31, జులై 2012, మంగళవారం

ఎలా దరి చేరినా....!!

చినుకులా రాలినా....
చిరుజల్లులా సేదదీర్చినా...
వానలా వర్షించినా....
వరదలా ఉప్పొంగినా....
మలయమారుతంలా చుట్టుముట్టినా...
జలపాతంలా జాలువారినా....
ఎలా వచ్చినా...ఎటునుంచి చేరినా....
అది నీ సన్నిదే....!!

18, జులై 2012, బుధవారం

అందరికి అభివందనాలు..!!

ఎప్పటి నుంచో...చదివిన చందమామ, బాలమిత్ర కధలు.. రాధాకృష్ణ నుంచి చదవడం మొదలు పెట్టిన వారపత్రికలలో సీరియల్సు ఇలా చదివి చదివి ఒకసారి ...
కోపాన్నికధగా రాసినప్పుడు అక్కలు చూసి నీ కధే రాసావే...!! అంటే అయ్యో వీళ్ళకెలా తెలిసిపోయిందబ్బా...!! ఆని బోల్డు ఆశ్చర్యం ..!! నేస్తాలకి ఉత్తరాలతో రాతలు రాయడం మొదలు....మద్య మద్యలో కవితలు...అలా మొదలయ్యి ఇప్పటి కాలానికి మెయిల్స్ తో సరిపెడుతూ...ఇదిగో...ఇలా బ్లాగు...టపాలు...నా రాతలు సాగుతూ వున్నాయి.
బ్లాగు మొదలు పెట్టి మూడున్నర్ర ఏళ్ళు అయినా రాతలు మొదలెట్టి మూడు ఏళ్ళు అనుకుంటా..!! మొదట్లో అందరి బ్లాగులు చూస్తూ ఆమ్మో భలే బాగా రాసేస్తున్నారు బోల్డు మంది చూస్తున్నారు...నాది అస్సలు ఒకరైనా చూస్తారో లేదో ఒక్క కామెంట్ అయినా టపాకి వస్తుందో రాదో అని అనుకునేదాన్ని...నాకు అనిపించింది రాయోచ్చో లేదో అని అనుమానమే..!!
భయపడినా మొత్తానికి రాయడం ఆపలేదు...అలా మొదలు పెట్టిన రాయడం ఇప్పటికి ఆవి ఇవి అన్ని....ఈ టపాతో పాటుగా కలిపి ఓ మూడు వందల టపాలు నా బ్లాగులో చేరిపోయాయి....!!
చెప్పలేని సంతోషమయినా...
తట్టుకోలేని బాధయినా...
పంచుకోగలిగిన ప్రియ నేస్తం....!!
ఆదరించే అమృత హృదయాలు....
ఓదార్పునిచ్చే పన్నీటి పలుకులు....
ముఖ పరిచయం లేకుండా....
మనసు తెలుసుకునే నేస్తాలు....!!
ఏది రాసినా...ఎలా రాసినా...!!
బావుందనే... మెచ్చుకోలు...!!
ఆదరిస్తున్న అందరికి అభివందనాలు..!!

17, జులై 2012, మంగళవారం

నాలో....నువ్వు...!!


గుండె గొంతులో...మనసు మాటలో...
చెప్పలేని ఆశలకు ప్రతిరూపం....!!...నువ్వు...!!
గీసిన బొమ్మలో....రంగులు వేసిన చిత్రంలో...
రాసిన రాతలో....పాడిన పాటలో...నీ రూపమే..!!
అటు ఇటు ఎటు చూసినా....నువ్వే...!!
ఊహల రెక్కల్లో...విచ్చిన గులాబిలో....నువ్వే...!!
కనిపించిన క్షణంలో...కనిపించని మరుక్షణంలో...
చేరువగా నువ్వే...!! దూరంగా నువ్వే..!!
నా లోకమే నువ్వు...!!

నేను....నువ్వు...!!


ఎప్పుడూ ఏదో లోకం లో వుండే నువ్వు....
ప్రతి క్షణం ఏదో ఒకటి చేస్తూ నేను....
గల గలా వాగుతూ నేను...
మాటలే రానట్టుండే నువ్వు...
అల్లరి చేస్తూ ఆటలు పట్టిస్తూ నేను...
ఒద్దికగా ఓ పక్కన నువ్వు...
అన్నిట్లో నేను...
ఏది పట్టించుకోనట్లుండే నువ్వు...
మాటల ప్రవాహాన్ని నేను...
మౌన మునివి నువ్వు...
ఏ ఒక్కటి కలవని నేను...నువ్వు...!!
అయినా...స్నేహం మన మద్య...!!
'వి' చిత్రం కదూ..!!

16, జులై 2012, సోమవారం

ముల్లులా గుచ్చే....మధురం...!!


స్నేహం కూడా ముసుగు వేసుకుందేమో అనిపిస్తోంది...
చెలిమి కలకాలం చేదోడు వాదోడు గా ఉంటుందేమో అనుకుంటే....
అది సాధ్యం కాదని నిరూపిస్తున్నాయి కొన్ని అనుభవాలు...
ఎన్నాళ్ళకో కలిస్తే క్షేమ సమాచారం కోసం కాకుండా ఆరాలు....ఆర్భాటాలు చూపించడానికే అన్నట్లుగా అనిపిస్తుంది...
కొన్ని కలయికలు మరచిపోలేని మధుర జ్ఞాపకాలను మళ్ళి గుర్తు చేస్తే....మరికొన్ని ఎందుకు కలిసారా..!! అని ప్రశ్నగా మిగిలి పోయింది...పోతోంది...!!
జ్ఞాపకాలను జ్ఞాపకం గానే ఉండనిస్తే....బాధలో ఓదార్పుగా వుంటుంది జ్ఞాపకాన్ని ముల్లులా మార్చితే ఎప్పటికీ ముల్లుతో గుచ్చినట్లుగా ఒక ముళ్ళ పొదలా మారిపోతుందేమో..!!
మన జ్ఞాపకాల అరల్లో చలువ రాళ్ళు వుంటాయి.. గులక రాళ్ళు వుంటాయి...జీవితం లో బరువులు బాధ్యతలు మోస్తువుంటాము కదా అందుకే రాళ్ళతో పోలిక పెట్టాను...స్నేహం స్నేహ సౌరభాలు వెదజల్లుతూ ఉన్నంత కాలం అంతా ఆహ్లాడమే ...ఆనందమే...!! స్నేహాన్ని దూరం చేసుకుంటే...!!ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లున్నట్లే...అతి పేదవాడు స్నేహాన్ని దూరం చేసుకున్న వాడే...!!డబ్బు అధికారం అన్ని వున్నా ఆత్మీయంగా పలకరించే స్నేహం లేని రోజు అన్ని వున్నా ఏమి లేనట్లే..!!
అందుకే ముల్లులా గుచ్చినా మధురంగా వుండే జ్ఞాపకంగా స్నేహాన్ని వుండిపోనివ్వండి..!!

15, జులై 2012, ఆదివారం

ఈ దూకుడు......!!

చూసారా ...చూస్తున్నారా..!!
దూకుడు మొదలయింది..మరి ఊపందుకుని ఎక్కడ ఆగుతుందో...!!
నాని తో మళ్ళి మరో మలుపు తిరుగుతున్నా... ఇంకా ఎంత మంది దూకడానికి సన్నద్ధం గా వున్నారో... కొన్ని రోజులలో తెలుస్తుంది....వంశి ఇంకా ముహూర్తం పెట్టుకోలేదేమో...దూకడానికి...!!
డబ్బుల కోసమే రాజకీయాలు కాని జనం కోసం కాదని ఇప్పటికయినా ఈ జనానికి అర్ధం అవుతుందో లేదో..!!
మొన్న ప్రజారాజ్యం లోనికి దూకుడు....మళ్ళి కాంగెస్ లోనికి ....
నిన్న చిరు...ఈ రోజు నాని..రేపు వంశీ...ఇలా ఎప్పుడూ ఏదో ఒక పార్టి పుడుతూనే వుంటుంది మనం ఎన్నుకున్న నాయకులు డబ్బుల కోసం పార్టీలు మారుతూనే వుంటారు.....!!
ఈ దూకుడు రాజకీయాలు ఆగకుండా దూకుడుగా పోతూనే వుంటాయి....!!

14, జులై 2012, శనివారం

నను వదలని.....!!

పదే పదే పలకరిస్తోంది....
మరీ మరీ వెంటపడుతోంది...
మళ్ళి మళ్ళి ఎదురు పడుతోంది....
వద్దన్నా వదలనంటోంది....
కాదన్నా కలవర పెడుతోంది....
ఎటు వెళ్ళినా నాతోనే వస్తానంటోంది...
అది నా ప్రతిబింబమే....అయినా...!!
అది...నాలోని నువ్వే కదా...!!

12, జులై 2012, గురువారం

నీ చుట్టూనే....!!

చిటపట చినుకుల సవ్వడి
వీచే గాలుల అలజడి
మెత్తగా గమ్మత్తుగా వుంటే..!!
కూనిరాగాల కోయిలమ్మల కోమల గీతాలు
కమ్మగా వీనుల విందు చేస్తుంటే..!!
ఎక్కడో దూరంగా వినిపించే
లేగదూడల మెడలో మువ్వల సడి
మృదు మంజీర నాదం లా హాయిగా అనిపిస్తుంటే ...!!
ఏదో తెలియని భావనా తరంగపు అలల తాకిడి
ఊపిరాడనివ్వని మరో ప్రపంచం లో...
చుట్టుముట్టే ఆలోచనా తరంగాల
అంతరంగపు మరో కోణం...!!
నీ చుట్టూనే తిరుగుతోంది...!!

2, జులై 2012, సోమవారం

ఆ క్షణం..!!

చెప్పకనే చెబుతోంది నీ మౌనం...!!
మౌన తటాకంలో కలల తరంగం ...!!
మత్తుగా గమ్మత్తుగా ఉన్న...
కనిపించి కనిపించని నీ రూపం...!!
విరిసి విరియని మొగ్గలలో
కిలకిలలాడే నీ చిరునవ్వు...
తుషారమై నను తాకిన క్షణం....!!
మసక చీకటిలో ఒక్కసారిగా....
పండువెన్నెల పరచుకుంటే...!!
జాలువారిన జాబిలి సొగసులు...!!
కనువిందు చేసే కలువల కెంపులు ...!!
ఎటుచూసినా నిన్నే తలపిస్తుంటే...!!
నిన్ను చూడాలని .....
నిలువనీయని మది మారాము చేస్తుంటే
కనుల నిండిన నీ చిత్రం....!!
రెప్ప పడితే కనురెప్ప చాటున
కనుమాయమౌతుందేమో..!! అని
కన్ను మూయటమే మరచిపోయాను...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner