23, జూన్ 2013, ఆదివారం

అంకెల గారడీలే....!!

నా లెక్కల పుస్తకంలో ఎటు చూసినా
అంకెల గారడీలే....!!
కూడికలు తీసివేతలు ఎన్ని వేసినా
ఎక్కాలు ఎన్ని పైనుండి కిందకు
కిందనుండి పైకి వల్లే వేసినా
గుణకారాల్లోను కుదింపులే
భాగాహారాల్లోను శేషాలే...!!
గజిబిజి గందరగోళంలోలా
ఎక్స్  వై లతో గారడీలు
రేఖలతో అడ్డదిడ్డంగా గీతలు కొన్ని
చతురస్త్ర దీర్ఘ చరురస్త్ర ఇతర ఆకారాల్లో
వృత్త  పరిధిలో ఇమిడి ఇమడని
మనసులతో సరిపెట్టుకుంటూ....
అంక గణితాలతో అంకాలుగా
అర్ధ గణితంతో ఆద్రంగా
ఆటలాడుతూ అలా అలా
అంతు చిక్కని సున్నాలా....!!


2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

nagarani yerra చెప్పారు...

గుండె గాభరా పెట్టే ఆ గతాన్ని ఎందుకండీ బాబూ గుర్తు చేస్తారు ?లెక్కలంటే బాగా ఇష్టమాండీ!

చెప్పాలంటే...... చెప్పారు...

అవును అంది బాగా ఇష్టం నాకు -:) చూసారా మళ్ళి ఒకసారి మీకు లెక్కలు గుర్తు చేసి భయపెట్టేసాను...ధన్యవాదాలు మీ స్పందనకు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner