1. మనసు బాధను మాయం చేస్తున్నా_మౌనగానాన్ని ఆలపిస్తూ...!!
2. దైవమూ చిన్నబోతోంది_మానవత్వం మరచిన మనుష్యులను చూస్తూ..!!
3. మనసు విప్పే గుట్టులెన్నో_మౌనం మాటాడితే..!!
4. అనురాగాక్షతలు ఆశీర్వదిస్తున్నాయి_నవ్వుల సందళ్ళ నడుమ...!!
5. మనసు చెప్పని సంగతులెన్నో_ఘనీభవించిన అనుభవసారాల్లో...!!
6. మనసు సున్నితమే_మాటలే కఠినం..!!
7. తరగని పెన్నిధి_తలపుల సందడి..!!
8. కన్నీళ్లు తీర్చే బరువులెన్నో_మది భారాన్ని తగ్గిస్తూ... !!
9. నవ్విన కాలమే నగుబాటైంది_ఋతువుల అందాలు తిలకించి...!!
10. కలవరాలన్నీ కనుమాయం_ఆనందభాష్పాలు ఆదరిస్తుంటే...!!
11. ఎదురుచూపుల ఎదలు నిండాయి_కలలు వరాలై కనువిందు చేస్తుంటే...!!
12. మౌనానికి మెాహమాటం_మాట్లాడితే ఎవరేమనుకుంటారోనని...!!
13. సమన్వయమెుక్కటి చాలదూ_సామరస్యంగా బ్రతకడానికి...!!
14. నినదించని వేదనలెన్నో_మౌనమైన మదిలో...!!
15. గుప్పెడక్షరాలను గుట్టగా పోశా_నీ పేరే రాస్తాయని తలచి...!!
16. అప్పు రేపటికని వాయిదా వేయమన్నా_మరో గుప్పెడక్షరాలను ఏరేద్దామని..!!
17. నీవే నా భావాలకు అల్లిక_అక్షరాలను అందంగా అమర్చుతూ...!!
18. రాగద్వేషాలకతీతం_ఆత్మానందం పరమానందమైనప్పుడు...!!
19. చిక్కిన ఓ చుక్క మేలిముత్యమై మెరిసింది_నీ చెలిమి గూటికి చేరినందుకేమెా..!!
20. నీ కరుకైన మనసుకు సాక్ష్యాలుగా_చెదరని శిలాక్షరాలై నిలిచాయి..!!
21. శూన్యాన్నీ అలంకరించాయి_భావాక్షర నక్షత్రాలు..!!
22. మౌనమే రక్ష_సమస్యల చట్రం నుండి బయట పడటానికి... !!
23. ఎన్నిసార్లు చదివినా కొత్తదనమే_జీవిత పుస్తకం అయినందుకేమెా...!!
24. స్మృతుల శకలాలే అన్నీ_మృత్యునినాదాలై వెంటబడుతూ...!!
25. మనసు మౌనాన్ని వింటున్నా_గుప్పెడు గుండెను అక్షరాల్లో అమరుస్తూ... !!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి