6, ఫిబ్రవరి 2024, మంగళవారం

జీవన మంజూష 02/24


 నేస్తం,

         ఈరోజుల్లో చాలామందికి అవసరంరేపటిపౌరులుసినిమాలో చాలా విషయాలు. పిల్లలను చూసి చాలామంది పెద్దలు నేర్చుకోవాల్సిన విషయాలు బోలెడు. మన ఇంట్లో తప్పులను ఎత్తి చూపలేనప్పుడు, మనకు ఎదుటివారి వ్యక్తిత్వాన్ని విమర్శించే హక్కు ఉందంటారా! తల్లిదండ్రులు అందరికి దైవ సమానులే కాని మన తల్లిదండ్రులు మనకెంతో ఇతరుల తల్లిదండ్రులు వారికి అంతేనన్న చిన్న విషయాన్ని మనమెందుకు మర్చిపోతున్నట్టో!

           పంపకాలు, అంపకాలు వాటిలో నిజానిజాలు చెప్పడానికి దివి నుండి భువికి దిగిరావాల్సిన అవసరముంది ఇప్పుడు. కాని అవి జరగని పనులు కనుక మన నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సబబు కాదు. అది నాయకుడైనా, సామాన్యుడైనా ఒకటే నీతి. ఇక పోషించడాలు, పెద్దవారిని చేయడాలు వెనుక ఎంత నాటకీయత నడిచిందన్నది జగమెరిగిన సత్యం. కుటుంబంలోనైనా విషయాలు జగద్విదితమే. నేను చెప్పినంత మాత్రాన నిజం అబద్ధమవదు. గొంతు చించుకుని నలుగురి దగ్గర చెప్పినంతనే అబద్ధం నిజమవదు

            బంధాలకు అర్థం, అనుబంధాలకు రూపం మనమేనని ఒళ్లు విరుచుకుంటే, రేపటి రోజున మనమే నలుగురిలో నవ్వులపాలు కావచ్చు. కష్టం మన ఇంటిది కాదని తోడబుట్టినవారిని అవమానిస్తే, లెక్కలు సరిజేయడానికి మాస్టారు బెత్తంతో మన పక్కనే ఉంటాడని చరిత్ర చెబుతోంది. మనమనే ప్రతి మాటకు ఎదుటివారు సమాధానం చెప్పగలరు. కాని మనం ఓసారి ఆత్మ విమర్శ చేసుకుంటే నిజం ఏమిటన్నది తేటతెల్లమౌతుంది

              రెండిళ్ల మధ్యన దూరం ఎప్పుడూ మారదు. దగ్గరతనం లేని అనుబంధాన్ని తెంచుకోవడమే ఉత్తమం. అవసరార్థం నటించే మనసులున్న మనుష్యులం మనమై పోతున్నప్పుడు, నిజాయితీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంటుంది. మన ప్రవర్తన మనకు బావున్నప్పుడు, ఎదుటివారిది వారికీ బావుంటుంది. ఎందుకంటేసూర్యుడు తూర్పున ఉదయించునుఅన్నంతగా అన్న మాట. మనస్సాక్షి అనేది మనకు గుర్తుంటే కనీసం మన జీవితంలో క్షణమయినా నిజాన్ని ఒప్పుకుందాం..!!



            

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

రుక్మిణిదేవి చెప్పారు...

Hi Manju garu. Naa blog నుండి mee blog vedukkunnaanu I think after 12 yes.. Nice post.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner