30, జూన్ 2010, బుధవారం

నేనేనా అన్న భావన!!!

నువ్వు చేసే ప్రతి పనిలోనూ...వేసే ప్రతి అడుగులోనూ...
నీ కోపంలో....నీ సంతోషంలో....నీ ఏడుపులో...
నీ ఆటల్లో...నీ పాటల్లో...నీ నవ్వుల్లో.....
నీ మాటల్లో...ఇలా అన్నిట్లో...
చిన్నప్పటి నన్ను మళ్లీ చూసుకుంటున్న అనుభూతి!!!
నిన్ను చూస్తుంటే.....బంగారు తండ్రీ!!!!

23, జూన్ 2010, బుధవారం

ఇబ్బందులు...

మా ఆఫీస్ లో కొంతమందికి పక్కన వాళ్ళు సిస్టం లో ఏమి చేస్తున్నారు, ఫోనులో ఏమి మాట్లుడుతున్నారు అనే విషయాల మీద వున్న ఇంటరెస్ట్ ఇంక వేటి మీదా వుండదు. కొద్దిగానైనా వారి అసహ్యకర ప్రవర్తన మార్చుకోరు. ఏమైనా అన్నా కుడా పట్టించుకోరు. అంటే దున్నపోతు మీద వాన కురిసిన చందాన అన్నమాట ఇలాంటి వాళ్లకు.

ఇంట్లో ఎంత గారాబంగా పెరిగినా బయట నలుగురితో శభాష్ అనిపించుకోవాలి గాని…

వీడెప్పుడు పోతాడా అని ఎదురు చూసేటట్లు ఉండకూడదు.

మన పెద్దలు చెప్పినట్లు కాలు జారితే వెనక్కి తీసుకోగలం కాని మాట జారితే తీసుకోలేము అని వీళ్ళకు ఎప్పుడు తెలుస్తుందో మరి .

మీ ప్రవర్తన ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా ఆహ్లాదాన్ని ఇవ్వాలి కాని అసహ్యాన్ని పెంచకూడదు. మరి ఈ నిజాన్ని వాళ్ళు ఎప్పుడూ తెలుసుకుంటారో!!.

ఈ నాటి పల్లె దుస్థితి














పల్లె ఏడుస్తోంది…..

దూరమౌతున్న అనుబంధాలను దూరం చేసుకోలేక….

బతకడానికి వలసలు పోతున్న కుటుంబాలను ఆపలేక…

మసకబారుతున్న మానవత్వపు విలువలు చూడలేక…

ఓట్ల కోసం వచ్చి వాగ్థానాల వర్షాన్ని కురిపించే

రాజకీయ నాయకుల రాక్షస నీతిని చూడలేక..

పాడి పంటలతో..పచ్చని పైరులతో…అష్టైశ్వర్యాలతో కళ కళలాడిన పల్లెలు ఒకప్పుడు.....
మరి ఇప్పుడు ......

ఎప్పుడు పడుతుందో తెలియని వానదేముని చల్లని చూపు కోసం…

ఏ ప్రళయం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో తెలియక

పండిన పంటకు కనీసం గిట్టుబాటు లేక

పంట పండించాలో లేదో తెలియని

అయోమయ స్థితిలో వున్న ఈ నాటి పల్లె రైతుని చూసి

గుండే చెరువైయ్యేలా పొగిలి పొగిలి ఏడుస్తోంది…ఈనాడు.....

ఆనాటి బంగారు పంటల పసిడి పల్లె


21, జూన్ 2010, సోమవారం

నీ తలపుల పరిమళాలు....

అలై పొంగి ఎదే నిండి
మదిలో ఉప్పొంగి....
జడివానలో తడిచి


సుడిగాలిలో ఎగిరి....
చిగురాకులా వణికి
చిరుజల్లు గా మారి....
విరి పానుపై 
నను చుట్టుముట్టేలే 
నీ తలపుల పరిమళాలు....

19, జూన్ 2010, శనివారం

నీకేమివ్వగలను???

కలలా మెదిలి కనుమరుగై పోయావు.....
అలై వచ్చి అల్లిబిల్లి ఆశలు రేపావు......
బాష రాని నాకు భావమై నిలిచావు.....
మాట రాని నాకు పదాల అమరిక నీవైనావు....
మౌనమై పోయి నా మదిలో నిండి పోయావు.....
నా అన్నదంతా నీవే నిండి వున్నావు....
నా ప్రాణమే నీవైన నీకేమివ్వగలను???

11, జూన్ 2010, శుక్రవారం

సొంత డబ్బా - పిచ్చా పాటి

పక్కనొడు ఏమి చేస్తున్నాడు అని కాకుండా మనం ఏమిటో చూసుకుంటే మంచిది.ఎంతసేపు ఎదుటి వాళ్ళలో వంకలు ఏమి వెదుకుదామా అని కాకుండా మన పని మనం చూసుకుంటే ఒంటికి, ఇంటికి కుడా మంచిది. ఏదో ఒకటి మాట్లదేస్తే సరి పోదు కొద్ది గా మంచి మర్యాద తెలుసుకోవాలి మాట్లాడేటప్పుడు. మా ఆఫీసులో వున్నారు కొందరు వాళ్లకు ఎంతసేపు పక్కన వాళ్ళని ఏమి అందాము అనే కాని వాళ్ళు ఏంటి అన్నది వాళ్లకు అక్కర లేదు. కనీసం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో కుడా తెలియకుండా నోటికి ఏది వస్తే అది వాగుతూ అదో గొప్ప విషయంలా ఫీల్ ఐపోతారు. మాట్లాడటం లో వాళ్ళని మించిన వాళ్ళు లేరు అని వాళ్లకు వాళ్ళే కితాబులిచ్చుకుంటూ వుంటారు. ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు మాట్లాడే మాటను అర్ధవంతం గా మాట్లాడాలి. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోలేము అది గుర్తు ఉంచుకుని ఒళ్ళు దగ్గర ఉంచుకుని మాట్లాడాలి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు.మన గొప్ప మనం చెప్పుకోడం కాదు పది మంది చెప్పుకోవాలి.

7, జూన్ 2010, సోమవారం

ఆటోగ్రాఫ్…..!!



అందమైన సంతకం కాదు ఆటోగ్రాఫ్ అంటే
నాపై నీకున్న అభిప్రాయాన్ని చెప్పే ఓ నిజం…
ఏదోఒకటి రాసామనకుండా.....
రాసేదాన్ని మనసు లోపలి నుంచి వెలికి తీసి
అందం గా రాస్తే అవుతుంది అది ఓ చక్కని తీపి జ్ఞాపకం..!!

6, జూన్ 2010, ఆదివారం

శుభాకాంక్షలు



అమ్మా!!

పుట్టినరోజు శుభాకాంక్షలు…ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ....

ప్రేమతో….

మంజు

4, జూన్ 2010, శుక్రవారం

బొమ్మకు మాటలు

నిన్ను చూస్తూనే మైమరచా...
నీ అందమైన మోవిలోని అపరంజి మెరుపులు...
చెప్పనలవికాని తలపుల మైమరపులు...
పున్నమి చంద్రుని చల్లని వెన్నెల తేరుపై
మాటలకందని భావనల మధుర స్వాగతసుమాంజలితో...
అంజలి ఘటించే నీకేమి చెప్పను మాటలు??
బాపు బొమ్మను తలపించే తరుణీమణి..!!
(జ్ఞాన ప్రసూనగారు వేసిన బొమ్మకు జ్యోతి గారు మాటలు చెప్పమంటే ఓ చిన్న కవిత....)

బాలు గారికి....

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.....
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు.....అంటూ
ఎవరు పాడలేనన్ని, పాడలేని పాటలు పాడిన పాడుతున్న గాన గంధర్వుడి కి పుట్టినరోజు శుభాకాంక్షలు...

2, జూన్ 2010, బుధవారం

ఏదోఒకటి

కొంత మంది ఎప్పుడూ ఏదోఒకటి మాట్లాడేస్తూ వుంటారు....ఎదుటి వాళ్ళు ఏ పరిస్థితిలో వున్నారని కుడా చూడరు. వాళ్ళు అనుకుంటారు అబ్బో మనం చాలా బాగా మాట్లేడేస్తున్నామని కాని ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత తిట్టుకున్టున్నారో తెలుసుకోలేరు. మాట్లాడటం కుడా ఒక కళ అని తెలియదు. మనసు స్వాంతన కోసం మనతో మాట్లాడే వారిని ఇబ్బంది పెట్టకుండా వారి కష్టాన్ని తెలుసుకుని చాతనైతే మంచి సలహా ఇవ్వాలి కానీ... తేలిక చేసి మాట్లాడకూడదు. అలానే నమ్మిన వాళ్ళని నట్టేట మున్చకూడదు. మనం ఎవరి చేయి అందుకుని పైకి వచ్చామో మర్చిపోయి వాళ్ళ కింద గోతులు తవ్వితే అది ఆత్మ ద్రోహం అవుతుంది. ఒక్క సారి... మనసు అనేది వుంటే మనస్సాక్షిని అడిగితె చెప్తుంది మనం చేసేది ఎంత మంచి పనో!!!

ఈనాటి మనిషి.....

మనసు మూగగా రోదిస్తోంది......
దిగజారుతున్న నైతిక విలువలని చూడలేక
పతనమౌతున్న అనుబంధాలను చూడలేక
పైపైకి నటించే ఆప్యాయతల్ని తట్టుకోలేక
ఓ మనిషి ఇలా ఎంతవరకు నీ నటనా ప్రయాణం!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner