31, జనవరి 2012, మంగళవారం

ప్రపంచంలో......అదృష్టవంతులు....ఎవరో మరి...!!


కడుపు నిండా తిండి
కంటి నిండా నిద్రా
నోరు నొప్పి పుట్టే వరకు సెల్ ఫోనులో మాటలు అక్కయ్యలు బావయ్యలు అన్నయ్యలు తమ్ముళ్ళు ఇంకా అన్ని రకాల వరుసల వాళ్ళతో .......ఇంత మంచి అదృష్టం ప్రపంచంలో ఎంతమందికి దక్కిందో!!!
అన్నట్టు ఈ టపా చదివిన వాళ్ళలో ఎవరైనా ఆ అదృష్టవంతులు వుంటే తెలుపగలరు.

27, జనవరి 2012, శుక్రవారం

ఎంత కష్టం..ఎంత నష్టం...!!

బడుగు రైతు బాధలు ఎవరికర్ధం అయ్యేను?
విత్తనాలేస్తే మొలకలోస్తాయో లేదో అని భయం!!
మొలకలోస్తే నీరు లేక ఎండిన మడి
నారు కొని నాటు వేస్తే సకాలానికి
నీరు అందక బీటలు వారిన చేలు
బాలారిష్టాలు దాటాయి కోత కోద్దామంటే
వరుణ దేవుడి బెదిరింపులు మధ్యమధ్యలో
కోత కోసి కుప్పలేసి కష్టానికి ఫలితమోస్తుందనుకుంటే
పండిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేక
అమ్మాలో లేదో తెలియని అయోమయంలో
దిగులుగా గుబులుగా ఉన్న బక్క చిక్కిన రైతుని కూడా
పీక్కుతినే ఈనాటి రాజకీయ రావణ కాష్ఠం!!
కల్తి విత్తనాలు, చాలీ చాలని ఎరువులు అంది అందని ధరలలో ఊరించినా.....ఏదో వరుణుని దయతో....పంట బాగా పండించి అమ్మయ్య ....
పంట బాగా పండింది ఈ సారి అప్పులు కస్టాలు తీరిపోతాయి అనుకునే రైతుని బతకాలో చావాలో తెలియని అయోమయంలో పడవేస్తోంది మన ప్రజాస్వామ్య నాయకత్వం. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ప్రతి ఒక్కరికి అవసరమైన ధాన్యానికి మాత్రం కనీస ధర లేక పోవడం ఎంత సిగ్గుచేటు?? ఒక దాన్యమనే కాదు టమోటాలు, ఉల్లి, మిరపకాయలు, పసుపు...ఇలా చెప్పుకుంటూ పొతే చాలా పంటలు వున్నాయి.
ఉచిత కరెంట్ అంటారు పల్లెల్లో కనీసం కరెంట్ అంటే మర్చి పోయేటట్లు వున్నారు, ఇక ఉచిత కరెంట్ తో పనేముంది?
కనీస కూలి రేట్లు కూడా అందుబాటు లో లేక పోయినా అష్ట కస్టాలు పడి పంట పండిస్తే చివరికి మిగిలేది ఏంటి? పొలాలు అమ్ముకునే అప్పులు తప్ప!!
పిల్లల చదువులనోలేక బతకడానికి ఏదోఒక దారి దొరుకుతుందనో పట్టణాలకు పిన్నలు వలసలు పోతుంటే పెద్ద తరం వాళ్ళు వున్న ఊరిని వదలి రాలేక ఒంటరిగా ఉండలేక పడే అవస్థలు ఎన్నో ఎన్నెన్నో!! కనీసం వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేక పోతుంటే అది చూడ లేక పిల్లలు అటు ఇంటికి పోలేక ఇటు చాలిచాలని జీతాలతో బతుకునీడ్చలేక ఎన్ని బలవంతపు చావులో!!
పల్లెల్లో కనీసం చాకలి కూడా రాని పరిస్థితి ఈ రోజుల్లో....ఎందుకంటే వాళ్ళు చదువులు ఉద్యోగాలు.....అది కాకుండా పని చేయాల్సిన అవసరం లేకపోవడం.....వయసుడిగిన వాళ్ళు పని చేసుకోలేని నిస్సహాయ స్థితిలో వుండటం!!
మరి వీటికి పరిష్కారాలేంటో!! కాలమే చెప్పాలి!!

6, జనవరి 2012, శుక్రవారం

ముచ్చటగా మూడో పుట్టినరోజు

అప్పుడే బ్లాగు రాయడం మొదలు పెట్టి మూడు ఏళ్ళు అయిపొయింది. అస్సలు మా ట్రస్టు కోసం బ్లాగు మొదలు పెట్టాలన్న ఆలోచన ముందుగా మా క్లాస్మేట్ ఎం.వి సుబ్బారావు గారు చెప్తే బ్లాగు ఎలా క్రియేట్ చేయాలో చెప్పింది విక్రం. తరువాత టపాలు రాయడానికి ఎక్కువగా ప్రోత్సహించింది శ్రీకాంత్. ఇక బ్లాగును కాస్త అందంగా తీర్చిదిద్దడంలో సలహాలను జ్యోతిగారు అందించారు. సహకారాన్ని లక్ష్మిపతినాయుడు,శరత్, చంద్రశేఖర్ అందించారు. అందరికి నా కృతజ్ఞతలు. ఇక నా టపాలను ఆదరిస్తున్న ప్రత్యక్ష పరోక్ష పాఠకులందరికి నా ధన్యవాదాలు. నా బ్లాగు ముచ్చటగా మూడో పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది....
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner