తొలి తొలి పలుకుల తీయదనం
అమ్మకు తెలిసిన చందమే....!!
చిరు చిరు జల్లుల చిత్తడి పుత్తడి
బుడి బుడి నడకల సవ్వడి ఆనందమే....!!
జోరువానల హోరుగాలి
పరుగులెత్తే పరువాల నయగారమే...!!
సప్త స్వరాల స్వరూపమే
సప్త వర్ణాల హరివిల్లు....!!
వడగళ్ళ వాతలు పిడుగుపాటులు
బతుకు నేర్పే పాఠాలు....!!
వాయుగుండాల వాయువేగం
చక్రాల సుడుగుండాలు....
అనుకోని అవాంతరాలే....
జీవిత కాలగమనంలో....!!
చిటపట చినుకుల వాన.....
చెప్పావు బతుకు పయనాన్ని....!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
chala bagundandi
చెప్పావు అందంగా మన బతుకు పయన వైనాన్ని .
Thank u Ramesh garu
ధన్యవాదాలు శర్మగారు :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి