![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhmZU1fSHMxPnr3Q6gRAF0qTXF9blrUCBv82rPiLWnc2V3JuahfkyfYkOW0sbWSChF1DJlJxUd1Try3QPbaBl5zs3PtOr6haZGc07rT4SRD5YDU8ev-F7Zkkqom_SsPoSrLHbqIkwnBlkA/s1600/cfer.jpg)
అది నీతో ఉన్న నా జ్ఞాపకమే అనుకుంటా...!!
నా చుట్టూ పరుచుకున్న
చిరుగుల అతుకులలో కనిపించకుండా
పోయిందేమో అనుకుంటే....!!
చిమ్మచీకటి వెన్నెల చీర కట్టుకున్నట్టు
నన్ను చుట్టేసింది అదేనేమో....!!
చుక్కల వెలుగులో ఎక్కడో దూరంగా
ఓ చుక్క నావైపే వస్తున్నట్టు గా అనిపిస్తే...!!
రాలుతున్న ఆ నక్షత్రం నీ రాకను
కబురుగా నాకందించిందేమో....!!
అందుకేనేమో ఎక్కడో దాగున్నా
నీ తలపు అంత బాగుంది ఇప్పటికీ....!!
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
chala bagundi andi
Anta baagaa nachinanduku Dhanyavaadaalu Siva :)
అందుకేనేమో ఎక్కడో దాగున్నా
నీ తలపు అంత బాగుంది ఇప్పటికీ..చాలా బాగుందండీ..
Thank u So much Ennela garu
Ela vunnaru?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి