కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, సెప్టెంబర్ 2026, మంగళవారం

అమ్మకు రాయని ఉత్తరం..!।

         అమ్మా,

                  ఇప్పుడు అమ్మగా మారిన నేను నీకు రాస్తున్న మనసు ఉత్తరం ఇది. ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకుంటూనే, చెప్పలేక దాటవేసిన సంగతులు బోలెడు. నా చిన్నప్పుడు నీ పక్కలో పడుకుని నువ్వు చదివే కథలు వింటూ పెరిగిన నాకు, నువ్వు ఆ కథల్లో నేర్పిన నిజాయితీ, మానవత్వం, జాలి వంటివి ఈనాటి సమాజంలో నేను నేనుగా బ్రతకడానికి చాలా అడ్డుపడుతున్నాయి అమ్మా! అయినాసరే నేను నాలానే వున్నానిప్పటికి. చిన్నప్పుడు వర్షంలో తడిచిపోతున్న కాకులను “అమ్మా పాపమమ్మా కాకులు వర్షంలో తడిచిపోతున్నాయి, వాటిని లోపలికి పిలువమ్మా!“ అన్న అమాయకపు చిన్నతనమే నన్నింకా వెంటాడుతోంది. మరీ ఇలా పెంచితే ఇప్పటి జనారణ్యంలో ఎలా బ్రతకాలమ్మా?

                    నీ అతి మంచితనం, అమాయకత్వంతో అందరిని గుడ్డిగా నమ్మేస్తూ మమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తున్నావు కదమ్మా! దాపరికం, మోసం అస్సలు తెలియని నీకు, నీ చుట్టూ వున్న జనాలు అందరూ నిన్ను వారి వారి అవసరాలకు, వారు పైకి ఎదగడానికి ఉపయోగించుకుని, “కూరలో కరివేపాకులా” పక్కనుంచినా, వాళ్ళ మీద కోపం తెచ్చుకోని నీ అతిమంచితనం మీద చాలా కోపమోచ్చేస్తుందమ్మా! ఎందుకమ్మా నీకు బంధాలంటే అంత పిచ్చి ప్రేమ? అవసరాలకి బంధాలను వాడుకునే నీ అనుబంధాలపై నీకసలు కోపమే రాదెందుకు? ఎఫ్పుడైనా కోపమోచ్చినా అది “నీటి మీది రాత” లా క్షణంలో మాయమైపోతుంది. ఇలా ఐతే ఎలా అమ్మా!

                   ఓ నెల నీ బొజ్జలో ఎక్కువున్నా విసుక్కోకుండా, సన్నగా పీలగా వున్నానని చీదరించుకోకుండా నలుగురిలో ప్రత్యేకంగా కనబడేలా మలిచిన నీ ప్రేమ పనితనం ముందు విధాత కూడా ముక్కన వేలేసుకున్నాడు కదా! కథలు, కవితలు రాయడం నీకు ఇష్టం లేకపోయినా, నన్ను ఎవరైనా పొగిడితే ఎంత సంతోషంగా నలుగురితో పంచుకుంటావో. నీ ఆ ఆనందం చూడటం నాకిష్టం. నాకు అమ్మవైన నువ్వు నా పిల్లలకు కూడా అమ్మవై వాళ్ళని పదిమంది మెచ్చుకునేలా పెంచిన నీ పెంపకానికి హృదయపూర్వక వందనం. 

                 ఐదు దశాబ్దాలకు పైగా విరామమెరుగని నీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాల కన్నీళ్ల ఆటుపోట్లు ఎదురైనా నేర్పుగా ఎదుర్కొన్న ధీశాలివి నువ్వు. నీ నుండి నేను నా పిల్లలు నేర్చుకున్న ధర్మం, ధైర్యం అదే. నా జీవితంలో నువ్వు లేని క్షణం వుండకూడదనే చిన్న కోరికను మన్నించి నాతోనే వుండమ్మా నేనున్నంత వరకూ..! ఎంత రాసినా ఇంకా మిగిలిపోతూనే వుందమ్నా నీకు రాయని వుత్తరం రాస్తుంటే.।!

26, సెప్టెంబర్ 2026, శనివారం

మ’రణం అంచున..!!

         ఏటి ఆవల జ్ఞాపకాల నడుమన నేను..ఇంటికి పెద్దబిడ్డగా అల్లారుముద్దుగా అందరి మధ్యన గారాబంగా చిన్నతనం. తెలిసీతెలియని వయసులో ఏటిలో దూకుళ్ళతో, ఆటలతో అల్లరి బాల్యం. చదువులోనూ ముందే ఉంటూ ఏమైనా సరే ఇంజనీరు అవ్వాలన్న బలీయమైన కోరికకు బీజం పడింది పెదనాన్న ఇంజనీరని చెప్పే నాన్న మాటలతో. బాబాయి మరణంతో హాస్టల్ చదువు మెుదలు. 

          అప్పటి వరకు అందరి మధ్యనా వున్న నేను ఒంటరినై పోయానన్న దిగులు. చదువుతూ దిగులును దూరం చేయాలన్న ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఇంజనీరింగ్ సీట్ వచ్చినా, మరో ప్రయత్నంలో కాస్త మెరుగ్గా మంచి రాంక్ వస్తుందని, వచ్చిన అవకాశాన్ని వాయిదా వేసాను. తర్వాత పక్క రాష్ట్రంలో ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాను. అప్పటికే ఇంట్లో అందరికి దూరంగా నేను జరిగానో, వాళ్ళు జరిపారో తెలియకుండానే దూరం పెరిగిపోయింది. 

            మానసికంగా బాగా ఒత్తిడికి లోనైన మనిషి ఏ అలవాట్లకు బానిస అవుతాడో తెలుసు కదా. నా విషయంలోనూ అదే జరిగింది. స్నేహితులు, బంధువులు నా చుట్టూ వున్నా ఏదో లోటు..మనసులోని బాధను పంచుకోలేని లోటు అలానే మిగిలిపోయింది. 

              కాలేజ్ అన్నాక గొడవలు, అలవాట్లు అన్నీ మామూలే. అలానే నాలుగేళ్లు గడవడం, అనుకోకుండా ప్రేమలో పడడం, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. అసలు జీవితం అప్పుడు మెుదలైంది. 

              అత్తాకోడళ్ళ అహాల మధ్యన నలిగి, అయినవారితో వున్న దూరం ఇంకా పెరిగిపోయి, నేనే వాళ్ళకు దూరంగా వెళ్ళిపోయాను. పెళ్లి, పిల్లలు బాధ్యతలతో ఉద్యోగాలు చేసుకుంటూ కొన్ని రోజులు, తర్వాత వ్యాపారం చేస్తూ, లాభాలు, నష్టాలు మోసుకుంటూ జీవితాన్ని సాగించాను.

              పిల్లలు పెద్దయ్యాక వారి చదువులు, నా సంపాదన కోసం తిప్పలు షరా మామూలే. మనకున్న అలవాట్లు, మానసిక ఒత్తిడి మూలంగా అనారోగ్యాలు చుట్టాలుగా చేరాయి. అయినవారు, పరాయివారు అని లేకుండా అందరు చేసిన నమ్మక ద్రోహాలు, ఆర్థిక ఇబ్బందులు..ఇలా కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లుగా నా జీవితమూ అర్ధాయువుతో అర్ధాంతరంగా ముసిగిపోతుందని కలలో కూడా ఊహించలేదు.

   “అనుకోకుండా ముగిసిన నీ జీవితానికి అశ్రుతర్పణం అనడం తప్ప మరేం చేయలేని నిస్సహాయతరా”.

21, సెప్టెంబర్ 2026, సోమవారం

ఆత్మీయత..!!

             అనుకోకుండా కొన్ని పరిచయాలు మన జీవితంలో సంతోషాన్ని తేవడంతో పాటుగా ఆత్మీయతను పంచుతాయి. తిలక్ గారితో పరిచయం అలాంటిదే. రోజు మాటలుండవు. అప్పుడప్పుడు పలకరింపులు. జయ ఆంటీ కూడా వారి ఇంటి పిల్లగానే చూస్తారు. నిన్న తిలక్ గారి 74వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని, భోజనానికి పిలిచి, వారి ఆత్మీయుల పరిచయాన్ని కూడా అందించారు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఎప్పుడూ వుండాలని మనసారా కోరుకుంటూ…మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తిలక్ గారు..🙏

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

 శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 

మీ ఎదుగుదలే మా లక్ష్యం 

మీ కలల సౌధాలు మా సాకార స్వప్నం..!!

మీ 

28, ఆగస్టు 2026, శుక్రవారం

బాధాకరం..!!

       ఎం టి ఆర్ అన్న ఫేస్ బుక్ ఐడి అందరికి సుపరిచితమే. మాకు మాత్రం మీగడ త్రినాథరావు అన్న పేరుతో ఫేస్ బుక్ లో పరిచయం. ఫేస్ బుక్ కి వచ్చిన కొత్తలో “మన తెలుగు మన సంస్కృతి” సమూహం సృష్టికర్తగా పరిచయమై, నా మీద నమ్మకంతో నన్ను కో అడ్మిన్ గా వుండమని, వారం వారం నిర్వహించే కవితల పోటీలకు ఓ న్యాయనిర్ణేతగా చాలా సంవత్సరాలు పని చేయించారు. 

         తెలుగు భాష మీద, మన హిందూ సంస్కృతి మీద, భారతదేశం మీద ఎనలేని అభిమానం. మంచి నటుడు, గాయకుడు, సినిమా విశ్లేషకుడు..ఇలా చాలా వాటిలో ప్రతిభావంతుడు. చక్కని కవితలు, వ్యాసాలు కూడా రాసేవారు. కుటుంబం కోసం కుటుంబానికి దూరంగా వుంటూ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారు. 

          వారి అన్నయ్య గారి వాల్ మీద ఫోటో చూసి నమ్మలేక, వారితో మాట్లాడి విషయం తెలుసుకున్నాను. అందరితో అభిమానంగా వుండే త్రినాథ్ గారి గురించి ఇలా పోస్ట్ పెట్టడానికి మనసు రాకున్నా..

కొన్ని 

పరిచయాలు

ఆత్మీయ

అనుబంధాలు

దూరాల

కొలమానం అక్కర్లేదు..!!

నా గురించి మీరు పోస్ట్ పెడతారనుకుంటే ఇలా రాయాల్సి రావడం నిజంగా చాలా బాధగా వుంది త్రినాథ్ గారు. మీకు సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను🙏

శుభాకాంక్షలు..!!

 రక్త సంబంధాల ఉసురు పోసుకుంటూ రాక్షసానందం పొందే అన్నదమ్ములకు, ఏ రక్తబంధమూ లేకున్నా అనుబంధాన్ని కలుపుకుని, అంతులేని అభిమానాన్ని పంచే ఆత్మీయ సోదరులకు హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు🙏

26, ఆగస్టు 2026, బుధవారం

MCY Studios

20, ఆగస్టు 2026, గురువారం

తెలుసుకో నీ తెలివెంతో..!!

       ఓరోజు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టారని సంతోషపడితే తర్వాత కోల్పోయిన జీవితం తిరిగిరాదని ఎప్పటికి తెలుస్తుంది?  

         పెట్టినవారు మహా సంతోషంగా వున్నారు. నష్టం ఏమిటన్నది నీ తెలివికే తెలియాలి. తేనెల మాటల మూటలు జీవితాలను బాగు చేయలేవని తెలుసుకో. చివరాఖరికి ఏలిముద్రల చేతిలో ఎర్రిపప్పవైపోయావు కదా!

సరికొత్తగా మీఆలోచనలకు రూపకల్పన..!!

 డిజైన్, కన్స్ట్రక్షన్, ఇంటీరియర్ ఇలా ఏదైనా సరికొత్తగా మీకు కావాలంటే MCY STUDIOS ని కాంటాక్ట్ చేయండి..

https://www.instagram.com/mcy_studios/   https://www.facebook.com/mcystudios/

14, ఆగస్టు 2026, శుక్రవారం

మార్కండేయులు గారికి మనఃపూర్వక ధన్యవాదాలు

 Ms. మంజు యనమదల

రచయిత్రి - కవయిత్రి పరిచయం 

 (Vijayawada – Andhra Pradesh)

అక్షరతపస్విని

https://youtu.be/_p0HnccbaaY?si=vt47SkzQkXKY9NIE

పరిచయం చేయువారు: మంత్రి ప్రగడ మార్కండేయులు,హైదరాబాద్-ఇండియా

+91-9951038802

సాహిత్య సాధన, సామాజిక సేవ, మానవీయ విలువల సమ్మేళనం.

విశిష్ట సాహిత్య పురస్కార గ్రహీతకు అభినందనలు.

తెలుగు సాహిత్య చరిత్రలో కాలానుగుణంగా అనేకమంది రచయితలు, కవులు, కవయిత్రులు తమ రచనల ద్వారా చెరగని ముద్ర వేశారు. అయితే కొందరు మాత్రమే అక్షరాలను జీవితంలో భాగంగా మలచుకొని, వాటిని వ్యక్తిగత అనుభవాలకు, సామాజిక బాధ్యతలకు, మానవీయ విలువలకు వేదికగా మార్చగలుగుతారు. అలాంటి అరుదైన సాహిత్య వ్యక్తిత్వాలలో ప్రముఖంగా నిలిచే పేరు శ్రీమతి మంజు యనమదల.

విజయవాడ నగరంలోని పటమటలంక, సీతారామ రెసిడెన్సీలో నివసిస్తూ, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే అక్షరాలను జీవిత ధ్యేయంగా మలచుకున్న సాహిత్య సాధకురాలు ఆమె. ఒకవైపు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన విజ్ఞానవంతురాలిగా, మరోవైపు భావుక హృదయం కలిగిన కవయిత్రిగా, ఇంకోవైపు సమాజ సేవను ఆచరణలో పెట్టిన మానవతావాదిగా మంజు యనమదల గారి వ్యక్తిత్వం అనేక కోణాలను కలిగి ఉంది.

తల్లిదండ్రులు శ్రీ యనమదల సుబ్బారావు గారు, శ్రీమతి సామ్రాజ్యం గారు అందించిన విలువలు, సంస్కారాలు, బాల్యంలో వినిపించిన కథలు, చదివిన పుస్తకాలు ఆమె వ్యక్తిత్వ నిర్మాణానికి పునాదులయ్యాయి. భర్త శ్రీ యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు, కుమారులు మౌర్యచంద్ర, శౌర్యచంద్ర అందించిన ప్రోత్సాహం ఆమె సాహిత్య ప్రయాణానికి బలమైన అండగా నిలిచింది.

అక్షరాలతో మొదలైన అనుబంధం – జీవితాంతం సాగిస్తున్న సాహిత్య యాత్ర:

బాల్యంలో అమ్మ చెప్పిన కథలు వినడం ఒక చిన్న ఆసక్తిగా మొదలైంది. కానీ ఆ ఆసక్తి క్రమంగా పఠనాభిరుచిగా మారింది. పుస్తకాలు చదవడం ద్వారా విస్తృతమైన భావ ప్రపంచాన్ని పరిచయం చేసుకున్న ఆమె, ఆ తర్వాత తన ఆలోచనలను అక్షరాలలో వ్యక్తపరచడం ప్రారంభించారు.

సాధారణంగా చదివే వారు చాలామంది ఉంటారు. రాసేవారు కొందరే ఉంటారు. కానీ చదివిన అనుభవాన్ని జీవితానుభవంతో కలిపి, సమాజానికి ఉపయోగపడే విధంగా రాసేవారు చాలా అరుదు. Ms. మంజు యనమదల గారు ఆ అరుదైన కోవకు చెందిన రచయిత్రి.

ఆమె మొదటి కవిత “ఆహ్వానం” సాహిత్య పత్రికలో ప్రచురితమైన రోజు నుండి ప్రారంభమైన సాహిత్య ప్రయాణం నేటికీ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. అక్షరాలపై ఉన్న ప్రేమ కాలంతో పాటు మరింత బలపడింది.

“కబుర్లు కాకరకాయలు” – తెలుగు బ్లాగు ప్రపంచంలో ఒక విశిష్ట అధ్యాయం:

2009 సంవత్సరంలో మంజు యనమదల గారు ప్రారంభించిన “కబుర్లు కాకరకాయలు” బ్లాగు తెలుగు అంతర్జాల సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది.

మొదట్లో ఒక అభిరుచిగా మొదలైన ఈ బ్లాగు తరువాత వేలాది మంది పాఠకులను సంపాదించుకుంది. దాదాపు 2500కు పైగా పోస్టులు ప్రచురించడం అనేది సాధారణ విషయం కాదు. అది ఒక రచయిత్రి నిరంతర సాహిత్య సాధనకు నిదర్శనం.

ఈ బ్లాగులో కేవలం కవిత్వమే కాదు; సామాజిక పరిశీలనలు, వ్యక్తిగత అనుభవాలు, పుస్తక సమీక్షలు, జీవిత విలువలు, మానవ సంబంధాలు, స్త్రీ జీవితం, కుటుంబ బంధాలు, సమకాలీన అంశాలు వంటి అనేక విషయాలు చోటు చేసుకున్నాయి.

ఈ బ్లాగు ద్వారా ఆమె వేలాది మంది పాఠకులతో ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆ బంధమే తరువాత ఆమె పుస్తకాలకు, సాహిత్య కార్యక్రమాలకు, పురస్కారాలకు పునాదిగా మారింది.

Ms. మంజు యనమదల గారి సాహిత్య వైవిధ్యం:

Ms. మంజు యనమదల గారి రచనలు ఒకే ప్రక్రియకు పరిమితం కావు. కవిత్వం నుండి వ్యాసరచన వరకు, ఏక్ తారల నుండి రెక్కల వరకు, ద్విపదల నుండి స్వగతాల వరకు విభిన్న ప్రక్రియల్లో ఆమె కలం ప్రయాణించింది.

ఆమె రచనల్లో కనిపించే ముఖ్య లక్షణాలు:

• సరళమైన భాష 

• లోతైన భావవ్యక్తీకరణ 

• మానవీయ విలువల పట్ల నిబద్ధత 

• స్త్రీ మనస్తత్వంపై స్పష్టమైన అవగాహన 

• సామాజిక బాధ్యత 

• ఆత్మపరిశీలన 

• పాఠకుడితో నేరుగా సంభాషించే శైలి 

ఆమె కవిత్వం అలంకారాల ఆర్భాటంతో కాకుండా, హృదయానికి హత్తుకునే సహజత్వంతో ఆకట్టుకుంటుంది.

ముద్రిత గ్రంథాలు – ఒక సాహిత్య సంపద:

Ms. మంజు యనమదల గారి పదిహేను ముద్రిత గ్రంథాలు ఆమె సాహిత్య ప్రయాణంలోని మైలురాళ్లు.

1. అక్షరాల సాక్షిగా.. నేను ఓడిపోలేదు

జీవిత పోరాటాలలో అక్షరాలే ఆయుధమని చాటిన కవితా సంపుటి.

2. సడిచేయని (అ)ముద్రితాక్షరాలు

మనసు ముచ్చట్ల రూపంలో వ్యక్తిగత అనుభవాలకు అక్షరరూపం.

3. చెదరని శి(థి)లాక్షరాలు

కాలంతో చెదరిపోని జ్ఞాపకాల సాహిత్య రూపం.

4. గుప్పెడు గుండె సవ్వడులు

జంట కవిత్వంలో భావాల సమ్మేళనం.

5. అంతర్లోచనాలు

మనిషి అంతర్ముఖ ప్రపంచానికి అద్దం పట్టిన రచన.

6. ఏ’కాంతా’క్షరాలు

ఏక్ తారల ప్రక్రియలో విశిష్టమైన గ్రంథం.

7. అక్షర స(వి)న్యాసం

భావాల అందమైన నిర్మాణం.

8. కాలం వెంబడి కలం.. అక్షరాలతో అనుబంధం

స్వీయ సాహిత్య యాత్రకు దర్పణం.

9. అక్షర విహంగాలు

రెక్కల రూపంలో సాహిత్య సృజన.

10. రాతిరి చుక్కలు.. అక్షరాంగనల ఆంతర్యాలు

మహిళా రచయిత్రుల భావ ప్రపంచానికి ప్రతిబింబం:

11. మూల్యాంకనం

సమాజాన్ని ప్రశ్నించే కవిత్వం.

12. అవ్యక్తం

వ్యాసరచనలో ఆలోచనల విశ్లేషణ.

13. అక్షరాలతో అనుబంధాలు

కుటుంబ చరిత్రను సాహిత్యంగా నిలబెట్టిన అరుదైన కృషి.

14. జీవన మంజూష

జీవిత విలువల సంకలనం.

15. గాలివాటం

సున్నితమైన భావాలకు రెక్కలు తొడిగిన రచన.

పుస్తక సమీక్షకురాలిగా మంజు యనమదల:

కేవలం రచయిత్రిగానే కాకుండా, పుస్తక సమీక్షకురాలిగానూ ఆమె విశేష సేవ చేశారు.

గోదావరి వార్త పత్రికలో అనేక పుస్తక సమీక్షలు రాయడం ద్వారా కొత్త రచయితలను పాఠకులకు పరిచయం చేశారు.

సాహిత్యాన్ని కేవలం సృష్టించడం మాత్రమే కాదు, మంచి రచనలను గుర్తించి ప్రోత్సహించడం కూడా ఒక గొప్ప సేవ. ఆ సేవను Ms. మంజు యనమదల గారు నిబద్ధతతో నిర్వర్తించారు.

పత్రికలలో ఆమె సాహిత్య సేవ:

ఆమె రచనలు అనేక ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి.

• మల్లెతీగ 

• మనం 

• ఆంధ్రప్రభ 

• గో తెలుగు డాట్ కామ్ 

• ఆంధ్రా ప్రవాసి 

• రవళి 

• తెలుగు సంస్కృతి విశాఖ 

• నవ మల్లెతీగ 

• ఇతర అంతర్జాల పత్రికలు 

ఈ వేదికల ద్వారా ఆమె సాహిత్యం దేశ విదేశాలలోని తెలుగు పాఠకులకు చేరింది.

పురస్కారాలు – అక్షరాలకు దక్కిన గౌరవం:

Ms. మంజు యనమదల గారు అందుకున్న ప్రతి పురస్కారం వెనుక ఒక సాహిత్య సేవ ఉంది.

కావ్యశ్రీ పురస్కారం – కవితా ప్రతిభకు.

ఉత్తమ కవయిత్రి పురస్కారం – సాహిత్య రంగంలో విశిష్ట కృషికి.

గిడుగు పురస్కారం – తెలుగు భాషా సేవకు.

విశిష్ట పురస్కారం – సాహిత్య వైవిధ్యానికి.

ఐడియల్ ఉమన్ అవార్డు – సమాజసేవ, సాహిత్య సేవలకు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం – రాష్ట్రస్థాయి సాహిత్య గుర్తింపుకు.

తెలుగు తేజం జాతీయ ప్రతిభా పురస్కారం – తెలుగు సాహిత్యాభివృద్ధికి.

నారీరత్న (Woman of Excellence Award 2024) – మహిళా సాధికారతకు ప్రతీకగా.

ఈ పురస్కారాలు వ్యక్తిగత విజయాలకు గుర్తులు మాత్రమే కావు. తెలుగు సాహిత్యం ఆమె కృషిని అంగీకరించి సమర్పించిన గౌరవ పుష్పాలు.

సాహిత్యంతో పాటు సామాజిక సేవ:

2008 జనవరి 23న స్థాపించిన “ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్” ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తున్నారు.

సమాజానికి తిరిగి ఇవ్వాలనే తపన ఉన్నవారే నిజమైన సాహితీవేత్తలు. ఆ భావనను కార్యరూపంలో చూపించిన వ్యక్తి మంజు యనమదల గారు.

ఉపసంహారం:

Ms. మంజు యనమదల గారు ఒక రచయిత్రి మాత్రమే కాదు; ఒక సాహిత్య ఉద్యమం. ఆమె అక్షరాలు కేవలం కాగితాల మీద ఉండవు; మనసుల్లో జీవిస్తాయి. ఆమె కవిత్వం కేవలం చదివించదు; ఆలోచింపజేస్తుంది. ఆమె వ్యాసాలు కేవలం సమాచారాన్ని ఇవ్వవు; జీవన సత్యాలను చూపిస్తాయి. ఆమె సేవ కేవలం వ్యక్తిగత పరిమితుల్లో ఉండదు; సమాజానికి వెలుగునిస్తుంది.

తెలుగు సాహిత్య జగత్తులో Ms. మంజు యనమదల అనే పేరు అక్షర సేవకు, మానవీయ విలువలకు, సాహిత్య నిబద్ధతకు, సామాజిక బాధ్యతకు ప్రతీకగా చిరస్థాయిగా నిలిచిపోతుంది.

“అక్షరాలే ఆమె శ్వాస… సాహిత్యమే ఆమె సాధన… మానవతే ఆమె సందేశం.”

అటువంటి అక్షరతపస్విని, సాహిత్య సేవారతిని, మానవీయ విలువల ప్రతినిధిని హృదయపూర్వకంగా అభినందిస్తూ శిరసావహ నమస్సులు సమర్పిస్తున్నాము. 

తెలుగు సాహిత్య గగనంలో ఆమె పేరు చిరస్థాయిగా వెలుగొందాలని, ఆమె కలం మరెన్నో శతాధిక గ్రంథాలను తెలుగు తల్లికి కానుకగా అందించాలని, ఆమె అక్షర యజ్ఞం తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలని మనసారా ఆకాంక్షిస్తూ...

మీ సాహిత్యయాత్ర మరింత విస్తరించి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలవాలని, మీ కవితా సాధన నిత్యం వెలుగొందుతూ భారతీయ సాహిత్య సంస్కృతిని విశ్వవ్యాప్తంగా ప్రసరింపజేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. మీ సాహిత్య పట్టు అమృతస్రవంతిలా నిరంతరం పరిమళించి, జగత్తుకు శాంతి–సౌభాగ్య సుధలను చల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ…  ఇట్లు :

అక్షరాభినందనాలతో.......సాహిత్య నమస్సులతో…….

శ్రీమతి మంజు యనమదల గారికి శతకోటి వందనాలు

అక్షరతపస్విని Ms. మంజు యనమదల గారి గురించి ఆర్టికల్ వ్రాసినవారు

Dr. Mantri Pragada Markandeyulu

Author, Story, Script, Dialogue & Songwriter

+91-9951038802

Email: mrkndyl@gmail.com

Email: mantri73@yahoo.com

Hyderabad (Telangana State) 

India.

12, ఆగస్టు 2026, బుధవారం

నా బ్లాగుకి ఏమైంది?

https://naalonenu-manju.blogspot.com/?m=1

ఇప్పటికి పబ్లిష్ అయిన 2545 పోస్టులను ఆదరించిన అక్షరాభిమానులకు వందనం. అప్పుడప్పుడు కాస్త ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. కాని నిన్న ఈరోజు వచ్చిన వ్యూస్ చూసి చాలా సంతోషం అనిపించింది. ఆ ఆనందాన్ని ఇలా మీ అందరితో పంచుకుంటున్నా..!!

10, ఆగస్టు 2026, సోమవారం

తేడా..!!

ఒకప్పుడు 

పిల్లల్ని

హాస్టల్ లో 

పెట్టేవారు

ఇప్పుడు 

తల్లిదండ్రులు 

ఆశ్రమాల్లో

ఆశ్రయం పొందుతున్నారు..

మనమిచ్చిందే 

మనకు తిరిగిరావడమంటే ఇదే మరి..!!

21, జులై 2026, మంగళవారం

ధన్యవాదాలు

 నా గురించి మంత్రి ప్రగడ మార్కండేయులు గారు రాసిన పాటకు బిక్కి కృష్ణ గారి ఆత్మీయ స్పందనకు మనఃపూర్వక ధన్యవాదాలు..

మీ పాటలు చాలా బాగున్నాయి సార్.. ముఖ్యంగా యనమదలమంజుగారిపై రాసిన పాట.. పదాల పోహళింపు.. మీ అద్భుత గేయరచనా సంవిధానానికి... లోతైన మంజుగారి వ్యక్తిత్వ అభివ్యక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. వ్యక్తిగతంగా ఆమె నాకు బాగా తెలుసు. మంచి కవయిత్రి. వ్యాసకర్త. స్నేహశీలి. కల్మషం ఎరుగని విదుషీమణి. కపటం తెలియని సృజనశీలి.నా కవితా సంపుటిపై ఆమె గతంలో ఒక గొప్ప విశ్లేషణా వ్యాసం కూడా రాసారు. ఆమె మనోధైర్యం, సున్నితత్వం, ముక్కుసూటిదనం, ప్రేమతత్వం, భాషా, కవిత్వ, విశ్లేషణా.. పటుత్వాలను.. అద్భుతమైన పదబంధాలతో.. మంచి సంగీత సాహిత్య కల్పనా చతుర వచనాలతో .. గేయాన్ని శిల్పీకరించారు. ఆమె జీవితం ధన్యం. ఇంతకన్నా గొప్పగా మంజుగారి గొప్పతనం, ఔన్నత్యం, రచనాదృక్పథం, భావుకత్వం, నిర్మలమైన వ్యక్తిత్వంపై... ఏ గొప్ప గేయ రచయితా... ఇంతలా కదిలించేలా రాయలేరు. ప్రోత్సాహం, ఉత్సాహం, సంతోషం అందించలేరు. మాకు చాలా ఆత్మీయులైన మంజుగారిపై గొప్ప పాట రాసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రతి అక్షరం,ప్రతిపదం, గేయపాదం.. మంజుగారి వ్యక్తిత్వపరిమళ విలసితం.ఆమె భావుకతా తటిల్లతల మెరుపుల విభ్రాజితం.. మధుర భావాలరసాప్లావితం. రసౌచిత్యం.. అభినందనలు.

16, జులై 2026, గురువారం

ఓ చిన్నమాట..!!

        నాకు గుర్తున్నంత వరకు ఈటివి “పాడుతా తీయగా” గత ఐదారు సిరీస్ ల నుండి సెమీ ఫైనల్ కి రాకుండా ఎలిమినేట్ అయ్యేవారికి ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో నలుగురు ఎలిమినేట్ అవుతారు అంటూ మరో ఛాన్స్ ఇస్తూ..ఎలిమినేట్ అయ్యేవారికే సిరీస్ ఛాంపియన్ రావడం ఎవరైనా గమనించారా..!!

2, జులై 2026, గురువారం

ఓ మాట..!!

అది కాదురా అబ్బాయ్,

             మనకి తెలిసిన వాళ్ళని మనముదాహరించినట్లే వాళ్ళకి తెలిసిన వాళ్ళని వాళ్ళు ఉదాహారిస్తారు. దీనిలో ఆక్షేపణలెందుకు?

             నీకు నచ్చిన వాళ్ళు బాగా గొప్పోరు కదా. మరలాగే వారికి నచ్చిన వారిని వారు గొప్పగా చెప్తారు. కులమతాల హేళనలు మన చెవులకు ఇంపుగా, చూడటానికి అందంగా అగుపడతాయి కదా! అందుకే మనకి వాటిలో అన్ని కళలు గొప్పగానే కనబడతాయి. 

              అందుకే మాటలకు, రాతలకు ముందు కాస్త ఆలోచన చెయ్యాలి. మంచి మాట తరాల తరాల నుండి కొత్త తరాలకు చేరవేయడం తప్పేం కాదు. మనిషున్నా లేకున్నా మాట వుండిపోతుంది అని మన పెద్దలు ఎప్పుడోనే చెప్పారు కదా!  గుర్తు లేదా!

             అయినా మానవీయం, అమానవీయం మనకెందుకు? మనం చేసిన పనులు మనం చెప్పుకుంటే బాగోదురా అబ్బాయ్!

24, జూన్ 2026, బుధవారం

ఆత్మీయ పలకరింపు..!!

    బోలెడు కబుర్లు చెప్పుకున్న ఆనందం.

కొన్ని సంతోషాలను ఇలా పంచేసుకోవాలి…దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత కలిసాము. హృదయపూర్వక ధన్యవాదాలు రామకృష్ణ దంపతులకు..

15, జూన్ 2026, సోమవారం

విద్యార్థులకు చేయూత..14/06/2026

 *ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేయూత..*

******🌟🌟******

ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు చేయూత అందించారు.

ఆదివారం కోడూరు శివారు      నరసింహపురం గ్రామంలో ట్రస్ట్ సభ్యులు యనమదల సుబ్బారావు ఏర్పాటు చేసిన సమావేశానికి  డాక్టర్ మంతెన నరసరాజు, ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ డాక్టర్ కృష్ణ , కోడూరు ఎస్సై చాణక్య ముఖ్య అతిథులుగా విచ్చేసి 11 మంది విద్యార్థులకు 5వేల విలువగల చెక్కులు అందజేశారు. మరో మూడు చెక్కులు కూడా అందజేసారు. ఈ 

గత 19 సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థులకు "రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్" అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్, కార్యదర్శి మంజు సహకారంతో ఆర్థిక చేయుత అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు" 372 మంది విద్యార్థులకు" ఈ సహకారాన్ని అందించినట్లు తెలిపారు.

ఎస్సై చాణక్య మాట్లాడుతూ. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఇలా ప్రతి సంవత్సరం ట్రస్ట్ తరుపున తోడ్పాటు అందించడం అభినందనీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

14, జూన్ 2026, ఆదివారం

అందమైన రెక్క..!!

 ఆలంబన

దొరికితే చాలు

అందంగా

అల్లుకుపోతాయి

రేపటి 

చింత లేదు..!!

8, జూన్ 2026, సోమవారం

అరుదైన బహుమతి..!!

   ఇది నా అక్షరాలు చేసుకున్న అదృష్టం కావచ్చు. ఇంతమంది పెద్దల ఆశీస్సులు, అభిమానం నా అక్షరాలకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం. ఈ రోజుల్లో అడిగితేనే రాయడానికి చాలా కష్టం. ఆయనే అడిగి మరీ ఇంత అద్భుతంగా రాసారంటే…మరి మాటలేం వుంటాయి చెప్పండి..

మంత్రి ప్రగడ మార్కండ్యులుగారు మీ ఆత్మీయతాక్షరాలకు హృదయపూర్వక వందనం.  

Ms. మంజు యనమదల

రచయిత్రి - కవయిత్రి పరిచయం 

 (Vijayawada – Andhra Pradesh)

అక్షరతపస్విని

పరిచయం చేయువారు: మంత్రి ప్రగడ మార్కండేయులు,హైదరాబాద్-ఇండియా

+91-9951038802

సాహిత్య సాధన, సామాజిక సేవ, మానవీయ విలువల సమ్మేళనం.

విశిష్ట సాహిత్య పురస్కార గ్రహీతకు అభినందనలు.

తెలుగు సాహిత్య చరిత్రలో కాలానుగుణంగా అనేకమంది రచయితలు, కవులు, కవయిత్రులు తమ రచనల ద్వారా చెరగని ముద్ర వేశారు. అయితే కొందరు మాత్రమే అక్షరాలను జీవితంలో భాగంగా మలచుకొని, వాటిని వ్యక్తిగత అనుభవాలకు, సామాజిక బాధ్యతలకు, మానవీయ విలువలకు వేదికగా మార్చగలుగుతారు. అలాంటి అరుదైన సాహిత్య వ్యక్తిత్వాలలో ప్రముఖంగా నిలిచే పేరు శ్రీమతి మంజు యనమదల.

విజయవాడ నగరంలోని పటమటలంక, సీతారామ రెసిడెన్సీలో నివసిస్తూ, కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే అక్షరాలను జీవిత ధ్యేయంగా మలచుకున్న సాహిత్య సాధకురాలు ఆమె. ఒకవైపు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన విజ్ఞానవంతురాలిగా, మరోవైపు భావుక హృదయం కలిగిన కవయిత్రిగా, ఇంకోవైపు సమాజ సేవను ఆచరణలో పెట్టిన మానవతావాదిగా మంజు యనమదల గారి వ్యక్తిత్వం అనేక కోణాలను కలిగి ఉంది.

తల్లిదండ్రులు శ్రీ యనమదల సుబ్బారావు గారు, శ్రీమతి సామ్రాజ్యం గారు అందించిన విలువలు, సంస్కారాలు, బాల్యంలో వినిపించిన కథలు, చదివిన పుస్తకాలు ఆమె వ్యక్తిత్వ నిర్మాణానికి పునాదులయ్యాయి. భర్త శ్రీ యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు, కుమారులు మౌర్యచంద్ర, శౌర్యచంద్ర అందించిన ప్రోత్సాహం ఆమె సాహిత్య ప్రయాణానికి బలమైన అండగా నిలిచింది.

అక్షరాలతో మొదలైన అనుబంధం – జీవితాంతం సాగిస్తున్న సాహిత్య యాత్ర:

బాల్యంలో అమ్మ చెప్పిన కథలు వినడం ఒక చిన్న ఆసక్తిగా మొదలైంది. కానీ ఆ ఆసక్తి క్రమంగా పఠనాభిరుచిగా మారింది. పుస్తకాలు చదవడం ద్వారా విస్తృతమైన భావ ప్రపంచాన్ని పరిచయం చేసుకున్న ఆమె, ఆ తర్వాత తన ఆలోచనలను అక్షరాలలో వ్యక్తపరచడం ప్రారంభించారు.

సాధారణంగా చదివే వారు చాలామంది ఉంటారు. రాసేవారు కొందరే ఉంటారు. కానీ చదివిన అనుభవాన్ని జీవితానుభవంతో కలిపి, సమాజానికి ఉపయోగపడే విధంగా రాసేవారు చాలా అరుదు. Ms. మంజు యనమదల గారు ఆ అరుదైన కోవకు చెందిన రచయిత్రి.

ఆమె మొదటి కవిత “ఆహ్వానం” సాహిత్య పత్రికలో ప్రచురితమైన రోజు నుండి ప్రారంభమైన సాహిత్య ప్రయాణం నేటికీ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. అక్షరాలపై ఉన్న ప్రేమ కాలంతో పాటు మరింత బలపడింది.

“కబుర్లు కాకరకాయలు” – తెలుగు బ్లాగు ప్రపంచంలో ఒక విశిష్ట అధ్యాయం:

2009 సంవత్సరంలో మంజు యనమదల గారు ప్రారంభించిన “కబుర్లు కాకరకాయలు” బ్లాగు తెలుగు అంతర్జాల సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది.

మొదట్లో ఒక అభిరుచిగా మొదలైన ఈ బ్లాగు తరువాత వేలాది మంది పాఠకులను సంపాదించుకుంది. దాదాపు 2500కు పైగా పోస్టులు ప్రచురించడం అనేది సాధారణ విషయం కాదు. అది ఒక రచయిత్రి నిరంతర సాహిత్య సాధనకు నిదర్శనం.

ఈ బ్లాగులో కేవలం కవిత్వమే కాదు; సామాజిక పరిశీలనలు, వ్యక్తిగత అనుభవాలు, పుస్తక సమీక్షలు, జీవిత విలువలు, మానవ సంబంధాలు, స్త్రీ జీవితం, కుటుంబ బంధాలు, సమకాలీన అంశాలు వంటి అనేక విషయాలు చోటు చేసుకున్నాయి.

ఈ బ్లాగు ద్వారా ఆమె వేలాది మంది పాఠకులతో ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆ బంధమే తరువాత ఆమె పుస్తకాలకు, సాహిత్య కార్యక్రమాలకు, పురస్కారాలకు పునాదిగా మారింది.

Ms. మంజు యనమదల గారి సాహిత్య వైవిధ్యం:

Ms. మంజు యనమదల గారి రచనలు ఒకే ప్రక్రియకు పరిమితం కావు. కవిత్వం నుండి వ్యాసరచన వరకు, ఏక్ తారల నుండి రెక్కల వరకు, ద్విపదల నుండి స్వగతాల వరకు విభిన్న ప్రక్రియల్లో ఆమె కలం ప్రయాణించింది.

ఆమె రచనల్లో కనిపించే ముఖ్య లక్షణాలు:

• సరళమైన భాష 

• లోతైన భావవ్యక్తీకరణ 

• మానవీయ విలువల పట్ల నిబద్ధత 

• స్త్రీ మనస్తత్వంపై స్పష్టమైన అవగాహన 

• సామాజిక బాధ్యత 

• ఆత్మపరిశీలన 

• పాఠకుడితో నేరుగా సంభాషించే శైలి 

• 

ఆమె కవిత్వం అలంకారాల ఆర్భాటంతో కాకుండా, హృదయానికి హత్తుకునే సహజత్వంతో ఆకట్టుకుంటుంది.

ముద్రిత గ్రంథాలు – ఒక సాహిత్య సంపద:

Ms. మంజు యనమదల గారి పదిహేను ముద్రిత గ్రంథాలు ఆమె సాహిత్య ప్రయాణంలోని మైలురాళ్లు.

1. అక్షరాల సాక్షిగా.. నేను ఓడిపోలేదు

జీవిత పోరాటాలలో అక్షరాలే ఆయుధమని చాటిన కవితా సంపుటి.

2. సడిచేయని (అ)ముద్రితాక్షరాలు

మనసు ముచ్చట్ల రూపంలో వ్యక్తిగత అనుభవాలకు అక్షరరూపం.

3. చెదరని శి(థి)లాక్షరాలు

కాలంతో చెదరిపోని జ్ఞాపకాల సాహిత్య రూపం.

4. గుప్పెడు గుండె సవ్వడులు

జంట కవిత్వంలో భావాల సమ్మేళనం.

5. అంతర్లోచనాలు

మనిషి అంతర్ముఖ ప్రపంచానికి అద్దం పట్టిన రచన.

6. ఏ’కాంతా’క్షరాలు

ఏక్ తారల ప్రక్రియలో విశిష్టమైన గ్రంథం.

7. అక్షర స(వి)న్యాసం

భావాల అందమైన నిర్మాణం.

8. కాలం వెంబడి కలం.. అక్షరాలతో అనుబంధం

స్వీయ సాహిత్య యాత్రకు దర్పణం.

9. అక్షర విహంగాలు

రెక్కల రూపంలో సాహిత్య సృజన.

10. రాతిరి చుక్కలు.. అక్షరాంగనల ఆంతర్యాలు

మహిళా రచయిత్రుల భావ ప్రపంచానికి ప్రతిబింబం:

11. మూల్యాంకనం

సమాజాన్ని ప్రశ్నించే కవిత్వం.

12. అవ్యక్తం

వ్యాసరచనలో ఆలోచనల విశ్లేషణ.

13. అక్షరాలతో అనుబంధాలు

కుటుంబ చరిత్రను సాహిత్యంగా నిలబెట్టిన అరుదైన కృషి.

14. జీవన మంజూష

జీవిత విలువల సంకలనం.

15. గాలివాటం

సున్నితమైన భావాలకు రెక్కలు తొడిగిన రచన.

పుస్తక సమీక్షకురాలిగా మంజు యనమదల:

కేవలం రచయిత్రిగానే కాకుండా, పుస్తక సమీక్షకురాలిగానూ ఆమె విశేష సేవ చేశారు.

గోదావరి వార్త పత్రికలో అనేక పుస్తక సమీక్షలు రాయడం ద్వారా కొత్త రచయితలను పాఠకులకు పరిచయం చేశారు.

సాహిత్యాన్ని కేవలం సృష్టించడం మాత్రమే కాదు, మంచి రచనలను గుర్తించి ప్రోత్సహించడం కూడా ఒక గొప్ప సేవ. ఆ సేవను Ms. మంజు యనమదల గారు నిబద్ధతతో నిర్వర్తించారు.

పత్రికలలో ఆమె సాహిత్య సేవ:

ఆమె రచనలు అనేక ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి.

• మల్లెతీగ 

• మనం 

• ఆంధ్రప్రభ 

• గో తెలుగు డాట్ కామ్ 

• ఆంధ్రా ప్రవాసి 

• రవళి 

• తెలుగు సంస్కృతి విశాఖ 

• నవ మల్లెతీగ 

• ఇతర అంతర్జాల పత్రికలు 

ఈ వేదికల ద్వారా ఆమె సాహిత్యం దేశ విదేశాలలోని తెలుగు పాఠకులకు చేరింది.

పురస్కారాలు – అక్షరాలకు దక్కిన గౌరవం:

Ms. మంజు యనమదల గారు అందుకున్న ప్రతి పురస్కారం వెనుక ఒక సాహిత్య సేవ ఉంది.

కావ్యశ్రీ పురస్కారం – కవితా ప్రతిభకు.

ఉత్తమ కవయిత్రి పురస్కారం – సాహిత్య రంగంలో విశిష్ట కృషికి.

గిడుగు పురస్కారం – తెలుగు భాషా సేవకు.

విశిష్ట పురస్కారం – సాహిత్య వైవిధ్యానికి.

ఐడియల్ ఉమన్ అవార్డు – సమాజసేవ, సాహిత్య సేవలకు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం – రాష్ట్రస్థాయి సాహిత్య గుర్తింపుకు.

తెలుగు తేజం జాతీయ ప్రతిభా పురస్కారం – తెలుగు సాహిత్యాభివృద్ధికి.

నారీరత్న (Woman of Excellence Award 2024) – మహిళా సాధికారతకు ప్రతీకగా.

ఈ పురస్కారాలు వ్యక్తిగత విజయాలకు గుర్తులు మాత్రమే కావు. తెలుగు సాహిత్యం ఆమె కృషిని అంగీకరించి సమర్పించిన గౌరవ పుష్పాలు.

సాహిత్యంతో పాటు సామాజిక సేవ:

2008 జనవరి 23న స్థాపించిన “ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్” ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తున్నారు.

సమాజానికి తిరిగి ఇవ్వాలనే తపన ఉన్నవారే నిజమైన సాహితీవేత్తలు. ఆ భావనను కార్యరూపంలో చూపించిన వ్యక్తి మంజు యనమదల గారు.

ఉపసంహారం:

Ms. మంజు యనమదల గారు ఒక రచయిత్రి మాత్రమే కాదు; ఒక సాహిత్య ఉద్యమం. ఆమె అక్షరాలు కేవలం కాగితాల మీద ఉండవు; మనసుల్లో జీవిస్తాయి. ఆమె కవిత్వం కేవలం చదివించదు; ఆలోచింపజేస్తుంది. ఆమె వ్యాసాలు కేవలం సమాచారాన్ని ఇవ్వవు; జీవన సత్యాలను చూపిస్తాయి. ఆమె సేవ కేవలం వ్యక్తిగత పరిమితుల్లో ఉండదు; సమాజానికి వెలుగునిస్తుంది.

తెలుగు సాహిత్య జగత్తులో Ms. మంజు యనమదల అనే పేరు అక్షర సేవకు, మానవీయ విలువలకు, సాహిత్య నిబద్ధతకు, సామాజిక బాధ్యతకు ప్రతీకగా చిరస్థాయిగా నిలిచిపోతుంది.

“అక్షరాలే ఆమె శ్వాస… సాహిత్యమే ఆమె సాధన… మానవతే ఆమె సందేశం.”

అటువంటి అక్షరతపస్విని, సాహిత్య సేవారతిని, మానవీయ విలువల ప్రతినిధిని హృదయపూర్వకంగా అభినందిస్తూ శిరసావహ నమస్సులు సమర్పిస్తున్నాము. 

తెలుగు సాహిత్య గగనంలో ఆమె పేరు చిరస్థాయిగా వెలుగొందాలని, ఆమె కలం మరెన్నో శతాధిక గ్రంథాలను తెలుగు తల్లికి కానుకగా అందించాలని, ఆమె అక్షర యజ్ఞం తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలని మనసారా ఆకాంక్షిస్తూ...

మీ సాహిత్యయాత్ర మరింత విస్తరించి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలవాలని, మీ కవితా సాధన నిత్యం వెలుగొందుతూ భారతీయ సాహిత్య సంస్కృతిని విశ్వవ్యాప్తంగా ప్రసరింపజేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. మీ సాహిత్య పట్టు అమృతస్రవంతిలా నిరంతరం పరిమళించి, జగత్తుకు శాంతి–సౌభాగ్య సుధలను చల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ…  ఇట్లు :

అక్షరాభినందనాలతో.......సాహిత్య నమస్సులతో…….

శ్రీమతి మంజు యనమదల గారికి శతకోటి వందనాలు

అక్షరతపస్విని Ms. మంజు యనమదల గారి గురించి ఆర్టికల్ వ్రాసినవారు

====

Dr. Mantri Pragada Markandeyulu

Author, Story, Script, Dialogue & Songwriter

+91-9951038802

Email: mrkndyl@gmail.com

Email: mantri73@yahoo.com

Hyderabad (Telangana State) 

India.

7, జూన్ 2026, ఆదివారం

తమ్ముడు మాస్టారుూ..!!

కొన్ని 

బంధాలు 

గతజన్మ 

అనుబంధాలు

రాకపోక

తప్పని ప్రయాణాలు..!!

      పరిచయస్థులు ప్రతివొక్కరూ “తమ ఆత్మీయబంధం” అనుకునే మా “గుడిసేవ విష్ణుప్రసాద్” మాస్టారు తమ్ముడు మా మాటలకు అందుబాటులో లేరని అనుకోవడానికి మనసు అంగీకరించడం లేదు. అందులోను ముందురోజే కలిసి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అన్ని విషయాలు మాట్లాడుకుంటూ..”అమ్మ తెలుగు ప్రపంచ మహాసభలకు వెళ్దామా” అని హాస్యమాడి  ఇలా చేయడం నాకేం నచ్చలేదు మాస్టారు తమ్ముడూ..🙏

       పద్మజ సబ్బినేని గారి పుస్తకం అచ్చువేసే క్రమంలో మాస్టారితో తొలి పరిచయం. పుస్తకం ఆవిష్కరణ రోజు చూసి అచ్చం మా అక్కలానే వున్నావన్నారు. అమ్మ కూడా అదే మాట అచ్చుగుద్దినట్లు నడక, మాట తీరు ఇలా అన్నీ మా ఆడపడుచు మళ్లీ మాకు కనబడింది అంటూ ..అప్పటి ఆ పరిచయం ఆత్మీయంగా మారి ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడంతో బలపడింది. ఎప్పుడు మాట్లాడినా “అమ్మా నమస్కారం” అన్న ముందు మాట తర్వాతే ఏదైనా..ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు జ్ఞాపకాలు…మాస్టారు మరీ ఇంత తొందరైతే ఎలా మీకు..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 
కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner