23, జులై 2021, శుక్రవారం
ద్విపదలు..!!
24, జనవరి 2021, ఆదివారం
ద్విపదలు..!!
3, ఏప్రిల్ 2020, శుక్రవారం
ద్విపదలు..!!
ద్విపదలు...!!
29, నవంబర్ 2019, శుక్రవారం
ద్విపదలు...!!
1. అలరించడం ఆత్మీయత లక్షణం
అక్షరాలకు అలవాటైన అల్లికై...!!
2. మాలను ఏర్చికూర్చడంలోనే పనితనమంతా
అక్షర భావాలు అల్లుకుపోతానంటుంటే..!!
3. అక్షరాలనే అటుా ఇటూ మార్చుతున్నా
అర్థవంతమైన పదబంధాల అమరిక కోసం..!!
4. ఆదరించిన అక్షరం
ఆదమరచిన ఆకాంక్షలకు అన్యాపదేశంగా దిశానిర్ధేశంజేస్తూ..!!
5. గురుతుల్లో మిగిలిన జ్ఞాపకం
గుండెను తట్టి లేపిందిలా...!!
6. గతమైనా..ఘనమైన జ్ఞాపకమది
గుప్పెడు గుండెకు ఆధారమై...!!
7. సంతోష సాగరానికి ఆహ్వానించాను
కన్నీటి జలపాతాలకు సాంత్వననీయడానికి..!!
8. వ్యసనమని వదిలేద్దామనుకున్నా
విడువ లేని వ్యాసంగమైనావని తెలియక...!!
9. పరిచితులమే ఎప్పుడూ
మనసునొదలని అక్షర భావాల పలకరింతలతో...!!
10. ముసుగులక్కర్లేని బంధమిది
అపరిమితంగా అల్లుకుంటూ...!!
11. నా అక్షరాలు బ్రహ్మాస్త్రాలై కట్టిపడేస్తాయి
వాటికి అణుకువ, అహం తెలుసు..!!
12. నిశ్శబ్దమెప్పుడూ చప్పుడు చేస్తూనే ఉంది
గురుతులుగా మిగిలిన నీ జ్ఞాపకాలతో...!!
13. శిథిలాలలోనూ చిరపరిచితమే
చెదిరిన మనసులో స్థిరమైన జ్ఞాపకమై...!!
14. అక్షరాలను ఆవహించింది
కనుమరుగైన బంధమైనా చేతిస్పర్శగా చేరువౌతూ..!!
15. పక్కనే ఉన్నా చూడవెప్పుడూ
నీ చూపులెప్పుడూ సుదూరానే..!!
16. నన్ను అనుసరిస్తావనుకున్నా
అనుకరిస్తావని తెలియక...!!
17. వియెాగము విరహమూ చుట్టాలనుకుంటా
పర్యవసానం పరమార్థం తెలిసినా...!!
18. గురుతుకు నువ్వో నెలవే
గుప్పెడు గుండెకు ఆలంబనగా..!!
19. పదాల కూర్పు కుదరడంలేదు
అక్షరాలనెలా రాయాలో తెలియనందుకేమెా...!!
20. అమ్మ పంచిన ఆత్మీయతే అది
అందుకే ఆ పిలుపుకంత కమ్మదనం..!!
21. యుగాల నిరీక్షణ
క్షణాల్లో మాయమైపోతూ...!!
22. కొన్ని మౌనాలంతే
మాటలు అక్కర్లేకుండా మనసుని పరిచేస్తూ..!!
23. సమస్యలెప్పుడూ చుట్టాలే
చెప్పాచేయకుండా వచ్చేస్తూ..!!
24. కొన్ని చీకట్లంతే
అదాటున ఆశల నక్షత్రాలను లెక్కలేయమంటూ..!!
25. అనంతం తానైతేనేమి
నాకు అందనప్పుడు...!!
26. అన్ని అక్షరాలు అంతే
అలసటెరుగని అమ్మలా లాలిస్తూ...!!
27. విశేషమేమి లేదు
విషయమే తానైనప్పుడు...!!
28. అక్షరాల్లో చూపించేద్దామన్న ప్రయత్నమే
అకారంలేని మది సవ్వడిని...!!
29. ప్రాణం పోస్తున్న అక్షరాలు
వెతలను వెన్నెలకు జారవేస్తూ...!!
30. వెతకనక్కర్లేదంటున్నా నీకోసం
అక్షరాలను వెంబడిస్తున్నది నువ్వేనని తెలిసి..!!
7, అక్టోబర్ 2019, సోమవారం
ద్విపదలు...!!
1. కలమే రాయగలిగే కథనాలెన్నో
కాలంతో సాగే గుండెల్లో దాగిన కల్లోల సంద్రాలను...!!
2. ఎడబాటే తెలుపుతుంది
ఎదలో దాగిన ఇష్టాన్ని ఎరుగమంటూ...!!
3. చూపు లేకున్ననేమి
మనోనేత్రంతో అనుక్షణం నీ దర్శనమే...!!
4. మౌనంలో ఒలికాయి మాటలు
మనసాక్షరాలను చేరువకు రమ్మంటూ..!!
5. అల'జడి అల్లంత దూరమే ఎప్పుడు
కన్నీటి కలత కల'వర పెడుతున్నా...!!
6. అనుబంధపు ఆనవాలది
గతజన్మ బాంధవ్యాన్ని గురుతెరగమని గుర్తుచేస్తూ...!!
7. అక్షరాలు తెలిపాయి
అద్దమంటి మనసదని..!!
8. బంధాలకున్న అనుబంధమదేననుకుంటా
తెలియకుండానే మనసుకు చేరువగా వచ్చేస్తాయి...!!
9. సంకోచ వ్యాకోచాలు అవసరమే
ఎద సవ్వడి తెలియాలంటే...!!
10. తరిగిపోని అభిమానమిది
కరిగిపోని అనుబంధాలతో...!!
11. విశ్వంతో పని ఏముంది
ఎద నిండుగా నువ్వుంటే..!!
13. నక్షత్రాలెందుకు
నీ నవ్వుంటే చాలదూ..!!
14. కొన్ని మౌనాలంతే
మనసుని మళ్ళిస్తాయి మాటలను వినమంటూ...!!
15. నీ మనసు మకరందం
మాటల్లో ఒలికి పోతూ...!!
16. చిరునామా తెలిపిన చెలిమి
గతపు జ్ఞాపకాన్ని గుర్తుచేస్తూ..!!
17. అక్షరాలెన్ని సృష్టించాలో
నీ మౌనాన్ని మాటలుగా పేర్చడానికి...!!
18. చెలియలి కట్టకు తప్పదు
సంద్రంతో స్నేహం చేయక..!!
19. అలల ఆరాటమది
ఆగని పోరాటమై అందరికి ఆదర్శమై...!!
20. రెప్పలిప్పాలని లేదు
కలలోనైనా కనిపిస్తావని..!!
21. ఎన్ని పున్నముల పెట్టో
నీ నవ్వుల వెలుగులు...!!
22. అక్షరాలకు అద్దకాలెందుకు
అందమైన భావాలుగా అవి అమరుతుంటే...!!
23. శృతికి చిక్కిన సాహిత్యమిది
మదికి ఆహ్లాదమిచ్చే మౌనగీతమై...!!
24. సజీవ చిత్రమే నీవు
స్వప్నం సాకారమైన వేళ...!!
25. అలరించడం అక్షరాలకు అలవాటే
సాహిత్యపు సుమగంధాల చేరికతో...!!
26. ఇష్టంగా ఉంది
నీ ఇష్టపదైనందుకేమెా...!!
27. కాలమెంత తేలికైనదో
అందరి బరువుభారాలు తనపై పడుతున్నా...!!
28. రంగుల కలే అది
కనుపాపల్లో అనుక్షణం కదలాడుతునే..!!
29. మాటల విరుపులే
మౌనం వయ్యారాల్లో...!!
30. అనువదించడం కష్టమే
అక్షరాలకు అలవి కాని మనసును...!!
6, ఆగస్టు 2019, మంగళవారం
ద్విపదలు..!!
1. రాయనలవి కాని భావం
మనసుని చదివేస్తే చాలంటూ...!!
2. గమ్యమెప్పుడూ అందేంత దూరంలోనే
గమనమే అడుగడుగునా అడ్డంకులతో...!!
3. రాయెద్దనుకుంటానా నిన్ను
క్షణమైనా ఉండలేను ఆ మాటపై..!!
4. నీ ప్రేమలాంటిది
అక్షరమక్షరంలో ఆరాధనలొలికిస్తూ...!!
5. మార్పు సహజమే
సజీవంగా మిగిలిన కొన్ని సాక్ష్యాలతో...!!
6. జవాబులక్కర్లేని జీవితమైంది
నీ జత చేరినప్పటి నుండి..!!
7. అసాధ్యమని అధైర్యమేలా
మన రూపాన్ని ప్రయత్నిస్తే కఠినత్వమెలా కరిగిపోతుందో చూడు..!!
8. తరిమికొట్టనేల మౌనాన్ని
యుగాల జ్ఞాపకాలను మనకు చేరవేస్తుంటే..!!
9. మౌనం మనసు దోచేస్తోంది
ముచ్చటగా పంచుకుంటున్న ముచ్చట్లకు..!!
10. కాంతులీనింది ప్రతిక్షణమూ
కరిగిన కలల్లో కదలాడిన జ్ఞాపకమై...!!
11. మనసు తెలిసిన అక్షరాలవి
మనిషి అడుగులను తడబడనీయవు..!!
12. గుప్పెడు అక్షరాలే ఇవి
మదిని నింపే భావాలైపోతూ...!!
13. కలం తన ప్రయత్నమాపలేదు
మనసుకు భావాలకు లంకె వేసే అక్షరాలను ఆకట్టుకోవడంలో...!!
14. కలమాగినా కాలమాగదు
అల్లికలవాటైన అక్షరాలకు..!!
15. తిమిరపు తెరలే అన్నీ
కలతలకు నెలవైన కథలకు..!!
16. నిశీథిలోనూ నిధులే అవి
మిణుగురులై మెరిసే జ్ఞానాక్షరాలు...!!
17. అమ్మను మరిచిందెక్కడా
గుర్తు రావడానికి జ్ఞాపకమైపోలేదు నా జీవమే తానైంది..!!
18. కలలా కదిలిపోయింది కలత
చిరునవ్వుల విరుపుల సందడికి...!!
19. క్షణాల్ని లెక్కిస్తున్నా
నీ సమక్షంలో లెక్కలు తేలని సమయాన్ని లెక్కించేద్దామని...!!
20. క్షణాల్ని లెక్కిస్తున్నా
మనవైన ఘడియల్లో మనది కాని కాలానికి తావుందేమెానని..!!
21. మౌనమంతా మటుమాయం
నీ జ్ఞాపకాలతో ఊసులాడుతున్న క్షణాల్లో..!!
22. మనసు పరిమళమీ అక్షరాలది
భావ తారకలను బహు సున్నింతంగా దోసిళ్ళలో ఒంపేస్తూ...!!
23. వెళ్ళాలనున్నా వెళ్ళనీయవు
మనసుతో కట్టి పడేయడం నీకలవాటేగా...!!
24. బంధమూ లేదు అనుబంధమూ కాదు
అయినా విడదీయలేని ముడుల ఆనవాళ్ళేంటో..!!
25. శిథిలాలూ పదిలమే
మనిషిలోని మనసు గురుతులను దాయాలనుకుంటే..!!
26. ఏకాంతం అనంతమైంది
మనోసంద్రానికి తగ్గట్టుగా..!!
27. అక్షరాల తడి మదిని తాకింది
ఏ భావం కలవర పెట్టిందో...!!
28. మార్మికత అవసరమందుకే
భావాలు మనసులకు మాత్రమే తెలిసేలా...!!
29. గుండెకు భరోసానివ్వవూ
నీవు లేని క్షణాలను తట్టుకోలేకుంది...!!
30. గుండె చప్పుడు చేయడంలేదు
జ్ఞాపకాలు వలసబోయాయని అలిగి..!!
28, జనవరి 2019, సోమవారం
ద్విపదలు...!!
1. పదాల పదబంధం చాలదూ
పేర్చిన అక్షరాలు గాటినబడటానికి...!!
2. అక్షరాలెప్పుడూ అక్షయమే
గుండెగూటిలో నీ జ్ఞాపకాలున్నంత వరకు...!!
3. మలి వయసే ఇప్పుడు
పసితనపు ఛాయలు అద్దుకుంటూ. ..!!
4. అక్షరాల చుట్టూనే అనుబంధం
మనసు పరిమళాన్ని భావాలకద్దేస్తూ...!!
5. వద్దన్నా వెంటబడక మానవు కదా
విడిచి ఉండలేని అనుబంధం మనదైనప్పుడు...!!
6. అక్షరమై అలరిస్తుంటానిలా
ఆదరించి ఆస్వాదించే మనసులు మీవైనప్పుడు...!!
7. కొన్ని మనసాక్షరాలింతే
భావాలకు బాధ్యతలకు మధ్యన నలుగుతూ...!!
8. నా జ్ఞాపకాల్లో నువ్వున్నావుగా
పేలవమైన బ్రతుకులో జీవాన్ని నింపి జీవితాన్ని ఇవ్వడానికి....!!
9. తడబాటుకు స్థానమే లేదు
నా నెలవు నీలోనున్నప్పుడు...!!
10. అక్షరాల్లో పరుస్తుంటానిలా
మనసైన ప్రతిసారి....!!
11. ఆర్తిగా ఆలింగనం చేసుకుంటుంది దుఃఖం
మనసు భారాన్నంతా తానే మెాస్తూ...!!
12. కాలాన్ని కలంతో కలిపేసా
కొత్త కథలు వినిపిస్తుందని..!!
13. దిగులుకు చోటెక్కడా
గమ్యమే నీవైన పయనం నాదైతే...!!
14. తప్పనితనంగా మార్చుకున్న ఆధునికత
అవసరార్ధం అనుబంధాలకు దగ్గరౌతూ....!!
15. కనురెప్పల నీడలో కదలాడుతోంది
కనుమాయమవని నీ జ్ఞాపకమిలా..!!
16. జ్ఞాపకాల ముత్యాలను సేకరిస్తున్నా
మేలిమిసరాలుగా వర్తమానానికి కానుకనీయడానికి...!!
17. మనసుకు మాటిచ్చాను
మరపు దరిజేరదని...!!
18. జ్ఞాపకాలూ అంతే
మనసు పుస్తకంలో చొరబడనిదే ఉండలేవు...!!
19. అద్భుతాన్ని ఆవిష్కరించేది అక్షరాలే
మనోభావనలను చరిత్రపుటల్లో లిఖిస్తూ....!!
20. రెక్కలు తెగిన అక్షరాలవి
ఆకాశవిహంగాలైన భావాలను మెాసినందుకు....!!
21. చెప్పేవరకు వదలని భావాలవి
అక్షరాలకు అనువుగా మసలుతూ..!!
22. కలలకు కొత్తదనం కావాలట
బుజ్జగింపులు వాస్తవాలను మరువనివ్వట్లేదని...!!
23. తానైంది అమ్మ
మనసేదో తెలిసినట్టు మమతేదో పిలిచినట్టు..!!
24. పరిధులే పదాలకన్నీ
అక్షరాలకు పొదుపు అలవాటు చేస్తూ..!!
25. అక్షరమెప్పుడూ అపురూపమే
మనసులను రజింపజేస్తుందని..!!
26. పొరబాటే మనసుది
మరిచిపోవడం తెలియక...!!
27. కొన్ని చేతులంతే
అక్షరాలనలా ఒంపేస్తాయి మాటలకందని భావాలుగా...!!
28. అవధుల్లేని ఆనందమే ఇది
అనిర్వచనీయ ప్రేమకు సాక్ష్యంగా..!!
29. మరపు మౌనమయ్యింది
ప్రేమ సంద్రమై చెంత చేరితే...!!
30. అద్దానికి అర్థమయ్యింది
మనసు భావాలు మనవే అని...!!
2, నవంబర్ 2018, శుక్రవారం
ద్విపదలు...!!
1. అదే మాట
మన మనసులను పరిచయం చేస్తూ...!!
2. మౌనమెప్పడూ మాటల్లోనే
మనసు పారేసుకున్న క్షణాల్లో దొర్లిపోతూ....!!
3. ఆరాధనకర్ధం ఇదేనేమెా
నిరీక్షణనూ ఆస్వాదిస్తూ...!!
4. అక్షరాలూ తొందర పడుతున్నాయి
పదాల ప్రవాహంలో కలవాలని...!!
5. విడలేని అక్షర బంధమది
పదాలన్నీ నీతోనే ముడిబడినందుకనుకుంటా...!!
6. వినిపించిన శబ్దమేదో వెంటాడుతోంది
గతజన్మ జ్ఞాపకాన్ని తలపిస్తూ...!!
7. మనసెప్పుడూ ఇంతేనేమెా
మౌనాన్ని నీతో నింపి మాట్లాడించేస్తూ...!!
8. చీకట్లో నక్షత్రాల వెలుగు
తప్పిపోయిన అనుబంధం వెదుకులాడుతూ...!!
9. మనసు పుస్తకమింతే
మౌనపు ముచ్చట్లను అక్షరాల్లోనికి ఒంపేస్తూ...!!
10. మనసు పడినందుకే ఈ మరులు
మరపు సాధ్యం కాదని తెలియక...!!
11. అక్షరం మౌనవ్రతం వీడింది
మదిలోని మాటల వెల్లువకు...!!
12. నిశ్శబ్దం ఇష్టంగా ఉంది
స్తబ్ధత నిండా నువ్వున్నావని...!!
13. అలరించింది నీ రాగమే
అలవోకగా నిరీక్షణ గమకాలై....!!
14. నిరీక్షణ ఓ రాగమైంది
నీ మదినలరించే మలయమారుతంగా...!!
15. గెలిచింది అక్షరాలే
పడుతూ లేస్తున్న జీవితాన్ని అందుకుని...!!
16. చదువుతోంది నిన్నే
గెలిచిన మనసుని అక్షరాలుగా మలుస్తూ....!!
17. కలలే ప్రియం
నిన్నే చూపిస్తాయని...!!
18. కథలే నయం
కబుర్లు పంచుతుంటాయలా....!!
19. మనసాకలి అక్షరానికెరికయ్యింది
భావాల విందుకు సమాయత్తమౌతోంది అందుకే...
!!
20. నిశ్శబ్దం నిష్క్రమించడం మర్చిపోయింది
నీతో నిండిన జ్ఞాపకాల క్షణాలను కాలానికి అప్పగించలేక...!!
21. చేయందుకున్న క్షణాలివేగా
గుర్తెరిగిన మనసు గమనించి దగ్గరైనప్పుడు...!!
22. కదిలిపోయేది కాలమే
కలిసిన క్షణాలను మనకు వదిలేసి....!!
23. కన్నీటి వెచ్చదనం తాకింది
వేడిమి గుండె మంటదైనందుకేమెా...!!
24. అక్షరాలతో గెలుపుబాటలు వేసుకుంటున్నా
అవమానాలను ఆయుధాలుగా చేసుకుని....!!
25. పాతబడినా కొత్తదనమే ఎప్పుడూ
మనసు పడిన మాటైనందుకేమెా...!!
26. మంత్రమూ లేదు తంత్రమూ లేదు
మనసు మైమరచి నవ్వుగా చేరిందంతే....!!
27. పలుకులు పదిలమయ్యాయి
నీ మది సవ్వడి కలిసినందుకనుకుంటా...!!
28. అక్షరమెుక శరం
సూటిగా తాకితే అణ్వాయుధమై జ్వలిస్తూ....!!
29. మనసు రంగే అక్షరానిది
మమేకమైన భావాలకు రూపానిస్తూ...!!
30. కథలెలా అల్లాలో మర్చిపోయా
కతే మనదని తెలిసాక..!!
11, జులై 2018, బుధవారం
ద్విపదలు...!!
1. నా జీవితమే నువ్వు
జీవనదిలా మారి నా అక్షరాల్లో నిరంతరం ప్రవహిస్తూ....!!
2. నా ఆస్వాదనలే నీవు
విడివడని భావాలకు జత చేరిన అక్షరాలుగా మారతూ..!!
3. వలచి వచ్చిందో చెలిమి
వలసపోయే జ్ఞాపకాలను వెంటేసుకుని...!!
4. మనసుని పరికిస్తున్న క్షణాలివి
మౌనానికి మాటల అలంకారాలద్దేస్తూ...!!
5. కథ ముగిసింది
కల జీవితమని తెలిసే సరికి...!!
6. మనసును మాలిమి చేసుకున్న జ్ఞాపకం
కాలానికి చిక్కని పరిమళపు గుభాళింపుతో..!!
7. కల్లలేగా చెంతనుంది
కలలన్నీ వీగిపోయాక...!!
8. అమ్మ బడిలో నేర్చుకున్నందుకేమెా
అక్షరానికింత ఆప్యాయత నేనంటే...!!
9. వెన్నెలంతా నవ్వుల్లో ఒలికింది
కవితాక్షరాలన్ని మది సిరాలో ముంచి రాయాలని అనుకుంటే...!!
10. బంధమై చేరినందుకేమెా
బాధ్యతగా మిగిలిపోయాను...!!
11. గతజన్మ పరిమళమనుకుంటా
ఈ జన్మలోనూ వదలక వెన్నాడుతోంది...!!
12. మెాహం సమ్మెాహనమైంది
స్నేహ పరిమళమై చెంత చేరుతుంటే...!!
13. మదిగమకాలు స్వరాలు ఆలపిస్తూ వెంటబడుతోంది
నిశ్శబ్ధ రాగాన్ని పరిచయం చేయడానికేమెా....!!
14. ఏకాంతం చేరువయ్యింది ఎందుకో
నీ తలపులనందించాలని కాబోలు..!!
15. కాలమే నాతో ఉండిపోయింది
నిన్ను విడలేని బంధమై....!!
16. జీవితాన్ని గెలవాలనుకుంటున్నా
ఓడిన మనసుకు ఓదార్పుగా నిలుస్తూ....!!
17. కవిత్వంలోని జ్ఞాపకమే నీవు
అక్షరాలన్నింటా భావమై ప్రవహిస్తూ ....!!
18. తనంతే ఓ జ్ఞాపకం
మదిలో చెదరని మనసాక్షరం...!!
19. చీకటితోనే సహజీవనం
నీవు లేవన్న భావనకు తావీయక...!!
20. వశమయ్యింది కాలం
గెలుపోటముల క్షణాలకు...!!
21. రాగమెుప్పని భావాలైనాయి
అక్షరాలు జతగూడకేమెా...!!
22. అరవైయ్యారు కళల అవపోశనం
రాధామాధవ రమ్య చరితం....!!
23. ఆవహించిన చైతన్యమిప్పుడు
నాలోని స్వరం నీదై పలికితే...!!
24. కలలన్ని తెలిసినదానవు
కల్లలు చేయదగునా... !!
25. చిరునామా అక్కర్లేని చెలిమి
ఎదలో శాశ్వతంగా నిక్షిప్తమై...!!
26. భాష మధురం
మనసులను తడుముతున్నందుకనుకుంటా...!!
27. లెక్కకు రాని క్షణాలేనన్నీ
నీతో కలిసున్నప్పటి కాలానికి....!!
28. అక్షర సన్యాసమే
కన్నీళ్ళు కరవాలాలై కాపు కాస్తుంటే...!!
29. తీరని మచ్చట్లకే
ఆ తీపి జ్ఞాపకాల తలపు....!!
30. మనసుదేముంది మరలిపోతుంది
కాలం పూసే మరపు లేపనంతో....!!
30, ఏప్రిల్ 2018, సోమవారం
ద్విపదలు...!!
1. శోకమెంత నెమ్మదించిందో
ఆలంబనై చేరిన నీ చెలిమికి...!!
2. వెలుగు చిత్తరువుకై నిరీక్షణ
జీవితపు చీకటి కాన్వాసుపై....!!
3. వెలుతురు వస్తానంటోంది
మరలిన స్నేహాన్ని మరల అందిస్తానంటూ..!!
4. మనసు మౌనాన్ని వీడిందేమెా
జ్ఞాపకాల వేగాన్ని తట్టుకోలేక..!!
5. శూన్యం పూరించే సందర్భం
నాతో నేనున్నప్పుడే సాధ్యమేమెా..!!
6. మనమయ్యే క్షణాలే అన్నీ
దాయలేక అక్షరాలు అలసిపోతాయేమెా...!!
7. అక్షరాలు పాతవే
భావాలే సరికొత్తవనుకుంటా...!!
8. నా ఎరుకు ఇప్పుడే వచ్చాయి
ఏనాటివైనా ఎదనుతాకే నీ భావనలు....!!
9. బందాలన్నీ అగమ్యమే
ఏ దారెటు పోతుందో తెలియక....!!
10. వాస్తవమై వద్దనే ఉండు
కోల్పోయిన జీవితాన్ని అందిస్తూ...!!
11. ఎప్పటి కష్టాలప్పుడే
ఎప్పటికి నిత్యనూతనంగా...!!
12. కన్నీరు అంతే
కష్టాలను వదిలి ఉండలేదు ఎందుకో... !!
13. కలవరాలతోనే కడవరకు
నట్టింట్లో నమ్మకం అపహాస్యం పాలయ్యాక...!!
14. నీలోనే ఉన్నా
గుర్తెరిగినట్లు లేవు...!!
15. చీకటి స్వప్నాలెన్ని దాగున్నాయో
వేకువ వెలుగుల మాటున...!!
16. మనసుకెలా తెలుస్తుందో
మౌనంలో మాటలన్నీ...
!!
17. ఆహ్వానించక తప్పలేదు కాలానికి
మార్పు అనివార్యమని తెలిసాక....!!
18. అక్షరాలను ఆవహిస్తుంటావిలా
మనసు భావాలను తర్జుమా చేయడానికనుకుంటా...!!
19. చెలిమి చెమరింతవే నువ్వు
గాయాలకు జ్ఞాపకాల లేపనమద్దుతూ....!!
20. నీ జ్ఞాపకం
మనోసంద్రంలో మౌనపు అలల అలజడి...
!!
21. నేనో క్షణాన్ని
నీ కాలపు లెక్కల లెక్కింపులో...!!
22. నేనో భావాన్నే
అక్షరాల అల్లికలో అందంగా ఇమిడిపోతూ...!!
23. నేనో గాయాన్ని
గతాన్ని జ్ఞాపకంగా మార్చే వాస్తవంలో....!!
24. నేనో వ్యధాభరిత కథని
వాస్తవంలో ఇమడలేని గతాన్నై...!!
25. ఘడియలు లెక్కించలేకున్నా
నీ జ్ఞాపకాల తాకిడిని తట్టుకోలేక...!!
26. కబురంపాను కుశలమని
మనసు దోబూచులాటల్లో మరపుకు తావులేదంటూ...!!
27. గడచిన దశాబ్దాలు రెండే
శతాబ్దాల చరితను వెంటేసుకుని..!!
28. విస్తుపోయిన ఆ క్షణం
జ్ఞాపకమైనది సజీవమై నిలిస్తే....!!
29. బంధమై మిగిలావు
బాధ్యతలన్నీ మెాస్తూ...!!
30. ఏకాంతం..
మనిషితో మనసు మాట్లాడే క్షణాల సంగమం...!!
19, ఫిబ్రవరి 2018, సోమవారం
ద్విపదలు..!!
1. నీటి మీది రాతలంతే
తేలిపోతూ చులకనౌతున్న బంధాలై..!!
2. కొన్ని మాటలంతే
మరువలేని బాసలుగా...!!
3. మనసు మాట్లాడేస్తోంది
జీవితంలో నిర్మలత్వానికి ఓ అర్ధాన్నిస్తూ...!!
4. నైతికత ఇస్తుందేమెా
జీవితానికి ఆత్మతృప్తిని..!!
5. వరాలన్నీ నావే
వసంతమై నువ్వు నన్ను చేరితే...!!
6. వర్ణాలంతటా వయ్యారాలే
హరివిల్లుకు అందుకే అన్ని అందాలు...!!
7. కాలానికి ధీటుగా జవాబిస్తూ
మనోనిబ్బరంతో క్షణాలను ఒడిసిపడ్తూ...!!
8. నిశ్శబ్దం నవ్వుతోంది
ఏ తలపు కదిలిందో మరి....!!
9. మనసు సహకరించడం లేదు
మౌనసమీక్షలన్నీ నీతోనే నిండుకున్నాయని...!!
10. మనసును గెలిచిందిగా
ఓడిన మౌనం నీ మాయకులోనై...!!
11. నమ్మకమే నీవయ్యావు
సమస్య వీగిపోతుంటే....!!
12. మనసు మౌనమైంది
మాటలన్నీ నీవయ్యాక...!!
13. ముడి విడివడదు
మాట మౌనం మనమని నీవంటే..!!
14. ఎందరికో విశేషాన్నైన నేను
నీకెందుకు సశేషంగా మిగిలిపోతున్నానో...!!
15. ముగింపు అవసరం లేని కథ
తరగని చెలిమికి అక్షయమైన పాత్రలుగా...!!
16. అక్షరానికి ఎప్పుడూ ముచ్చటే
నిన్ను తనలో చూసుకుంటానని...!!
17. భావాల బంధనాలన్నీ విడిపోయాయి
స్వేచ్ఛావిహంగాలైన అక్షరాల ధాటికి...!!
18. విచ్చుకుందో వేకువ
మలిరాతిరి మధుర సంతసాలను వెంటేసుకుని....!!
19. నిమజ్జనం చేసినా మళ్ళీ పుడుతోంది
నేనే నీవుగా మారిన జ్ఞాపకమైనందుకేమెా..!!
20. ఆనందం ఆర్ణవమైంది
అద్దంలో నాలో నిన్ను చూస్తూ..!!
21. మనదైన అంతరంగం
అంతరాలకు అందకుండా...!!
22. చెదిరిన మనసొకటి
నా అనే ఆనవాళ్ళకై వెతుకుతూ...!!
23. వసంతం వలసెళ్ళినట్లుంది
మరో ఉగాదికైనా వస్తుందో రాదో...!!
24. ఓ క్షణం చాలదూ
మమతల మాధుర్యాన్ని పంచడానికి...!!
25. గాయమూ గోప్యమైంది
మాటల గారడిలో మునిగిన మదికి... !!
26. దాయాల్సింది ఏముంది
నేను నువ్వు ఒకటిగా మారినప్పుడు...!!
27. విశేషంగా మిగిలిపోదామిలా
సశేషాలను చెరిపేస్తూ..!!
28. మనసులోని మమతను చూస్తున్నా
మౌనానికి మాటలను అలంకరిస్తూ...!!
29. మాటలు మర్చిపోవాలనుకుంటున్నా
గాయాలను మాన్పుకోవాలని....!!
30. గేయాలైన గాయాలే అన్నీ
గమనం మరచిన మదిలో....!!
26, డిసెంబర్ 2017, మంగళవారం
ద్విపదలు...!!
1. చీకటిలోనూ వెలుతురే
మదినిండుగా నీ జ్ఞాపకాల తారకలతో...!!
2. చీకటి విస్తరణ స్వల్పమే
లెక్కకందని వెలుగు చుక్కల్లో ....!!
3. తొలగుతాయి ముసుగులు
నాటకాన్ని బట్టబయలుచేస్తూ....!!
4. నీడనై నీతోనే ఉంటా
చీకటివెన్నెలతో స్నేహం మనదని....!!
5. మానసానికెప్పుడూ పురిటినొప్పులే నిన్నారేపుల్ని తలచుకుంటూ ఈరోజులో బతికేస్తూ... !!
6. శబ్దమూ సడి చేయకుంది
నీ మౌనానికి భయపడేమెా...!!
7. చైతన్యానికి చిరునామా నువ్వు
మౌనం మనసు పారేసుకుందందుకే....!!
8. మాటల కోసమే ఈ అగచాట్లన్నీ
మనసులో మౌనాన్ని వెలుపలికి తేవడానికి....!!
9. నీతోనే నేనంటుంది
చెలిమి సంబంధమది....!!
10. తారలు తళుకుమంటున్నాయి
ఙాబిల్లినొదిలి పోతున్న రాహుకేతువులను చూసి...!!
11. మనసంతా మురిపాలే
నీ మౌనపు అలికిడి తాకిడికి...!!
12. గెలుపుకు బాసట
అక్షరమిచ్చిన ధైర్యమే...!!
13. ఏకాంతం ఏకపక్షమైంది
ఎద నిండా నీవున్నావని తెలిసేమెా....!!
14. రాహిత్యం ఎక్కువైనందుకేమెా
సాహిత్యం చిక్కబడుతోంది....!!
15. కలల కన్నీరు జాలువారింది
కాలాన్ని సవాలు చేస్తూ కలం రాస్తున్న అక్షరాల్లో....!!
16. వెన్నెల వల వేసింది
చీకటి చుట్టానికి చిక్కనీయక...!!
17. చీకటిలో వెన్నెల కురిపిస్తున్నా
వెతల కన్నీళ్ళకు సంబరాలందిస్తూ...!!
18. విషాదానికి వీడ్కోలిచ్చేస్తూ
నిన్నటిని సాగనంపడమే....!!
19. అంతరిక్షమూ అరిచేతికి అందింది
నీ సాన్నిహిత్యానికి దాసోహమై...!!
20. జీవిత సజీవ చిత్రాలే అన్నీ
కాలం చేతిలో చిత్రవిచిత్ర రూపాల్లో....!!
21. భారమూ బాంధవ్యమైంది
నీ ఆప్యాయత అక్షరాలుగా అల్లుకుపోతుంటే...!!
22. పరిమళిస్తుంటే పారిజాతాలనుకున్నా
నీ స్నేహపు సుమగంధాలని తెలియక...!!
23. తీర్చుతున్నా నీ అలుకని
చెలిమి చిరునవ్వుల సాక్షిగా
24. మనసు మౌనిగా మారింది
అక్షరాలు మాటలు నేర్చాయని...!!
25. నేనంటే చైతన్యమే
విషాదాన్ని సైతం సంతసంగా మార్చేస్తూ... !!
26. తోడుగా వస్తున్న జ్ఞాపకాలు
గతాన్ని వాస్తవంలో చూపిస్తూ...!!
27. అక్షరాలకూ ఆనందమైందట
నీలో నన్ను చూసిన క్షణాల్లో....!!
28. కోరికలన్నీ క్షణికాలేనట
మన మనసులు అక్షరాలకు అంకితమైయ్యాక...!!
29. అక్షరాలన్నీ రాతలకే పరిమితం
మనసు మూగదనాన్ని బయటేస్తూ...!!
30. కొన్ని స్వగతాలింతే
మనసుని దాచేస్తూ....!!
16, డిసెంబర్ 2017, శనివారం
ద్విపదలు..!!
1. అంబరాన్నంటుతున్నాయి సంబరాలు
లెక్కబెట్టలేని చుక్కల్లో నువ్వు ఎక్కడో...!!
2. మనసు ఇంకిపోయినా
మానసంలో జీవమున్నట్లుంది...!!
3. వేకువ వంత పాడింది
చీకటి చుట్టానికి వీడ్కోలిమ్మంటూ...!!
4. వెతలన్నీ వెలుపలికి రానంటున్నాయి
గుండె గూడు చిన్నబోతుందేమెానని..!!
5. భావాలకూ గాయాలే
అక్షరశరాలు సంధిస్తుంటే...!!
6. గుండె గుప్పెడే
మనసుకోటలో బందీగా...!!
7. కదిలించిన నాదం నీవేగా
గాయమై మిగిలిన అక్షరగేయాలుగా....!!
8. అసౌకర్యమే మిగిలింది
నీ మది గూడు ఇరుకై...!!
9. ఆత్రమెక్కువలే మాయ బుద్దికి
చివరిపేజి త్వరగా చదివేయాలని..!!
10. పరమపద సోపానమే అయ్యింది
విషపు కోరలకు చిక్కకుండా విజయానికి చేరువ కావడానికి...!!
11. మెలకువలోనూ కలతలే
నీ వలకు చిక్కిన నేరానికి...!!
12. భాషకు అందనిది
భావమైన బాధేనేమెా...!!
13. అక్షరానికి అపజయమన్నదే లేదు
అవాంతరాలు ఎన్ని ఎదురైనా...!!
14. పాట పల్లవి కుదిరాయి
స్వర సమ్మిళితమే ఆలస్యమింక...!!
15. పదము కలపడమూ సంతోషమే
నువ్వు నేనైన క్షణాల్లో..!!
16. పన్నాగాన్ని ప్రేమనకు
భ్రమలో ఉంచి బజారున పడేస్తారు...!!
17. ఆత్మీయంగా అల్లుకున్న అక్షరాలు
భావ చౌర్యపు కోరల్లో...!!
18. మనసే కల్లోల సాగరం
ఆటుపోట్ల అలజడుల అంతరంగంలో...!!
19. విజయం వరించిందిగా
శూన్యాన్ని వెలివేస్తూ...!!
20. పట్టి తెచ్చాను గెలుపుని
జీవితానికి కొత్త అర్ధానిస్తూ...!!
21. అపజయాలే గీటురాళ్ళు
విజయానికి కొలబద్దలై...!!
22. అజాగ్రత్త పనికిరాదు
అనునయింపులు అవసరార్ధమేమెా...!!
23. కొందరికి అంతర్జాలమే జీవితం
ఇతరుల మనసులు కుళ్ళబొడుస్తూ...!!
24. అపశృతులని సవరించడమే
తీపిజ్ఞాపకాల స్వరాలకై...!!
25. అహం అడ్డుగా నిలుస్తుంది
గమ్యాలను చేరే క్రమంలో...!!
26. రేపటిని ఆహ్వానించు
ముగిసిన నిన్నల్ని జ్ఞాపకంగా మార్చి...!!
27. మనసుకు సున్నితత్వమెక్కువ
ముళ్ళు పూలు ఒకేలా చూడడటంలో...!!
28. దానవత్వానికి సమాధానం
దైవత్వమని తెలుసుకోవాలి...!!
29. వేకువ కోసం వెదుకుతోంది
చీకటిపొద్దుల్లో చితికిన మనసు....!!
30. వెలుగడుగు దూరమే
అడ్డంకులను అధిగమించాలంతే...!!