29, ఫిబ్రవరి 2024, గురువారం

కుటుంబం..!!

 


          వినడానికి పదం చాలా బావుంటుంది. కాని రోజుల్లో కుటుంబం అంటే మేము, మా పిల్లలు అన్నట్టుగా వున్నా, ఎవరి గదుల్లో వారు, ఎవరి పనుల్లో వారు మునిగి తేలుతున్నారు. భార్యాభర్తలు కూడా ఒకే గదిలో వున్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగానే ఆధునిక యుగంలో యంత్రాలకు అలవాటు పడి యాంత్రికంగానే మారిపోతున్నారు. మన ఇంటి గురించే మనం ఆలోచించ లేనప్పుడు ఇక సమాజం గురించి ఏం ఆలోచించగలం?

            మన అమ్మానాన్న మనల్ని పెంచకుండానే మనం రోజు స్థాయిలో ఉన్నామా! మనమీ స్థాయిలో ఉండటానికి మన తల్లిదండ్రులు ఎన్ని అవసరాలు మానుకున్నారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో అని మనమో క్షణమయినా వారి గురించి ఆలోచించ గలుగుతున్నామా! మన ఉన్నతస్థాయికి వారు అడ్డంకి అని వారిని వీధులపాలు కొందరు, వృద్దాశ్రమాలకు కొందరు పంపేస్తుంటే, మరికొందరేమో బిడ్డల నిరాదరణ తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు

           మన తరం అటు అమ్మానాన్నలను చూడలేక, ఇటు పిల్లలకు దగ్గర కాలేక రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యారు. మా అమ్మాయి/అబ్బాయి అమెరికాలో ఉన్నారని గర్వంగా చెప్పుకోవడం తప్ప, బంధాలను, అనుబంధాలను మన చేతులారా మనమే దూరం చేసుకుంటున్నామని గ్రహించలేక పోతున్నాం. ఉమ్మడితనంలోని సంతోషాలను అనుభవించ లేక ఏకాకితనాలకు అలవాటు పడిపోయి ఇదే అద్భుత ప్రపంచమని భ్రమ పడుతున్నాం.

            మనం నేర్చుకున్న విలువలు మన తరువాతి తరాలకు పంచాలన్న ఆలోచన మనకు లేక పోవడం బాధాకరమే. అయినా మనమే మనిషితనాన్ని వదిలేసుకుంటున్నప్పుడు ఇక విలువలు, అనుబంధాలు, కుటుంబం అన్న పదాలు హాస్యాస్పదంగానే అనిపిస్తాయి. మనం మన పెద్దలకు ఇచ్చినదే రేపటి రోజున మన పిల్లలు మనకు ఇస్తారన్న విషయాన్ని గుర్తుంచుకుంటే కనీసం కొన్ని కుటుంబాలయినా నిలబడతాయి


             


19, ఫిబ్రవరి 2024, సోమవారం

కొన్ని చెప్పాల్సిన మాటలు..!!

          “గొడ్డలిపోటు మిస్ అయిపోయాము అయ్యో అనుకుంటే భలే చూపించారురా అబ్బాయ్..ఏదేమైనా “రాజధాని” సమస్యకు పరిష్కారం చాలా బావుంది”.

      నేను, నా అనుకునే ఈరోజుల్లో మనం అంటూ కదలిక వస్తేనే పాలకుల చేతల్లో మార్పు..అని చక్కగా చూపించారు. అభివృద్ధి అక్కర్లేదని ఇక్కడి ప్రజలే తమ రాతను మార్చుకున్నారు. కనీసం ఈ సినిమా చూసైనా మీ ఆలోచనల్లో తప్పేంటో తెలుసుకోండి. మరోసారి తప్పు చేయకండి.

      కూలగొట్టడాలు, పేర్లు మార్చడాలే అభివృద్ధి, పురోభివృద్ధి అనుకునే మీ మేధావితనాన్ని, భావి తరాల పతనానికి బాటలుగా వేసామని గుర్తించండి. ఒక వ్యక్తి మీద, కులం మీద కక్షని వ్యవస్థ వినాశనానికి వాడుకుంటున్న వె..లకు బుద్ధి చెప్పడానికి  “రాజధాని FILES” లో చూపించిన ప్రతి సీన్, చెప్పిన ప్రతి మాట చాలా బావుంది. ఒకప్పుడు రాజధాని ప్రాంతంలో కూడా అభివృద్ధిని ఓడించిన జనాలు, ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నారో లేదో. 

         ఓ మనిషిని ఇష్టపడటంలో తప్పు లేదు. కాని జనం కోసం తీసిన ఈ సినిమా మన అందరిది. సైకోలు, శాడిస్ట్లు ఎలా ఆలోచిస్తారో కళ్ళ ముందు కనిపిస్తుంది. ప్రతి పాట, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ అద్భుతంగా ఉంది. చూడనివారు..!

ఇన్నేళ్ళకు ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని అందించిన నిర్మాత రవిశంకర్ కంఠమనేని గారికి, భానుశంకర్ గారికి మనసున్న ప్రతి మనిషి అభినందనలు చెప్తారు…!!

17, ఫిబ్రవరి 2024, శనివారం

రేటింగ్..!!

       కాలంనాడెప్పుడో అమెరికాలో ఉన్నప్పుడు “అతడు” సినిమాకి గ్రేట్ ఆంధ్రా వెబ్ సైట్ వారు ఇచ్చిన రేటింగ్  చూసి చాలామంది సినిమా చూడాలా వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయారు ఒకటి రెండు రోజులు. మెుదటి షో కి వచ్చిన వారిలో సినిమా చూసి తిరిగి వెళ్ళేటప్పుడు ఏ ఒక్కరి నోటి నుండి కూడా సినిమా గురించి బాలేదు అన్న మాట వినబడలేదు. సినిమా ఇంత బావుంటే ఈ గ్రేట్ ఆంధ్రా వాడేంటి ఇలా రేటింగ్ ఇచ్చాడన్న మాటలే వినబడ్డాయి. అప్పటి నుండి ఆ సైట్ వాడి రేటింగ్ ని జనాలు నమ్మడం మానేసారు. వారు ఒక్కరి సినిమాలకు మాత్రమే ఐదు రేటింగ్ ఇచ్చేవారు అప్పట్లో. 

          ప్రేక్షకుడు తను చూసిన సినిమా గురించి తన ఫీల్ చెప్తాడు. మన చేతి ఐదు వేళ్లు ఒకేలా లేవు కదా. చాలామంది పెద్ద పెద్ద సిని విమర్శకులు “రాజధాని FILES” సినిమా గురించి తమ తమ అభిప్రాయాలు చెప్తూ రేటింగ్స్ ఇస్తున్నారు. తప్పు లేదు వారి అభిప్రాయం వారు చెప్తున్నారు ఇన్నాళ్ళ సిని చరిత్రను అనుసరించి.

          అప్పటి “ప్రతిఘటన” సినిమా గురించి ఇప్పటి “రాజధాని FILES” గురించి మాట్లాడటం మెుదలుబెడితే అది సమస్య గురించి ప్రతి ఒక్కరికి తెలియాలన్న తపన, దానికి తమ వంతు బాధ్యతగా చెప్పిన పరిష్కారం మనకు కనబడుతుంది. రైతుని గౌరవించే ప్రతి మనసుకు ఈ “రాజధాని FILES” సినిమా నచ్చేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 

            సదరు సినీ విమర్శక పెద్దలు మూడు రేటింగ్ ఇచ్చినా, అసలు ఇవ్వక పోయినా రైతు కష్టం, రైతు మీద అభిమానం, గౌరవం వున్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూస్తారు, చూడాలి కూడా. ఈ సమస్య ఈరోజు ఈ ప్రాంతంది కావచ్చు. రేపు మీది కాదన్న గ్యారంటీ వుందా! 

            కమర్షియల్ సినిమాల్లా హీరోయిన్ ని చూపించడం లాంటి పనులు ఈ సినిమాలో లేవు. ఏది ఎంత వరకు చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏ మాట ఎక్కడ వాడాలో, ఎవరిని ఎలా చూపించాలో లాంటి అదను, పదును బాగా తెలిసిన వ్యక్తిగా డైరెక్టర్ భానుశంకర్ గారు కృతకృత్యులయ్యారు. ఈసమాజంలోని వ్యక్తిగా ఎవరూ చేపట్టని బాధ్యతను తన భుజాల మీద వేసుకుని ధైర్యంగా రాసుకున్న స్క్రీన్ ప్లే కి ప్రేక్షకుడు హాట్సాఫ్ చెప్పక తప్పదు.

            దివిసీమ రైతుబిడ్డగా తన ప్రాంతపు బుుణాన్ని ఈ “రాజధాని FILES” సినిమా తీసి రవిశంకర్ కంఠమనేని గారు తీర్చేసుకున్నారు. రవిశంకర్ గారు ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని కానుకను మీరు రైతులకు ఇచ్చారు. రైతులందరు మీకు కృతజ్ఞులు చెప్పాలి. రోజుల్లో ఇంట్లో సమస్యలనే పట్టించుకోని వారు బోలెడుమంది. తనతో పుట్టి పెరిగిన బంధాలను సమస్యలలోనికి నెట్టి ఆనందించేవారు మరికొందరు. సమస్య మనది కాదు కదా మనకెందుకులే అని చూసి చూడనట్టు పోయే ఇరుగు పొరుగు వున్న సమాజం మనది. 

             రాజధాని రైతులను అవహేళన చేసిన టీ వి యాంకర్లు, రాజకీయ పార్టీలు, కొందరు వెధవలు ఈ సినిమా తప్పక చూడండి. మీరేంటి అన్నది కనబడుతుంది. ఏదేమయినా, ఎవరేమనుకున్నా ఓ మంచి సినిమా  “రాజధాని FILES”. మనిషన్న వాడు చూడాల్సిన సినిమా.

15, ఫిబ్రవరి 2024, గురువారం

మనమెక్కడున్నాం..!!

         వ్యక్తిగత స్వేచ్ఛ లేని సమాజంలో మనం బతుకుతున్నామిప్పుడు. మాట్లాడే స్వేచ్ఛ కాని, తప్పుని ప్రశ్నించే హక్కు కాని లేని వ్యవస్థగా మారిపోయిన సమాజమిది. అధికారం, అహంకారం మాత్రమే రాజ్యమేలుతున్న చోట మనిషి మనుగడే కాదు, వ్యవస్థ కూడా సర్వ నాశనమౌతుందనడానికి సాక్ష్యం మన ముందే వున్నా ఒప్పుకోలేని తెలివిగల మేధావులున్న ప్రాంతం మనది

      నువ్వు మాట్లాడాలంటే నాకు నచ్చినట్టు మాట్లాడు. నువ్వు సోషల్ మీడియాలో ఏదైనా రాయాలంటే నాకు నచ్చినట్టు రాయి. నువ్వు సినిమా తీయాలన్నా, డాక్యుమెంటరీ తీయాలన్నా, రీల్ చేయాలన్నా ఏదైనా సరే నీకంటూ స్వతంత్రత లేదు. ఇక్కడ ప్రతిదీ నాకు నచ్చినట్టే జరగాలి. లేదంటే కేసులు, కుళ్ళబొడవడాలు, ట్రోల్ చేయబడాలి వగైరా వగైరా చాలా జరుగుతాయి. ఆడ, మగ అన్న విచక్షణ కాని ముసలి, ముతక,పసిపిల్లలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు అన్న ఆలోచన కాని ఏదీ మన మానిఫెస్టోలో ఉండదు. ఇదే ప్రజాస్వామ్యం. నచ్చితే వుండు లేదంటే దొ..య్. ఇదే మన అధికారభాష.

     13 ఆన్ లైన్ లో ట్రెండ్ సెట్ మాల్ విజయవాడ లో స్క్రీన్1 లో 10.40 కిరాజధాని FILES” సినిమా టికెట్లు బుక్ చేసుకుని, ఈరోజు సినిమాకి వెళితే సగం సినిమా వేసి ఆపేసారు. కోర్టు ఆర్డర్ వచ్చింది ఆపేయమని అని ఇంటర్వెల్ లో చెప్పారు. మేము ముందు స్నాక్స్ ఆర్డర్ కోసం వచ్చారనుకున్నాం. మేం సగం సినిమా చూసాం కదా, పూర్తిగా చూడనిదే వెళ్ళము అన్నాం. ముందు ఎంఆర్వో వచ్చి ఆపేయమన్నారు అన్నారు, కోర్ట్ ఆర్డర్ చూపించమన్నాం. సదరు ఎంఆర్వో అని చెప్పి తీసుకు వచ్చినాయన పటమట విఆర్వో గారట. ఆర్డర్ చూపించండి వెళిపోతామన్నాం. వాట్సప్ మెసేజ్ చూపించారు. మాకు ఆర్డర్ కాపి ప్రింట్ పేపర్ చూపించండి అంటే వారు బయటికి వెళ్ళారు తేవడానికి. 12.10 సినిమా ఆపేసారు. వీరు 1.10 కి కష్టపడి ఏవో సంతకాలు చేసిన ఆర్డర్ తెచ్చారు. ఈమధ్యలో కొసమెరుపుగా పోలీసాయన కూడా వచ్చి వారేదో చెప్పి, మీరు కేస్ వేసుకోండి అని, అక్కడే కాపలాగా నిలబడ్డారు. థియేటర్ వారిని జరిగినది రాసి సంతకం చేసి ఇవ్వమంటే వారు ఇవ్వలేదు. మెుత్తానికి సగం సినిమానే చూసాం.

        సంఘటన చాలామందికి పెద్దగా ఏం అనిపించక పోవచ్చు. నా సగం జీవితంలో ఇప్పటి వరకు ఇలా థియేటర్ లో సగం సినిమా చూసిన రోజు లేదు. ఇక్కడ సినిమా ఆపగలరు. ఇంకెక్కడా ఆపలేరు కదా. జరిగిన నిజాలు చూడకపోయినా అందరికి గుర్తే వున్నాయి. సినిమా ఆపినంత మాత్రాన జరిగేది ఆపలేరన్న నిజం ఇప్పటికయినా తెలుసుకోండి సదరు పెద్దలు

       నిజాలను తెరకెక్కించడానికే కాదు ధైర్యముండాల్సింది. దానిని చూడాటానికి కూడా అంతకన్నా ఎక్కువ ధైర్యం కావాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మన ఘనత నెరగనివారు లేరు. అన్నానంటే అన్నానంటారు కానండి సినిమా చూడనివారు…! 

      సగం సినిమా చూసినా చాలా చాలా సంతోషమనిపించింది.అదే క్షణంలో జరిగినవి, జరుగుతున్నవి గుర్తుకువచ్చి బాధ కూడా వేసింది. రైతు లేనిదే ప్రపంచానికి ఆకలి తీరదు. కాని రైతుకు, రైతు కష్టానికి విలువ లేదు. మనమే కాదు, మన భవిష్యత్ తరాలు కోల్పోయినదేమిటో, కోల్పోతున్నదేమిటో మన మూసుకుపోయిన కళ్ళు తెరిపించడానికి చేసిన గొప్ప ప్రయత్నమిది. మేం చూడలేక పోయినా చూడగలిగిన అవకాశమున్న ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమారాజధాని FILES”. 

       2000 సంవత్సరంలో నాకు తెలిసిన రవిశంకర్ గారు ఆబ్జెక్ట్ వన్ సిఈవో. అప్పట్లో జావా నేర్చుకోవడానికి అమీర్పేటలో వెళుతుండేదాన్ని. అప్పుడేతెలుగు వన్కు శ్రీకారం చుట్టారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు, తర్వాత తెలుగు వన్తెలియని వారు అక్కడ లేరంటే అతిశయోక్తి కాదు. మెున్నీమధ్యన మారుమోగిన హైటెక్ సిటీ విజయఢంకాలో వీరి మాటలు కూడా విన్నాను. ఇప్పుడు వీరి ప్రెస్ మీట్ కూడా చూసాను. వాస్తవాలు చెప్పారు. భానుగారు కూడా బాగా చెప్పారన్నీ. స్క్రీన్ ప్లే ఎంత బావుందంటే సినిమా చూసి తీరాల్సిందే. హాట్సాఫ్ భానుగారు.

       “రాజధాని FILES”  సినిమా మెదటి నుండి అద్భుతంగా తీసారు. భూమి విలువ, రైతు విలువను చెప్పిన సినిమా. ఇంతకు ముందు రైతుల గురించి చాలామంది చాలా సినిమాలు తీసారు. కమర్షియల్ గా గెలిచి వుండవచ్చు. సమస్యను చెప్పడం చాలామంది చేస్తారు. సినిమాలో సమస్యకు చెప్పిన పరిష్కారం చూడలేక పోయాను మన హైలీ రెస్పెక్టెడ్ వారి వల్ల. ఏదేమైనా సదరు హైలీ రెస్పెక్టెడ్ వారికి మనమే కాదు సినిమా యూనిట్ మెుత్తం కూడా థాంక్స్ చెప్పాలి. మంచి సినిమాతో బోణి చేసిన రవిశంకర్ గారికి, ఇంత మంచి సినిమా కు సహకరించిన సినిమా యూనిట్ అందరికి హృదయపూర్వక అభినందనలు


12, ఫిబ్రవరి 2024, సోమవారం

మన వెధవల సంస్కారం..!!

     ఒకావిడ ఏదో తన పుట్టినరోజున వాళ్ళాయన బయటికి తీసుకువెళుతున్న ఆనందాన్ని తన రీల్ లో పంచుకుంటే మన దిక్కుమాలిన వెధవల కామెంట్లు చూసి చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి ఏమనలేదు ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పలేదు అని అంది. దానికి ఈ వెధవలు మీ ఆయన మీ నాన్నలా వున్నాడు, నువ్వు చాలా యంగ్ అంటూ ఇంకా చాలా చెప్పలేని విధంగా కామెంట్లు. ఈ వెధవలకు మరి ఆడవాళ్ళు అస్సలు తెలియదు కాబోలు. ఆ కామెంట్లలో నా లిస్టులో వున్న వెధవలని కూడా పీకేసాను. పాపం ఆవిడ పుట్టినరోజన్న సంస్కారం కూడా లేని ఈ దిక్కుమాలిన దరిద్రులు మరి ఓ అమ్మకు, అబ్బకు పుట్టారో లేదో వారికే తెలియాలి.

6, ఫిబ్రవరి 2024, మంగళవారం

జీవన మంజూష 02/24


 నేస్తం,

         ఈరోజుల్లో చాలామందికి అవసరంరేపటిపౌరులుసినిమాలో చాలా విషయాలు. పిల్లలను చూసి చాలామంది పెద్దలు నేర్చుకోవాల్సిన విషయాలు బోలెడు. మన ఇంట్లో తప్పులను ఎత్తి చూపలేనప్పుడు, మనకు ఎదుటివారి వ్యక్తిత్వాన్ని విమర్శించే హక్కు ఉందంటారా! తల్లిదండ్రులు అందరికి దైవ సమానులే కాని మన తల్లిదండ్రులు మనకెంతో ఇతరుల తల్లిదండ్రులు వారికి అంతేనన్న చిన్న విషయాన్ని మనమెందుకు మర్చిపోతున్నట్టో!

           పంపకాలు, అంపకాలు వాటిలో నిజానిజాలు చెప్పడానికి దివి నుండి భువికి దిగిరావాల్సిన అవసరముంది ఇప్పుడు. కాని అవి జరగని పనులు కనుక మన నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సబబు కాదు. అది నాయకుడైనా, సామాన్యుడైనా ఒకటే నీతి. ఇక పోషించడాలు, పెద్దవారిని చేయడాలు వెనుక ఎంత నాటకీయత నడిచిందన్నది జగమెరిగిన సత్యం. కుటుంబంలోనైనా విషయాలు జగద్విదితమే. నేను చెప్పినంత మాత్రాన నిజం అబద్ధమవదు. గొంతు చించుకుని నలుగురి దగ్గర చెప్పినంతనే అబద్ధం నిజమవదు

            బంధాలకు అర్థం, అనుబంధాలకు రూపం మనమేనని ఒళ్లు విరుచుకుంటే, రేపటి రోజున మనమే నలుగురిలో నవ్వులపాలు కావచ్చు. కష్టం మన ఇంటిది కాదని తోడబుట్టినవారిని అవమానిస్తే, లెక్కలు సరిజేయడానికి మాస్టారు బెత్తంతో మన పక్కనే ఉంటాడని చరిత్ర చెబుతోంది. మనమనే ప్రతి మాటకు ఎదుటివారు సమాధానం చెప్పగలరు. కాని మనం ఓసారి ఆత్మ విమర్శ చేసుకుంటే నిజం ఏమిటన్నది తేటతెల్లమౌతుంది

              రెండిళ్ల మధ్యన దూరం ఎప్పుడూ మారదు. దగ్గరతనం లేని అనుబంధాన్ని తెంచుకోవడమే ఉత్తమం. అవసరార్థం నటించే మనసులున్న మనుష్యులం మనమై పోతున్నప్పుడు, నిజాయితీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంటుంది. మన ప్రవర్తన మనకు బావున్నప్పుడు, ఎదుటివారిది వారికీ బావుంటుంది. ఎందుకంటేసూర్యుడు తూర్పున ఉదయించునుఅన్నంతగా అన్న మాట. మనస్సాక్షి అనేది మనకు గుర్తుంటే కనీసం మన జీవితంలో క్షణమయినా నిజాన్ని ఒప్పుకుందాం..!!



            

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner