17, నవంబర్ 2017, శుక్రవారం

చేజారిన చేవ్రాలు....!!

కన్నీరింకిన కనుదోయి
కలత పడుతున్న మనసు
కల'వరాల' నడుమ ఊగిసలాడుతున్నాయి 

అపసవ్యపు జీవితాలు
అర్ధాంతరపు బతుకులు
అడ్డదిడ్డంగా అడుగులేస్తూ తడబడుతున్నాయి

పరుగులెత్తే క్షణాల కాలం
మరచిన గతాల గురుతులు
మరలనివ్వని గుండె సవ్వడులైనాయి

చేజారిన చేవ్రాలు వెక్కిరిస్తూ
వీడని చిక్కుముళ్ళైన వాస్తవాన్ని
వద్దని వారిస్తూ వాపోతోంది...!! 

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

ప్చ్

Ramakrishna Gali చెప్పారు...

చెక్కిళ్ళ పై జారిన కన్నీరు
మసనును ముత్యం లా కడిగి
ఆత్మ విశ్వాసం నింపుతోంది

Ramakrishna Gali చెప్పారు...

Just added above lines to end with confidence

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner