30, సెప్టెంబర్ 2012, ఆదివారం

దూరం దగ్గరైతే...!!

 
కలవలేని తీరాల మద్య ఉన్నా
మనసుల మద్య ఆత్మీయత  దూరమౌతుందా ...!!
పెనవేసున్న స్నేహ సుమం పరిమళం పంచకుంటుందా ..!!
తీరాలు వేరైనా చేరే గమ్యం ఒక్కటే....!!
దారులు వేరైనా చివరి మజిలి అక్కడికే...!!
ఎన్ని ఉన్నా...ఏమైనా... శూన్యమైన ఎదలో...
సందడి చేసే జ్ఞాపకం....ఎప్పటికి దగ్గరగానే...!!

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

నుదుటి రాత

వేకువా లేదు వెన్నెలా లేదు
భారమైన కాలం బరువుగా కదులుతుంటే.!!
వేదనల నిట్టూర్పు సెగలు రోదనలుగా చుట్టుముడుతుంటే..!!
నెగడు లో మండుతున్న మంటలు....
శూలాల శరాఘాతాలై గుచ్చుతుంటే...!!
శూన్యమైన ఆకాశం రేయి చందురుని కోసమో...!!
తొలిపొద్దు సూరీడు రాక కోసమో...!!
ఎదురు చూస్తూ వుంటే....!!
మారే రోజు మరో రోజో...లేక మరపు రాని రోజో...!!
తలరాతను మార్చేరోజో అని ఎదురు చూపు...!!
విధి రాత తెలియక..!!
 

13, సెప్టెంబర్ 2012, గురువారం

ఓ సాదు జీవి లాంటి క్రూర జీవి....!!

అనగనగా ఓ ఊరు...ఆ ఊళ్ళో ఓ సాదు జీవి లాంటి క్రూర జీవి. ఎంత నటన అంటే తనని తిట్టినా కూడా ఏమి అనని అంత. ఈ జీవిని జంతువుతో పోల్చడం జంతువులని అవమానించినట్లు అన్నమాట. ఎవరైనా పక్క వారు బావుంటే మనకి కనీసం అవసరానికి అప్పు ఇస్తారు ....అనుకుంటాము...కాని ఈ జీవి మాత్రం తను బావుంటే చాలు...పక్కనే కాదు ఊరిలో ఎవరు బావుండకూడదు....తన మాట వినాలి..తనకే అన్ని చేయాలి...తననే పొగడాలి...ఎంత సేపు తెర వెనుక రాజకీయాలు మాత్రమే....తెర ముందు కాదు. మీ ఊళ్ళో కూడా వున్నారా ఇలాంటి వాళ్ళు ..??

మాటలే...రాని...క్షణం...!!

మాటల్లో చెప్పలేని ఆనందం...!!
మనసుతో మాత్రమే ముడి పడిన అనుభూతి..!!
కనులతో చూడగలిగితే..!!
ఎప్పుడో దూరమైనా....ఇప్పుడు దగ్గరైతే..!!
చెప్పడానికి మాటలు ఎలా సరిపోతాయి...??
ఆనందం క్షణ కాలం....!!
అనుభూతి అచిరకాలం..!!
అదే... జ్ఞాపకం..!!
సంతోషమైనా...విషాదమైనా....
పంచుకోగలిగేది ....
మనసు తెలిసిన నేస్తంతోనే...!!
మంచి కోరే ఆత్మ బంధువుతోనే..!!
దురాన ఉన్నా....
దగ్గరగా చేసే అనుబంధం
అదేనేమో...ఆత్మ బంధం...!!
స్నేహ బంధం..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner