30, మార్చి 2010, మంగళవారం

ఓ సంఘటన

ఉదయవాణి అని ఒక ఆవిడ గురించి కొద్దిగా చెప్పాలి...నేను కెంటకి లో పని చేసేటప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చికాగో నుంచి ఫోన్ చేసి ఈవిడకి జాబు కావాలి ఒక సారి ఫోన్ చేసి మాట్లాడమంటే...అలా పరిచయం ఐంది. ఆవిడ పని చేసిన ప్లేస్ లో అంతకు ముందు నేను కుడా పని చేశాను జాబు లేని టైం లో. వాళ్ళు చాలా డబ్బులు ఎగ్గొట్టారు చాలా మందికి, నాకు కుడా అనుకోండి..సరే అసలు విషయానికి వస్తాను వాణి ని నా దగ్గరకు రమ్మని చెప్పి నేను నా ఫ్రెండ్ పని చేసే షాప్ లో మా టైమ్ తగ్గించుకుని తనకి కొన్ని అవర్స్ ఇచ్చి మాతోనే వుంచుకున్నాము.తరువాత వేరే జాబు చూసి తెలిసిన వాళ్ళ దగ్గరకు పంపాను అక్కడినుంచి కుడా తరువాత రెండు మూడు జాబ్స్ మారింది అన్ని మేము చూసినవే. మేము అలబామా లో హంట్సవిల్ వచ్చేసాము. వాణిని అట్లాంటా లో షాప్ లో పెట్టాము. రోజు ఫోన్లు చేసి గొడవ పని చేయలేక పోతున్నాను ఏదోఒకటి అంటున్నారు అని నాకు అప్పుడు డెలివరి టైం.మేము మా ఫ్రెండ్ అమ్మ నాన్న మా బాబు ఇంతమందిమి వున్నాము చాలా కష్టం గా వుంది ఆ టైం లో ఒక్క డాలర్ లేని పరిస్థితి. ఇవిడ కుడా వచ్చి మాతోనే వుంది ఈయన చేసే షాపు లో తనకి ఈయన కొన్ని అవర్స్ ఇచ్చారు . మాకేమో వాళ్ళ ఆయన చనిపోయారని బాబు ఇండియాలో ఉన్నాడని హెచ్ 4 కుడా అయిపోయిందని అత్తగారు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారని ఆస్తి ఇవ్వలేదని ఇలా చాలా రకాలు చెప్పింది. అన్ని నిజమేనని నమ్మి ఇంట్లో ఉంచుకుని జాబు చూపిస్తే మా మీద బయటి వాళ్ళకు చెప్పడం మొదలు పెట్టింది. కాని ఆ ఊరిలో అందరికి మేమేంటో బాగా తెలుసు. తరువాత మా దగ్గర నుంచి వేరే వూరు వెళ్ళింది డబ్బులు చాలడం లేదు అని, వెళ్లినంక తెలిసింది మాకు ఈవిడ సంగతి. తరువాత అక్కడ పని చేసే షాపు ఓనర్ ని పెళ్లి చేసుకుందని తెలిసింది. తప్పు లేదు చేసుకుంటే నేను చాలా సార్లు అడిగాను మా పక్కన వుండే అంకుల్ కి కుడా చెప్పాను ఎవరైనా వుంటే చూడండి అని. చాలా చాలా అందిలెండి పెళ్లి చేసుకో అంటే. ఇలా చెప్తూ పొతే ఇదో భారతం అవుతుంది. అందుకే తొందరగా ఎవరిని నమ్మవద్దు అని నా అనుభవం తో చెప్తున్నాను ఇది ఒక్కటే కాదు ఇలాంటివి చాలా చూసాను నా జీవితం లో ...

29, మార్చి 2010, సోమవారం

తొలి వందనం

జల జల జాలువారే జలపాతంలా..
గల గల పారే గోదారిలా..
వయ్యారం గా హొయలు పోయే కృష్ణమ్మలా..
ఉరుకుల పరుగుల గంగమ్మలా..
మధుర మంజీర నాదాల మందాకినిలా..
విశ్వనాధుని కిన్నెరసానిలా..
నండూరి ఎంకిలా..
కృష్ణశాస్త్రి కవితలా.. కావ్య నాయికలా...
ప్రతి రోజు కనిపించే ఓ ప్రకృతి కాంతా!! నీకిదే నా తొలి వందనం!!

26, మార్చి 2010, శుక్రవారం

అభినందనలు


అందుకోండి మా హృదయపూర్వక అభినందనలు జ్యోతి గారు ..
ఏదో బ్లాగ్ ఐతే మొదలు పెట్టాను కాని అంతబాగా రాయడం రాదు ఏమి చేయాలి అని అనిపించినది రాస్తువుంటే ఒకరోజు కూడలిలో జ్యోతి గారి పోస్ట్ చూసాను మహిళా బ్లాగర్లు మెయిల్ పెట్టమని...పెట్టాను వెంటనే తిరుగు టపా వచ్చింది నన్ను కుడా ప్రమదావనం లో చేర్చుతునట్లు..ఇక ప్రమదావనంలో పరిచయంలో నా బ్లాగు గురించి చెప్తే చూసి సలహాలు ఇచ్చారు.. అలా నా రాతకోతలు నడుస్తున్నాయి.అప్పుడప్పుడు సుజ్జి పలకరింపులు...నా బ్లాగు పేరు తన బ్లాగు పేరు ఇంకా ఇద్దరు ముగ్గురి బ్లాగు పేర్లు ఒకలా వున్నై మీ బ్లాగు పేరు మార్చండి అని...పేరు మార్చాను...ఇదీ నా అడుగు బ్లాగు లోకంలో...
నాకు తెలిసిన ఒక ఆవిడని బ్లాగు చూసి చెప్పండి ఎలా వుందో అంటే టైంపాస్ కి పర్వాలేదు బానే వుంది అంది...కొద్దిగా బాధ వేసింది...అయినా జ్యోతి గారు అన్నట్లు మన ఇష్టం మన బ్లాగు కదా!! నచ్చితే చదువుతారు లేక పొతే లేదు ....
థాంక్ యు జ్యోతి గారు మరియు సుజ్జి...

కలుషితమైంది పర్యావరణమా!! మనమా!!

పర్యావరణం కలుషితం ఐంది అనుకున్నా ఇన్ని రోజులు.......కాని అది పర్యావరణం మాత్రమే కాదు మానవ సంబంధాలు అన్ని కుడా కాలుష్యం తో నిండుకున్నాయి ఈ రోజు.... పర్యావరణ కాలుష్యానికి మనిషి, మనిషి మనుగడ కారణమైతే బంధాలు, అనుబంధాలు కల్మషమైపోడానికి ప్రధాన కారణం డబ్బు...కాదంటారా!! మనలోని ప్రతి ఒక్కరికి ఇది తెలుసు ఐనా మనం ఎంతవరకు నిజాయితిగా ఉండగలుగుతున్నాం? ప్రతి ఒక్కరికి స్వార్ధం వుండాలి కాదని అనడం లేదు కాని ఎదుటివారి శవాల పై నుంచి మనం సింహాసనం ఎక్కాలనుకోడం ఎంతవరకు సమంజసం?? మనం బాగుండటం కోసం అమ్మ, నాన్న అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, స్నేహితుడు ఇలా ఏ బంధమైనా మర్చిపోయి, ఎదుటివాడు  వారు చేసిన సాయాన్ని కుడా మన మనసు లోనుంచి తుడిచేసి ఎవరు ఎలా పొతే నాకెందుకు? నేను బాగున్నా అది చాలు అనుకుంటే సరిపోతుందా!!
అన్ని జన్మలలోకి మానవజన్మ ఉత్తమమైనది అని వేద శాస్త్రాలు ఘోషిస్తున్నా.....ఉత్కృష్ణమైన మానవజన్మని, ఈ నాటి మనిషి తీరుని కళ్ళకుకట్టినట్లు అతి హేయం గా సభ్య సమాజం సిగ్గు పడేలా ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్నో సంఘటనలు ఋజువు చేస్తున్నాయి. ఇదా ఈ నాటి నాగరికత? ఇదా మన జన్మకు సార్ధకత?
ఎంతో అందమైన ప్రకృతిలో మనము భాగస్వాములం అయినందుకు గర్వపడుతూ తలెత్తుకుని సగర్వంగా నిర్మలంగా నిజాయితిగా ఈ సృష్టి లో మమేకమవడానికి ప్రయత్నిద్దాం!!

24, మార్చి 2010, బుధవారం

శ్రీరామనవమి



అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు....

23, మార్చి 2010, మంగళవారం

హృదయస్పందన

అలలా అల్లరి చేస్తూ అలజడి రేపావు
ఊహలా చుట్టి ఊసులెన్నో చెప్పావు
కధలా కదలి స్పూర్తినిచ్చావు
నేనే
ఉన్న నా చిన్ని ప్రపంచం లోకి....  
నీకు నేనున్నానని ఆర్తితో ఆదుకున్నావు....
 అండగా నిలిచావు.. 
ఆత్మబలంతో ఏదైనా సాధించగలమన్న  
నమ్మకాన్ని, ధైర్యాన్ని నాకందించిన అమృతమూర్తీ......నీకిదే నా నివాళి !!!

18, మార్చి 2010, గురువారం

నీ తలపు

కలలో కదలాడే నీ రూపం

అల లా నన్ను తాకుతుంటే...
మదిలో మెదిలే నీ జ్ఞాపకం....
మరుజన్మలో కూడ పదిలం
అంటోంది నా హృదయం.

12, మార్చి 2010, శుక్రవారం

వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు


అందరికి వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు
కొద్ది గా ముందే చెప్పేస్తున్నాను ఏమి అనుకోకండి...

10, మార్చి 2010, బుధవారం

నిరీక్షణ...

నా ఆలోచనా తరంగాల అంతరంగం లోకి తొంగి చూస్తే...
నా స్వప్న లోకం లో....నా మనసు జ్ఞాపకాల లోపలి పేజిల్లోంచి...
నా ముందు కదలాడే కమ్మని కధలా మెదిలే...
నీ రూపం నాకెంతో అపురూపం!!
మలయమారుతాల హాయిని....ఆనందాన్ని... అనుభూతిని...ఆస్వాదిస్తూ..
సెలఏటి గలగలలో ...సాగే నండూరి ఎంకి పాటలా...
జల జల జాలువారే జలపాతాల జోరులా....
నాలో కదలాడే నీ భావనా తరంగాల సరిగమలు...
వేయి జన్మలకైనా నీవు నాతోనే వుంటావు అన్న ఊహతో.....
నీ రాకకై ఎదురుచూస్తూ వుంటాను నేస్తం.....

8, మార్చి 2010, సోమవారం

శుభాకాంక్షలు

మహిళలన్దరికి మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

4, మార్చి 2010, గురువారం

ఈ నాటి విద్యాసంస్థలు-వాటి పోకడలు

నిన్న జరిగిన ఒక సంఘటన ఈ టపా రాయడానికి కారణం ఐంది....ఇక విష్యానికి వస్తే ....
మా చిన్న వాడు ఫస్ట్ క్లాసు శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పటమటలంక లో చదువుతున్నాడు. మొన్ననే వాడు ఇంట్లో
బాగా గోల పెట్టి 200 పెట్టి జామెట్రిబాక్సు కొనుక్కున్నాడు.నిన్న స్కూల్ లో వాళ్ళ లెక్కల టీర్ వీడు పెన్సిల్ కింద పడిపొతే బాక్సులో పెట్టుకుంటుంటే ఆవిడ బాక్సు విసిరేసిందంట. అది ఒక పిల్లవాడికి కుడా తగిలిందంట. బాక్సు పనికి రాకుండా ముక్కలు ముక్కలు గా విరిగి పోయింది. వాడు ఇంటికి వచ్చి "అమ్మా కోపం వస్తే మిస్ నన్నుఒక దెబ్బ వేయవచ్చు కదా! లేదా తిట్టవచ్చు కదా! ఎందుకమ్మా ఇలా చేసింది " అని అడిగాడు.. దీనికి ఏమి సమాధానం చెప్పాలి? పిల్లలకు స్పూర్తినిచ్చేది టీచర్స్ కదా!! వీళ్ళే ఇలా చేస్తుంటే పిల్లలు మంచి నడవడి ఎలా నేర్చుకుంటారు? చదువు పుస్తకాలు చదివితే వస్తుంది లేదా బట్టి కొట్టి చదివిస్తే మార్కులు బోల్డు వస్తాయి, రాంకులు కుడా వస్తాయి, స్కూల్ కి పేరు డబ్బు రెండు వస్తాయి కాని ఒక టీచర్ సరిగా లేక పొతే వందల మంది విద్యార్ధులు పనికిరాకుండా పోతారు...మన కోపతాపాలు చిన్నపిల్లల మీద చూపడం కాదు.... మేము ప్రబుత్వ పాఠశాలలో చదువుకున్నాము కాని మా ఉపాద్యాయులు మాకు ఈ రోజు మార్గదర్శకం గా నిలిచారు...మేము ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా రోజుకి వాళ్లవల్లే ఇలా మంచి నడవడి, వ్యక్తిత్వం తో ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నాము...దయచేసి డబ్బు కోసం కాకుండా విద్యను , విద్వత్తును పిల్లలకు పంచి మీరు మేము మన దేశం గర్వపడేలా తీర్చిదిద్దటానికి మీ వంతు కృషిని మీరు చేయమని ప్రతి ఒక్క టీచర్ కి సవినయం గా మనవి చేస్తున్నాను....అన్యదా భావించకండి....ఇలా చెప్తున్నానని..
విద్యాదదాతి వినయం వినయాత్ యాతిపాత్రతాం
పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతః సుఖం
ఎంతో విలువైన విద్యనూ దాని వల్ల కలిగే మంచి చెడులను తెలిసిన ఉపాద్యాయులు విద్యార్ధులనునిర్లక్ష్యం చేయరని ఆసిస్తూ...
గురుబ్రమ్మ గురుర్విష్ణు గురుద్దేవోమహేస్వరహః
గురుసాక్షాత్ పరబ్రమ్మ తస్మైశ్రీ గురవేనమః ఇది మర్చిపోరని అనుకుంటూ...

3, మార్చి 2010, బుధవారం

వేదన....!!

మనసు మూగగా రోదిస్తోంది...
నీ మౌనం నాతొ ఎందుకో తెలియక....
నా కంటినుంచి జాలువారే కన్నీరు అడుగుతోంది 
ఎందుకిలా ఈ వేదన అని?
మాటలకు కోటి భాష్యాలు చెప్పగలను కానీ.....
నీ మౌనానికి కారణం ఏమిటో తెలియక 
మూగబోయింది నా మది...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner