మత్తుగా ఊగుతు మరిపిస్తూ మురిపిస్తూ....!!
సేద దీరే మదిలో ఎన్నెన్ని తలపులో....!!
మనసు ముంగిట ఎదురు చూస్తూ...!!
ఉసులాడే జాబిలిని చుక్కలతో సరాగాలు చూసి
మబ్బుల్లో దాగున్న మేఘాలు అలిగాయి....!!
మాట రాని మది తలపులు ఎద వాకిట చేరి....
మౌన రాగాలు మనసు తరంగాలుగా....
నిను తాకడంలేదూ....!! నీకు తెలియడం లేదా...!!
నీ రాకను తెలిపే అలికిడి నను చేరింది మరి....!!
నను చేరిన నువ్వు నాకు తెలుసు...
మరి నేనెందుకు నీకు దూరం....!!
నువ్వెందుకు నాకు చేరువలో.....!!
( అన్నట్టు నేను ఓ రెండు వందల కవితలు రాసేసానండోయ్.....ఇది నా రెండు వందల ఒకటో కవిత....-:) )
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
congrats manju garu , idi 475 th post
Thank u Sivaa
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి