కబు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కబు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, ఏప్రిల్ 2026, శనివారం

మధుర క్షణాలు..!!



ఆత్మీయుల రాకతో మనసు చెప్పలేని సంతోషాన్ని సొంతం చేసుకుంది..

మనఃపూర్వక ధన్యవాదాలు రామానుజం పట్నాయక్ మాస్టారు 🙏. 

       చిన్నప్పటి పరిచయమైనా..మణి అక్కా, మధు బావగారు మరొసారి కలిపిన బంధం. అక్షరాలతో ఆత్మబంధువులుగా మారిన క్షణాలు. మౌర్య వాళ్ళ పట్నాయక్ సర్ తో కలిసిన మరొ అనుబంధం. వెరసి ఈరోజిలా చెప్పలేని సంతసాన్ని అందించింది మీ రాక…🙏

7, మార్చి 2026, శనివారం

నిజం..!!

 కొన్ని అబద్ధాలను

నిజమని నమ్మేస్తాం..


ఎందుకంటే 

అప్పటికి ఆ అబద్ధాలే

బావుంటాయి కాబట్టి..!!

26, జనవరి 2026, సోమవారం

పద్మభూషణుడు “నోరి దత్తాత్రేయుడు”


 పద్మభూషణుడు “నోరి దత్తాత్రేయుడు” గారికి హృదయపూర్వక అభినందనలు.


                ” కాన్సర్ వైద్యరంగంలో అగ్రగణ్యుడు మన తెలుగువాడు నోరి “


       వైద్యో నారాయణో హరిః అన్న మన భారతీయ ఆర్యోక్తికి నిలవెత్తు నిదర్శనం డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు. మన ప్రాచీన వైద్యవిద్యకు ధన్వంతరి మూలపురుషుడైతే, మెుట్టమెుదటి శస్త్రచికిత్సను చేసిన వైద్యుడు శుశ్రుతుడు. ఆ శుశ్రుతనికి ఏమాత్రం తీసిపోని విధంగా కాన్సర్ గురించి ప్రపంచమంతా భయపడే తరుణంలో తనదైన వైద్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో ప్రాణదానం చేసిన దేవుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు. 

        దత్తాత్రేయ గారిది కృష్ణాజిల్లా లోని తోట్లవల్లూరు. పుట్టింది మంటాడలో. సత్యనారాయణ, కనకదుర్గమ్మ గార్ల ఆఖరి సంతానం. తండ్రి ఉపాధ్యాయుడు. దత్తాత్రేయ గారి వయసు నాలుగు సంత్సరాలప్పుడు తండ్రి కురుమద్దాలి శ్రీరామ అవధూత పిచ్చెమ్మ ఆశ్రమంలో ప్రవచనాలు చెప్తూ, ప్రమాదవశాత్తు మరణించారు. తనకున్న కొద్దిపాటి పొలాన్ని ఆశ్రమానికే ఇచ్చేసారు.ప్రవచనాలు చెబితే వచ్చే డబ్బు కూడా ఆయన ఆశ్రమానికే ఇచ్చేవారు. ఆయన మరణానంతరం పిల్లల ఉన్నతి కోసం ఆ తల్లి పడని కష్టం లేదు. దత్తాత్రేయ గారి పరీక్ష ఫీజు కట్టడానికి తల్లి గాజులు అమ్మి ఫీజు డబ్బులు ఇచ్చారు. 

    దత్తాత్రేయ గారు ఉస్మానియాలో అంకాలజీలో పరిశోధనా విద్యార్థిగా ఉన్నప్పుడు, ఓ అంతర్జాతీయ సదస్సుకు అమెరికా నుండి వచ్చిన వైద్యబృందానికి సహాయకుడిగా నియమించారు. ఆ సమయంలో వీరిలోని కొత్త విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాసను కనిపెట్టి ఓ పెద్దాయన తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అమెరికా వచ్చినప్పుడు కలవమన్నారట. చదువు పూర్తయిన తర్వాత ఇండియా , అమెరికాలలో చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరిగా తనకు విజిట్ంగ్ కార్డ్ ఇచ్చినాయనను వెదుక్కుంటూ స్లోన్ కెటరింగ్ మెమోరియల్ కేన్సర్ సెంటర్ కి వెళితే, అక్కడ కూడా ఫెలోషిప్ ఎంపికలు అయిపోయాయని, ఎవరైనా రాకపోతే సీట్ ఇస్తామన్నారట. మంచి మనసుకు దైవం సహకరిస్తుందనడానికి నిదర్శనంగా వీరికి సీట్ లభించడమే కాకుండా, అంచెలంచెలుగా ఎదిగి తనకు విజిటింగ్ కార్డ్ ఇచ్చిన పెద్దాయన చైర్మన్ పదవినే చేపట్టారు. 

       ప్రపంచం గుర్తుంచుకునే శాస్త్రవేత్తగా కాన్సర్ వైద్యంలో రోగికి సురక్షితమైన రేడియేషన్ యంత్రాన్ని కనిపెట్టారు. ఈనాడు ప్రపంచమంతటా కాన్సర్ రేడియేషన్ లో ఈ పరికరాన్నే వాడుతున్నారు. కాన్సర్ కి కారణాలను కనుగొనడానికి, అరికట్టడానికి ఎన్నో పరిశోధనలు చేసి ఎందరికో ప్రాణదానం చేసారు. వీరి వైద్యసేవలు ప్రపంచమంతటా విస్తరించాయి. ఎందరో సినీ,రాజకీయ ప్రముఖులకు వీరు తన వైద్య సేవలను అందించారు. లెక్కకు మించిన ధనం సంపాదించడం తన చేతిలోని పనే అయినా, ప్రముఖులు ఇవ్వబోయిన ధనాన్ని సైతం సున్నితంగా తిరస్కరించారు. బసవతారకరామారావు మెమోరియల్ కాన్సర్ ఫౌండేషన్ పాలకవర్గంతో కలిసి పనిచేసారు. అన్నింటికన్నా ముఖ్యమైనది తనింతటివాడు కావడానికి కారణమైన స్లోన్ కెటరింగ్ మెమోరియల్ వ్యవస్థాపకుడికి చర్మ కాన్సర్ వస్తే, తన వైద్యంతో ఆయనను బ్రతికించి ఓ వైద్యునిగా గెలిచారు. 

        

      ఇన్నేళ్ళ కేన్సర్ పరిశోధనలకు, వైద్యసేవలకు దక్కాల్సిన అన్ని పురస్కారాలు ఆయనను వరించాయి. పేదరికం ఉన్నత ఆశయానికి అడ్డంకి కాదని డాక్టర్ నోరి దత్తాత్రేయ గారి జీవితం నిరూపిస్తోంది. అత్యున్నత వ్యక్తిత్వం, సేవానిరతి మెండుగా గల వీరి జీవితం యువతకు స్పూర్తిదాయకం. వీరి ఆత్మకథ “ ఒదిగిన కాలం “ లో ఎన్నో విషయాలను పొందుపరిచారు. “ కదిలే కేన్సర్ ఆసుపత్రి “ని నిర్మించి వైద్యసేవలు అందించాలన్న సదాశయం, కేన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్న పుస్తకంలో అనేక విషయాలను తెలుగువాళ్ళతో పంచుకోవాలని పుస్తకం రాయడానికి పూనుకున్నారు. వీరి భార్యాకూతురు కూడా డాక్టర్‌లే. కొడుకు లాయర్. 

      వైద్య శాస్త్రవేత్తగా అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వస్తూ అమ్మకు తన మెుదటి జీతంతో బంగారు గాజులు కొని తెచ్చారట. మన తెలుగువాడి ఘనతను యావత్ ప్రపంచమే కీర్తిస్తోంది ఈనాడు. ప్రపంచాన్ని నడిపే కనబడని శక్తిని దైవమని నమ్మే వ్యక్తి, నిలువెత్తు మానవతామూర్తి, శిరిడిసాయి భక్తుడు అయిన డాక్టర్ నోరి దత్తాత్రేయ గారిని కృష్ణా డిస్ట్రిట్ లారి ఓనర్స్ ఫౌండేషన్ తరపున ఈ చిరు సత్కారం చేయడం శ్రీకృష్ణడికి అటుకులిచ్చిన కుచేలుడిలా భావిస్తూ నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఈ సదవకాశానికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

25, మే 2025, ఆదివారం

అరుదైన సంఘటనలు..!!



 

    నన్ను గుర్తుపట్టావా! అన్న అరుణా టీచర్ గారు, నేను తెలుసా! ఫేస్ బుక్ లో చూస్తుంటాను నీవి అన్న పద్మా టీచర్ గారు , జనని టీచర్ గారు ఇలా మా శిశువిద్యామందిరం అవనిగడ్డ టీచర్లు అందరు మా శ్రీలతా టీచర్ గారి మనుమడి ఉయ్యాల వేడుకలో విజయవాడలో కలవడం చాలా చాలా సంతోషం. నా ఉగాది పురస్కారాన్ని గుర్తు చేస్తూ ఏం చెప్పావు చంద్రబాబుగారి చెవిలో అంటూ..సరదాగా పలకరించిన పలకరింపులు ఈరోజు బోలెడు సంతోషాన్ని పంచాయి.

       ఎప్పుడో చిన్నప్పుడు 2నుండి6 వరకు చదివిన స్కూల్ టీచర్లు మనల్ని గుర్తుంచుకోవడం, అప్పటి అల్లరిని తలుచుకోవడం నిజంగా గొప్ప విషయమే నాకయితే. మనం గుర్తుంచుకోవడం సహజమే..కొన్ని వేల మందికి పాఠాలు చెప్పిన గురువులు మనల్ని ఇన్నేళ్ళ తరువాత కూడా ఆ అల్లరిని, పరుగులను, నవ్వులను గుర్తు చేయడం అన్నది మరపురాని మధురమైన సందర్భమే నాకు.

23, ఏప్రిల్ 2025, బుధవారం

ఈరోజు ఈనాడులో..

 ఈరోజు ఈనాడు వసుంధరలో నా గురించి చిన్న ఆర్టికల్.

ప్రచురించిన ఈనాడు యాజమాన్యానికి, ఛత్రపతి గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.



5, ఏప్రిల్ 2025, శనివారం

ధన్యవాదాలు..!!

 మీ ఆత్మీయ సత్కారానికి మనఃపూర్వక ధన్యవాదాలు సోదరా..!!


3, డిసెంబర్ 2024, మంగళవారం

జీవన మంజూష ఆవిష్కరణ..!

 జీవన మంజూష ఆవిష్కరణ వివరాలను ఈ నెల నవమల్లెతీగలో ప్రచురించిన సంపాదకులకు, ఆవిష్కరణకు విచ్చేసిన పెద్దలకు, ఆత్మీయులకు మనఃపూర్వక ధన్యవాదాలు.





Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner