24, జులై 2013, బుధవారం

ఒంటరితనంలో ఏకాకి.....!!

మనం ఎదుటి వారికి ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది కొన్ని సార్లు...అన్ని సార్లు కాదండోయ్ మళ్ళి పొరపాటు
పడకండి...అపాత్ర దానం అనేది ఒకటుంది అది చేస్తే మాత్రం మనకు వచ్చేది ఇచ్చిన దానికి వ్యతిరేకం మాత్రమే..దానిలో ఎటువంటి పొరపాటు లేదు. మనం కోపాన్ని చూపిస్తే కోపమే మనకు తిరిగి సమాధానంగా వస్తుంది....కాని  గాంధి గారిలా శాంతం మనకు దొరకదు. కొంత మందికి పిన్న వయసులోనే పెద్ద మనసు ఉంటే కొందరు ఎన్నో అనుభవాలను జీవితపు ఆటుపోట్లను చూసిన పండు వయసులోకూడా కోపతాపాలు చిరాకులు చిందులు వగైరా వేస్తూ ఉంటారు....అది ఎందుకో తెలియని అభద్రతా భావం అనిపిస్తూ ఉంటుంది....అందరూ  అనుకుంటున్నా ఇలాంటి ప్రవర్తనతో అందరికి దూరమౌతూ ఒంటరిగా ఉండటానికి అలవాటుపడి ఎవరి పొడ గిట్టకుండా ఒక్కరిగా బతకడానికి ఇష్టపడుతూ ఎవ్వరు చూడటం లేదని అనుకుంటూ అదో రకమైన భ్రమలో బతుకుతుంటారు....ప్రేమను అభిమానాన్ని పంచితే దానిలో కూడా ద్వేషాన్ని వెదుక్కుంటూ ఒంటరితనానికి తోడుగా ఏకాంతాన్ని తెచ్చుకున్నా అన్న భ్రమలో ఎవ్వరికి ఏమి కాని ఏకాకిలా మిగిలి పోతున్నామని అనుకోకుండా ఆ జీవితమే చాలా బావుంది అనుకునే మనస్తత్వాన్ని ఏమనుకోవాలి...?? మన జీవితం మన ఇష్ట ప్రకారమే ఉండాలి కాని కనీసం మన కోసం ఆలోచించే వారిని కష్ట పెట్టకుండా ఉంటే చాలు అనుకుంటే అందరి జీవితాలు హాయిగా ఉంటాయి. పిల్లలయినా పెద్దలయినా నేను అన్న అహం వదలి మేము అన్న అనుబంధం పెంచుకుంటే జీవిత అనుబంధం అందంగా ఉంటుంది...తరువాతి తరాలకు ఆదర్శంగా ఉంటుంది.....!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Padmarpita చెప్పారు...

పిల్లలయినా పెద్దలయినా నేను అన్న అహం వదలి మేము అన్న అనుబంధం పెంచుకుంటే జీవిత అనుబంధం అందంగా ఉంటుంది...తరువాతి తరాలకు ఆదర్శంగా ఉంటుంది.....!!ఆణిముత్యాలు.

surya prakash apkari చెప్పారు...

కొందరు మానసికంగా ఎల్లప్పుడూ ఒంటరితనాన్ని అనుభవిస్తారు-అందరూ ఉన్నా ఎవ్వరూ లేనట్లు అభద్రతా భావాన్ని feel అవుతుంటారు!అదొక మానసిక రుగ్మత!ఎవరినీ నమ్మరు,ఎవరితోనూ తమ బాధలు పంచుకోరు!నన్ను ముట్టుకోకు నామాల కాకీ అన్నట్లుంటారు!వారు మారడానికి సిద్ధంగా ఉండరు!మంచి టపా రచించారు!

చెప్పాలంటే...... చెప్పారు...

పద్మార్పిత గారు, ప్రకాష్ గారు మీ మంచి ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner