5, జులై 2011, మంగళవారం

ఈ జన్మకు సార్ధకత..!!

అష్టపదిలా అలరించలేను ఇష్టసఖిలా ఇమడలేను
రాధలా లాలించలేను సత్యభామలా ఆలుగనూ లేను
యశోదమ్మలా ప్రేమను పంచలేను
భక్తిలో రుక్మిణిని కాలేను
అనురక్తిలో గోపికలను మించలేను
అల్లరి ఆటల్లో....తుంటరి చేష్టల్లో....
ప్రేమను పంచడంలో....చెలిమిని పెంచడంలో....
మాయల్లో ముంచడంలో....జీవితార్ధాన్ని చెప్పడంలో....
నిను మించిన ఘనుడెవ్వరు ఆర్తరక్షకా.....
అందుకే అందరూ నీ దాసానుదాసులు....
నీ అనంత భక్త జన కోటిలో ఓ నీటి బిందువును....
ఈ అక్షర కుసుమాంజలితో......అంజలి ఘటించడం....
అనంత విశ్వంలో ఓ రేణువులా నిను చేరితే.....ఈ జన్మకు సార్ధకత..!!

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vijay చెప్పారు...

జయ కృష్ణా ముకుందా మురారి

చెప్పాలంటే...... చెప్పారు...

అలానే అండి..-:) థాంక్యు విజయ్

లత చెప్పారు...

చాలా బావుందండి

చెప్పాలంటే...... చెప్పారు...

లత గారు మీ కామెంట్స్ లేక నా బ్లాగ్ బాలేదండి ఈ మద్య.....-:) థాంక్యు లత గారు

జవహర్ బాబు చెప్పారు...

ఇప్పుదు క్రుష్ణుధు ఎందుకు గుర్తు కొచ్చాడండీ?

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమో తెలియదు -:)

it is sasi world let us share చెప్పారు...

హె క్రిష్ణా........ఆన్ని మంజుయె చెప్పింది.....
నెను యెమి వ్రాయాలి నీ గూర్చి.....

చెప్పాలంటే...... చెప్పారు...

రాయాలంటే ఇంకా బోల్డు వుంటాయి శశి ... థాంక్యు :)

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner