నువ్వు వస్తావని చెప్తున్నా....
నమ్మలేక ఎప్పుడో ఆలస్యంగా
వస్తావులే అనుకుంటే....!!
ఇంతలోనే.....
గబ గబా హోరు గాలితో వచ్చి
జల జలా ముత్యాల జల్లులు కురిపించి
గ్రీష్మ తాపాన్ని చల్లార్చి
మల్లెల మత్తులో ఉండగానే.....
చల్లని పైరగాలి పిల్లతెమ్మెరలా
పలకరించి చటుక్కున మాయమయ్యావు.....!!
కాలం కాని కాలంలో
రాకూడని సమయంలో
అనుకోని అతిధిలా వచ్చి
ఆహ్లాదపు జల్లులు కురిపించి
అంతలోనే మాయమై పోతే...!!
నువ్వు వచ్చావనుకోవాలా....!!
వచ్చి వెళ్ళావనుకోవాలా....!!
ఇలా వచ్చి అలా వెళిపోతే....!!
ఎలా చెప్పు వర్ష తుషార నేస్తమా....!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
రాకూడని సమయంలో వచ్చిన అతిధి ఎంతగా ఇబ్బంది కల్గిస్తాడో , మీ వర్ష తుషార నేస్తం కూడా అంతే కదా !
అవును శర్మ గారు అందుకే అన్నది రాకూడని....వేళ కాని వేళలో వచ్చిన వర్షం ఆహ్లాదం తో పాటు బాధని కలిగించినది..... ధన్యవాదాలు మీకు
:) Thank u Siva
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి