1, మే 2013, బుధవారం

మారిపోయిన మన జీవితాలు....!!

 ఒకప్పుడు వేసవి వచ్చిందంటే బోల్డు సంబరంగా ఉండేది...ఎంత ఎండలు ఉన్నా అస్సలు ఎండ అనిపించేది కాదు.
చెట్లు చేమలు ఎక్కువగా ఉండి ఎండ తెలిసేది కాదు. పల్లెటూర్లు అంటే అచ్చం పల్లెటూర్లు లాగా పచ్చగా చల్లగా హాయిగా ఉండేది. జనాలు కూడా నిండుగానే ఊరి నిండా ఉండేవాళ్ళు. వాళ్ళ మనసులు కూడా అంతే స్వచ్చంగా ప్రేమాభిమానాలు వెదజల్లుతూ ఉండేవి. తినడానికి బోలెడు రకాల కాయలు చీమ చింతకాయలు, తాటి ముంజెలు, రకరకాల మామిడి కాయలు, గెలలు ముగ్గవేసి పండాయో లేదో అని చూసుకున్నఈతకాయలు....ఇలా ఎన్నోరకాలు దొరికేవి. అలానే ఆటలు కూడా బోలెడు...ఆరుబయట వెన్నెల్లో పడుకుని చెప్పుకున్న చందమామ కతలు, బొమ్మల కబుర్లు, కనిపించి కనిపించక ఆడిన వీరీ వీరీ గుమ్మడి పండు వీని పేరేమి? దొంగాటలు ఇలా ఎన్నో....!! ఇప్పటి పిల్లలకు తిండి తెలియదు అలానే ఆటలు కూడాను. ఎంతసేపు టి వి లో చానల్స్  లేదా వీడియో గేములకే పరిమితం అయిపోతోంది బాల్యం అంతా....!!  బంధుత్వాలు తెలియకుండా నేను...నా అన్న స్వార్ధాన్ని మనమే పిల్లలకు అలవాటు చేస్తూ మనం అన్న మాటని....మనతో పాటుగా పెంచుకున్న వరుసలను మర్చిపోయేటట్లు చేస్తున్నాము.
మన సొంత ఊరు వెళితే ఇప్పటికి మనం ఊరిలో అందరినీ మర్చిపోయినా అబ్బాయ్ ఎప్పుడు వచ్చావు? ఆరోగ్యం బాగుందా....!! పిల్లలు ఎలా ఉన్నారు...ఏం చదువుతున్నారు...?? ఇలా పరిచయం మనకి లేక పోయినా ఆప్యాయమైన పలకరింపులు మనకు వినపడుతూనే ఉంటాయి....కాదంటారా....!! ఎన్ని కోట్లు సంపాదిస్తే మాత్రం ఈ ప్రేమ పూరిత పలకరింపులు మనకు దక్కుతాయి చెప్పండి.
సాయంకాలం ఆరుబయట అరుగుల మీద కూర్చుంటే తాతయ్యలు, మామయ్యలు, మామ్మలు....ఇలా అందరు వచ్చి కాసేపు చల్లగాలికి సేదదీరుతూ ఆ కబురు ఈ కబురు చెప్తూ వాళ్ళ రోజుల్లో కబుర్లు కలగలిపి చెప్తూ ఉంటే అబ్బా....!! నిజంగా ఎంత బాగా అనిపిస్తుందో...!! చెప్పడానికి మాటలు చాలవు. అమ్మమ్మ పచ్చిపులుసు వేసుకుని అన్నం తింటే ఏ ఖరీదైనా భోజనమైనా దానిముందు దిగదుడుపే....!!
ఇప్పుడేమో చదువులు, ఉద్యోగాలు అని పొట్ట చేతపట్టుకుని ఊళ్ళమ్మట తిరుగుతూ ఇంటికి ఉన్న కాస్తో కూస్తో పోలానికో పెద్ద వాళ్ళని కాపలాగా పెట్టి కనీసం ఒక్కసారి కూడా పల్లెకు వెళ్ళి నాలుగు రోజులు కల్మషం లేని ప్రేమలని, స్వచ్చమైన వాతావరణాన్ని ఆస్వాదించలేని జీవితాలు మనవి ఈనాడు. సుమ్మర్ ట్రిప్పులని ఆ ఊరు ఈ ఊరు పోకుండా రోజుల తరబడి కాకపోయినా ఊన్న ఊరిలో... నా అన్న వారితో కనీసం నాలుగు రోజులు గడపడానికి ప్రయత్నం చేస్తే....!! బావుంటుంది కదూ...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

మాలా కుమార్ చెప్పారు...

మార్పులు సహజం కదా మంజూ . ఎప్పటికప్పుడు అందరూ మా కాలం లో ఇలా లేదు అనుకుంటూ వుంటారు . మా ముత్తాతగారు ఐదు రూపాయలకు పెద్ద బవంతి కట్టి , వూరందరి కీ భోజనాలు పెట్టారట . మనం అసలు అది వూహించగలమా :)అంతే కాలం తో పాటు మనమూ జరగాల్సిందే . పాత మధురస్మృతులు నెమరు వేసుకోవాల్సిందే :)

చెప్పాలంటే...... చెప్పారు...

అవును మాలా గారు మీరు చెప్పింది నిజమే గత స్మృతులు గుర్తుకు తెచ్చుకోవడం తప్ప ఏమి చేయలేక పోతున్నాము కాలం తో పాటుగా మనము పరుగెత్తి పోవడం తోనే సరి పోతోంది :) థాంక్యు అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner