొతే మూల్యం చెల్లించక తప్పదు. సమిష్టిగా విజయాన్ని అందుకోవడానికి జట్టులో అందరూ ఒక్కటిగా గెలుపే ధ్యేయంగా ఆడితే తప్పక విజయం మనదే అవుతుంది. ప్రపంచ రికార్డుల ఆటగాళ్ళు వున్నారు, పరుగుల రారాజులు, స్పిన్ మాయాజాలం తో ప్రత్యర్ధిని ముప్పుతిప్పలు పెట్టగల సత్తా వున్న స్పిన్ మాంత్రికులు, కొద్దిగా మనసు పెడితే ఫీల్డింగ్ లో ఎదుటి జట్టు కి చుక్కలు చూపించ గల మనవాళ్ళు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో !! ఒక్క వికెట్ పడితే చాలు నీవెనుకే మేము అంటూ అందరూ పెవిలియన్ కి చేరుకుంటారు. ఆడలేకా కాదు, ఆటరాకా కాదు...నిర్లక్ష్యం....!! నా డబ్బులు నాకోస్తున్నాయి, నా రికార్డ్లులు నాకున్నాయి, ఆడినా ఆడక పోయినా...అని అనుకుంటే ఎప్పటికీ ఇలానే ఉంటాము. మన కోసం కాకుండా దేశం కోసం ఒక్కసారి ఆడి చూడండి అందరూ....కోట్లాదిమంది భారతీయుల ఆశిస్సులు కొండంత అండగా మీకందుతున్నప్పుడు బెదురెందుకు?? భయమెందుకు?? దూసుకు పొండి....తిరుగులేని విజయంతో చరిత్రలో సువర్ణాక్షరాలతో చిరకాలం మిగిలిపొండి.... !!
క్రికెట్ గురించి అన్ని వివరాల కోసం పక్కనే వున్న క్రీడాభిమానుల కోసం లింక్ లలో చూడండి లేదా www.cricdude.com ని చూడండి

14, మార్చి 2011, సోమవారం

ఇష్టమైన జ్ఞాపకం....!!

తరచి తరచి తలచుకొన్న కొద్దీ పెరిగే ఇష్టం
ఎంత ఆస్వాదించినా ఇంకా.... ఇంకా....అనిపించేంత ఇష్టం
నీతో నువ్వున్నప్పుడు నీతోనే నేనున్నానంటూ
నిను తడిమే పలకరింపే నీకిష్టమైన జ్ఞాపకం!!
ఎప్పటికీ పాతది కాకుండా ఎప్పుడూ కొత్తగానే...
ఎప్పటికీ కావాలనిపించేదే ఇష్టమైన జ్ఞాపకం!!
ఎద తలుపులు తెరిస్తే...ఏకాంతంలో నీ చెలిమి !!
నీలోనుంచి జాలువారే జ్ఞాపకాల దొంతరలే!!నీ నేస్తాలు !!
నీ ఆనందం, నీ ఆహ్లాదం, నీ ఇష్టం, నీ అయిష్టం నీ జ్ఞాపకాలే!!
ఎప్పటికీ మదిలో ఉండిపోయే ఇష్టమైన జ్ఞాపకానికి
మరణం ఉందంటారా!!

12, మార్చి 2011, శనివారం

మన వాళ్ళ సత్తా ఏంటో....!!

ఈ రోజు మనకి సౌత్ ఆఫ్రికా కి నాగ్పూర్ లో జరుగుతున్న క్రికెట్ మాచ్ లో ముందుగా టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న భారత్ మొదట్లో ధాటిగా ఆడినా తరువాత అంతగా రాణించలేదు. నిర్ణీత ఏభై ఓవర్ల లో అన్ని వికెట్లు కోల్పోయి రెండు వందల తొంభై పరుగులు చేసింది. మన వాళ్ళ బౌలింగ్, ఫీల్డింగ్ బాగా లేక పొతే... సౌత్ ఆఫ్రికా కి అది పెద్ద లక్ష్యం కాదు. ఇండియా గెలవాలన్న తపన ప్రతి ఒక్క భారతియుడిలోనూ ప్రగాధంగా వున్న కోరిక. ఈ సారి మన వాళ్ళు ప్రపంచ కప్ సాధించి, ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కున్న భారత జట్టు అఖండ విజయాన్ని సొంతం చేసుకొని అజేయులై తిరిగి రావాలని ప్రతి ఒక్క భారతీయుడి ఆశ.
క్రీడాభిమానుల కోసం ప్రత్యేకం.......పక్కనే వున్న లింక్ లలో చూడండి...
www.cricdude.com
ని చూడండి మాచ్ ల, స్కోర్ ల వివరాల కోసం

9, మార్చి 2011, బుధవారం

విశ్వవిజేత ఎవరో....???

నిన్నటి న్యూజిలాండ్, మొన్నటి కెనడియన్ల ఆట, అంతకు ముందు ఐర్లాండ్ పోరాట పఠిమను చూసి ఈ పాటికి హాట్ ఫేవరెట్స్ అనుకుంటున్న అన్ని జట్లకు ముచ్చెమటలు పోస్తున్నాయన్నది తిరుగులేని నిజం!!
ఒకప్పుడు భారత స్పిన్నర్లు అంతే ప్రపంచానికి హడలు పుట్టేది. మన బలమే స్పిన్నర్లు. ఫీల్డింగ్ మనది ఎంత బాగుంటుందో అందరికన్నా మనకే బాగా తెలుసు. ఒకప్పుడు బాట్స్ మెన్ల గుండెల్లో గుబులు పుట్టించే స్పిన్ మాంత్రికుడు బజ్జీకి ఏమైంది? పియూష్ చావ్లా స్పిన్ ఇంద్రజాలం ఎక్కడ? మన బాట్స్ మెన్లు ఎప్పుడూ ఎవరు ఎలా ఆడతారో తెలియదు. ఇప్పటి వరకు మన బలమని నమ్ముకున్న బౌలింగ్ కుడా అయోమయం లో పడవేస్తోంది ఇప్పుడు. ఇదే కొనసాగితే ఈ సారి కుడా విశ్వవిజేత మనకు అందరాని జాబిలేమో అని భయంగా వుంది. క్రికెట్ మాచ్ ల గురించి అన్ని వివరాల కోసం ఈ వెబ్ సైట్ ని దర్శించండి www.cricdude.com

8, మార్చి 2011, మంగళవారం

నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా......

మనసార చిత్రం నుంచి కృష్ణ చైతన్య ఎంతో బాగా పాడిన ఈ పాట శేఖర్ చంద్ర సంగీత సారధ్యం లో రవిబాబు దర్శక ప్రతిభకు తార్కాణం. నాకు చాలా చాలా ఇష్టం ఈ పాట . మరి మీ అందరికి కుడా నచ్చుతుందనుకుంటున్నాను....మీ కోసం ఈ పాట.... వీడియో లింక్ కోసం చూసాను క్షమించాలి దొరక లేదు.....లింక్ దొరికింది స్వామీ గారికి థాంక్స్
ఇదిగో లింక్ మీ కోసం....
http://www.youtube.com/watch?v=GgkQPfJnQx0&feature=related
http://www.youtube.com/watch?v=hDJMhZ5TNW0

నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా......
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా...
గుండె లోపల ఉండుండి ఏంటిలా
ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా....
నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా......
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా...

చూడాలి చూడాలి అంటూ నీ తోడే కావాలి అంటూ
నా ప్రాణం అల్లాడుతోంది లోలోపలా....
ఇంతందం ఇన్నాళ్ళ నుండి దాక్కుంటూ ఏ మూలనుంది
గుండెల్లోన గుచ్చేస్తోంది సూటిగా
పేరే అడగాలనుంది మాటే కలపాలనుంది
ఎంతో పొగడాలనుంది నిన్నే నిన్నే
కొంచం గమ్మత్తుగుంది కొంచెం ఖంగారుగుంది
అంతా చిత్రంగ ఉంది ఈ రోజు ఏమైందిలా.... నువ్విలా....

నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా......
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా...
చంద్రుండ్ని మింగేసిందేమో వెన్నెల్ని తాగేసిందేమో
ఎంతెంతో ముద్దొస్తోంది బొమ్మలా....
తారల్ని ఒళ్ళంత పూసి
మబ్బుల్తో స్నానాలు చేసి
ముస్తాబై వచ్చేసిందేమో దేవతా...
మొత్తం భుగోళమంతా పూలే చల్లేసినట్లు
మేఘాలందేసినట్టు ఉందే ఉందే...
నన్నే లాగేస్తున్నట్టు నీపై తోసేస్తున్నట్టు
ఏంటో దోర్లేస్తున్నట్టు ఏదేదో అవుతోందిలా.... నువ్విలా...

నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా......
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా...
గుండె లోపలా గువ్వల గుంపులా ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా...నువ్విలా....
నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా......
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా...

ఆకు సోయగం....

ఆకు పచ్చని అందమైన ఆకూ...
లేలేత యవ్వనంతో నునుపైన దాని సోకు....
గాలి తాకిడికి దాని వూగులాట....
చూస్తున్న చిన్న దాని జారే పైట....
ఎంత కాలం అడుకుంటావే వెర్రి ఆకూ...
ఈ వుయ్యాలాటలు.?
పెద్ద వానోస్తుంది...పిచ్చిఎండా కాస్తుంది...గాలి భీబత్సం చేస్తుంది...
అప్పుడు ఎండి చిక్కి శల్యమై కింద పడి పోయే నిన్ను చూడలేనే నా బంగారు ఆకూ...!!
(ఇది నా ఫ్రెండ్ రాసింది )

నిన్నటి పాడుతా తీయగా....లో

ఈసారి పాడుతా తీయగా గురించి టపా రాయాల్సిన అవసరం రాదేమో అనుకున్నాను కాని రాయక తప్పడం లేదు. బాలు గారు ముందుగా నన్ను క్షమించాలి...నిన్నటి ఎపిసోడ్ లో అంజని నిఖిల పాడిన వేదం లా ఘోషించే గోదావరి పాటలో (శోభ అంటాము కాని షోభ అనం కదా) శోభిల్లే కి షోభిల్లే అని పాడాలని చెప్పారు. ముందుగా లలో బాలు గారు చూసుకోవాలి ఒక్కో సారి బానే చెప్తారు మరోసారి మరోలా చెప్తే పిల్లలు ఎలా పాడాలో తెలియని అయోమయం లో పడిపోతారు. అంజని నిఖిల బానే పాడుతుంది కాని పాడేటప్పుడు మద్యలో చాలా సార్లు గాలి శబ్దం కుడా వినిపిస్తుంది మరి అది గమనించారో లేదో బాలు గారు..నిన్నటి ఎపిసోడ్లో నాకనిపించింది రాఘవేంద్ర చాలా బాగా పాడాడు అని...మరి ఎందుకు బాలు గారు తప్పుగా తీర్పు చెప్తున్నారో తెలియడం లేదు. అంజని నిఖిల కంటే చాలా బాగా పాడాడు రాఘవేంద్ర. దయ చేసి బాలు గారు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలని కోరుకుంటున్నాను.........

7, మార్చి 2011, సోమవారం

ఆత్మహత్యలు ఎందుకు..??

క్రిందటి వారం విన్న ఓ విష్యం మనసును బాగా కలచి వేసింది.
అందరికి సమస్యలు వుంటాయి చిన్నవో చితకవో...మనది మనకు చాల పెద్దది గా ఆ బాధ ఎవరు పడలేదేమో అనిపిస్తుంది. అలా అని ప్రతి సమస్యకు ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో ఇంతమంది జీవించి వుండేవారు కాదేమో!!
ఎన్ టి వి లో లైవ్ ఇంజనీర్ గా పని చేసే ఒకతను హెచ్ ఆర్ లో వేధింపులు తట్టుకోలేక తనకు ఇష్టం లేక పోయినా బతకాలని ఎంతో వున్నా అర్ధాంతరంగా జీవితాన్ని బలవంతంగా ముగించుకున్నాడు. ఇద్దరు చిన్న పిల్లలు...పద్దెనిమిది నెలలు, రెండు నెలలు వున్న చిన్న చిన్న పిల్లలు , భార్యకు కుడా పెద్ద వయసు లేదు చిన్న అమ్మాయి. బాగా లేని వాళ్ళు. తను చని పోయే ముందు రాసిన ఉత్తరంలో హెచ్ ఆర్ వేధింపులు తట్టుకోలేకనే ఇష్టం లేక పోయినా బలవంతం గా రాజీనామా చేయించారని, అందుకే చనిపోతున్నానని రాసి, ఇంక ఎవరికీ అలా వేధింపులు లేకుండా చేయమని ఆఖరి కోరిక కోరాడు. మరి యాజమాన్యం ఎంత వరకు స్పందిస్తుంది అనేది, బడాబాబులకు కొమ్ము కాసే పోలీసులు, చట్టం ఇలాంటి అన్యాయాలకు ఎలా న్యాయం చేస్తారనేది ప్రశ్నార్ధకమే?? వాళ్ళను తలచుకుంటుంటే చాలా బాధగా అనిపిస్తోంది....పోయిన వాడు పోయాడు బతికి వున్న వీళ్ళ పరిస్థితి ఏంటి?
ఏ సమస్యకు అయినా చావు పరిష్కారం కాదు. చనిపోవాలని అనుకున్నప్పుడు ఒక్క క్షణం మీ మీద ఆధారపడిన కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి.....!! పిరికి వాళ్ళలా సమస్యకు తలవంచకండి. ధైర్యం గా ఎదుర్కోండి....ఆ క్షణంలో మీ ఆలోచనను దారి మళ్ళించండి, ఓ మంచి జీవితం మీకు, మిమ్మల్ని నమ్ముకున్న వారికి దొరుకుతుంది. అంతే కాని అందరిని నట్టేట్లో ముంచి మీ మానాన మీరు వెళిపోతే మీ కోసమే బతికే వారి గతి ఏంటి? అని ఒక్క క్షణం ఆత్మ విమర్శ చేసుకోండి. భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చిన అందమైన జీవితం మన సొంతం అవుతుంది. సమస్యతో పోట్లాడండి...తప్పక అది మీకు తలవంచి విజయాన్ని అందిస్తుంది. ప్రతి సమస్యకు పరిష్కారం వుంది. ఆత్మహత్య మాత్రం పరిష్కారం కాదు గుర్తు ఉంచుకోండి...!!

4, మార్చి 2011, శుక్రవారం

చిగురాకు చేయూత...!!

చిగురులు వేసే చిన్నారి ఆకు ఆహ్లాదానికి ఆనవాలం!!
హరిత వర్ణాల అందాల ఆకు ఆరోగ్యానికి చిరునామా!!
నునునిగ్గుల మొగ్గలకు సంరక్షణ ఈ ఆకు రక్షణ
గువ్వల గూటికి, పొదరింటి పరదాలకు పెట్టినిల్లు
పువ్వు లేని తావి సాద్యం కాని...ఆకులేని మొక్కని
ఊహించుటే అసాద్యం!!
రాలే ప్రతి ఆకు నేర్పుతుంది ఓ పాఠం...
కొత్త చిగురుల తొడుగులతో రాలిన చోటే
కొత్త అందాలతో జనించే ఆకుతో
ఓడిన చోటే గెలుపుకు బాటలు వేసుకుని
గర్వంగా తల ఎత్తుకు నిలబడమనే ఓ జీవిత సత్యం!!
ప్రాణ వాయువుతో ప్రాణాలు నింపి రాలిపోతూ కుడా ఓషదులతో
సాయమందించే ఆకు...గెలుపు పాటను మనకు నేర్పి
పచ్చదనాల పరువాలతో ప్రపంచ శాంతిని తనలో
నింపుకున్న చిన్ని ఆకు ఎన్ని జీవిత సత్యాలను
తనలో ఇముడ్చుకుందో!! ఎంత ఎదిగినా ఒదిగి వుండే వినమ్రమైన
వినయాన్ని నేర్చుకోమని చక్కని చిరుగాలితో కలసి
చల్లదన్నాన్ని, ఆహ్లాదాన్ని మనకందిచే రెండక్షరాల ఆకు గొప్పదనం
ఎలా చెప్పేది?
(నీలహంస సత్య గారి ఆకు కవితల పోటికి రాసిన చిరు కవిత)

3, మార్చి 2011, గురువారం

బెస్ట్ అఫ్ లక్ ఇండియా.....


ఒకటే జననం ఒకటే మరణం ఒకటే లక్ష్యం అదే అదే ఈ సారి ప్రపంచ కప్ సొంతం చేసుకోవడం....టీం ఇండియా ధ్యేయం కావాలి.
నిన్నటి ఐర్లాండ్ ఆట తీరు చూసి మన వాళ్ళు నేర్చుకోవలసినది చాలా వుంది. ప్రపంచ కప్ లో తొలి అడుగు దగ్గర నుంచి ఐర్లాండ్ ఆట తీరు చాలా బాగుంది. ఆ పోరాట పఠిమే మన వాళ్లకు కావాలి...ప్రతి ఒక్క ఆటగాడి లక్ష్యం చివరి వరకు గెలుపు మీదే వుండాలి. ఎవరు వున్నా లేక పోయినా ప్రతి ఒక్కరు తమ ఆటకు న్యాయం చేయాలి. చివరి బంతి వరకు గెలుపు కోసం పోరాటమే లక్ష్యం కావాలి. ప్రపంచకప్ లో ప్రతి ఒక్క బాట్స్ మాన్ పరుగులు చేద్దామనే అనుకుంటారు, అలానే ప్రతి ఒక్క బాల్ కి వికెట్ పడగొట్టాలని బౌలర్ అనుకుంటాడు. సంకల్పబలం తో ముందుకి అడుగు వేస్తే విజయం మనదే.....
కోట్లాది భారతీయుల కలని నిజం చేసే సత్తా వుండి కుడా ప్రపంచకప్ గగన కుసుమం ఐపోయింది మన టీం ఇండియాకి.
గతాన్ని ఘనం గా చెప్పుకోవడం తప్ప విజయాన్ని అందుకోలేక పోతున్నాము. ఈ సారి అయినా కోట్లాదిమంది భారతీయుల ఆశలను, కలలను నిజం చేస్తూ ప్రపంచ కప్ తో మన టీం ఇండియా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని రావాలని కోరుకుంటూ.......బెస్ట్ అఫ్ లక్ ఇండియా.....
లైవ్ స్కోరు....ఇతర వివరాల కొరకు క్రింది వెబ్ సైట్ ని చూడండి
www.cricdude.com

1, మార్చి 2011, మంగళవారం

నిన్నటి పాడుతా తీయగా గురించి నాలుగు మాటలు

నిన్న రాత్రి పాడుతా తీయగా ప్రోగ్రాం గురించి నాలుగూ మాటలు చెప్పాలనే ఈ టపా!!
ఇన్ని రోజులకి ధర్మం గా ప్రతిభకి పట్టం కట్టారు బాలు గారు. ఈ మద్య బాలు గారి జడ్జిమెంట్లో లోపాలే ఎక్కువగా కనిపించాయి. అతిధిగా వచ్చిన వాసు గారు మొదటి రౌండ్ లో కొద్ది గా అతి అనిపించారు. తరువాత బాగా మాట్లాడారు.
ఎందుకో ఈసారి గణేష్ బాగా వెనక్కి వెళిపోయాడు. అంజని నిఖిల చాలా బాగా పాడింది కొద్దిగా వత్తులు చూసుకోవాలి.
రాఘవేంద్ర తనేంటో చక్కగా నిరూపించాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు కుడా బాగా పాడారు. ఎవరు బాగా పాడుతున్నారు అనేది చెప్పడం రాను రాను కష్టంగా ఐపోతోంది. మంచి పాటలతో శ్రోతలను అలరింపచేయాలని అందరూ బాగా పాడాలని అందరికి శుభాకాంక్షలు అభినందనలు.....బెస్ట్ అఫ్ లక్
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner