1. మనసు ఉలిక్కి పడుతోంది
మౌనం అర్ధం కావడం లేదని...!!
2. శబ్దాలంకారాలెన్నో
మౌనం దాల్చిన మనసుకు...!!
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమనే అర్థమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది
1. మనసు ఉలిక్కి పడుతోంది
మౌనం అర్ధం కావడం లేదని...!!
2. శబ్దాలంకారాలెన్నో
మౌనం దాల్చిన మనసుకు...!!
1.మౌనానికి మనసైందట
అక్షరాల అక్షతలతో దీవించేస్తుందట..!!
2. మౌనం మనసు విప్పింది
అక్షరాలకు పనిబెడుతూ....!!
3. జ్ఞాపకాలన్నీ నాతోనే
గమ్యాన్ని చేరడానికి ఊతంగా.....!!
4. మౌనం నిండా నీ ఊసులే
ఏకాంతానికి విరామమిస్తూ...!!
5. జ్ఞాపకాల గూటికి చేరిందో క్షణం
రాతిరి కలలో నిన్ను దాచుకుని....!!
6. లెక్కలు తేలని మలుపుల్లో
అక్కరకు రాని మరపులే...!!
7. కలతలన్నీ వెలితి పడుతున్నాయి
క్షణాలన్నీ నీతో చేరికౌతుంటే...!!
8. మనసు తెలిపే మౌనాలే మనవి
దాచిన జ్ఞాపకాల అరల్లో...!!
9. మరకలన్నీ మాయమిక
మనసు స్వచ్ఛత ముంగిట...!!
10. వెన్నెల వర్షిస్తోంది
చీకటి చినుకులకు పోటిగా...!!
మౌనంగా వుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి అందరికి....నాకు నా ఆలోచనలను అందరితో పంచుకోవాలని అనిపించి ఇది మొదలు పెట్టాను....మీ సలహాలు సూచనలు నాకందిస్తారని అనుకుంటూ....
చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని వుండేది, అది కవితైనా, కధైనా వ్యాసమైనా, జీవితమైనా ఏదో ఒకటి... కనీసం ఒక్కరికి మనం మంచి చేయగలిగితే చాలు అనిపించేది. అమెరికాలో వున్నప్పుడు రోజు న్యూస్ పేపర్స్ లో అప్పుడే పుట్టిన పిల్లలని వదిలేసిన లేదా చంపేసిన సంఘటనలు ఎన్నో చదివి చాలా బాధ అనిపించేది....అలాంటి మానసిక సంఘర్షణల కి ఎన్నిటికో... ఒక రూపం నేను మొదలు పెట్టిన "URLC ట్రస్ట్"...ముందు ముందు మీ అందరి సహకారాన్ని సహాయాన్ని ఆశిస్తూ....నాలో వున్న నన్ను మీ ముందు ఉంచే ఈ చిరు యత్నమే.......