19, డిసెంబర్ 2011, సోమవారం

ధన్యవాదాలు


మంచో చెడో నాకు అనిపించింది, నేను చూసింది రాసాను కాని ఇక్కడ భార్యభర్తల మద్యలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాదు. పంతాలకు పొతే ఎవరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో చెప్పాను. ఏ పాపం ఎరుగని పిల్లలు బలి అవుతున్నారు. తప్పు అమ్మాయిది కావచ్చు అబ్బాయిది కావచ్చు కాని ఆత్మగౌరవానికి అహంకారానికి వున్న చిన్న తేడా తెలుసుకుంటే కుటుంబం చక్కని ఆదర్శ కుటుంబంగా వుంటుంది. చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళు ప్రతి చోట వుంటారు వినే మనకే వుండాలి విచక్షణా జ్ఞానం . ప్రేమించినప్పుడు గుర్తు రాని గొప్పగుణాలు విడిపోవడానికి మాత్రం పెద్ద పెద్ద కారణాలుగా కనిపిస్తాయి. తప్పులు ఒప్ప్పులు ఇద్దరిలో వుంటాయి కాక పొతే మనం ఒప్పుకోవడంలోనే వుంటుంది. మీ ఇగోలకు పిల్లల్లని పావులుగా వాడుకోకండి.. అదే నేను చెప్పాలనుకున్నది. నా టపాకు స్పందించిన అందరికి పేరు పేరునా ధన్యవాదాలు

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

PALERU చెప్పారు...

ఆత్మగౌరవానికి అహంకారానికి వున్న చిన్న తేడా తెలుసుకుంటే కుటుంబం చక్కని ఆదర్శ కుటుంబంగా వుంటుంది"

ఈ టాపిక్ మీద మనం అంటే నేనన్నమాట...నా బ్లాగులో తరగతులు నిర్వహిస్తున్నాను......అందరు తోసుకుంటూ కాకుండా లైన్ గా వచ్చి కూర్చోండి....హిహిహి

నిజమే ఆ తేడా తెలుసుకోవాలి, కాని చాలా కష్టం.....

చెప్పాలంటే...... చెప్పారు...

:) thanks RAAFSUN GARU

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner