17, డిసెంబర్ 2011, శనివారం
అమ్మానాన్నలు - పిల్లలు మాత్రం అనాధలు.....!!
ఇద్దరు ఇష్టపడాలంటే ఆ ఇద్దరి ఇవ్టం, అంగీకారం సరిపోతుంది.....అదే ఆ ఇద్దరే విడిపోవాలంటే మాత్రం పంచాయితీలు, పెద్దలు, పోలీసులు ఇలా ఎంతో మంది కావాలి. కలిసి ఉండటానికి ఒక్క కారణము వెదుక్కోకుండా విడిపోవడానికి సవాలక్ష కారణాలు వెదుక్కునే ఆ జంట వాళ్ళ ఒకప్పటి ప్రేమకు ప్రతిరూపాలయిన పిల్లలని మాత్రం వీళ్ళ పంతాలకు పట్టుదలలకు బలి చేస్తూ ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. మరి వీళ్ళని శిక్షించడానికి ఏ చట్టం ఉంది? పసి వయసులో అమ్మానాన్నల ప్రేమలో పెరగాల్సిన సమయంలో రోజు పోట్లాటల మద్యన ఎప్పుడూ ఏమౌతుందో తెలియని అయోమయంలో భయం భయంగా గడిపే ఆ పసిమనసులకు ఆసరా ఎక్కడ?
ఒక్కసారి ఆలోచించండి విడిపోవడాని వంద కారణాలు వెదుక్కునే ముందు కలిసి ఉండటానికి ఒక్క కారణం వెదుక్కోండి....అది చాలు ఎంతోమంది పసి వాళ్ళు అమ్మానాన్నలు వుండి కూడా అనాధలు కాకుండా వుంటారు......
ఒక్కసారి ఆలోచించండి విడిపోవడాని వంద కారణాలు వెదుక్కునే ముందు కలిసి ఉండటానికి ఒక్క కారణం వెదుక్కోండి....అది చాలు ఎంతోమంది పసి వాళ్ళు అమ్మానాన్నలు వుండి కూడా అనాధలు కాకుండా వుంటారు......
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
10 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
హ్మ్.. బాగా చెప్పారు.
ఈ మధ్య నేను గమనిచింది..చూసింది ఒక విషయం పంచుకుందాం అనిపిస్తుంది మీ టపా చూస్తుంటే..
"అసలు ఒక పెళ్ళైన జంట విడిపోవడానికి కారణం ఏంటంటారు?"
ప్రతీసారి వేలు మొగవాడి వైపు వెళుతుంది ? వరకట్నం అనో ...వేరే సంబంధాలు అనో ....కనీసం 10 జంటలు విడిపోతే అందులో మగవారికి వ్యతిరేకం గా 9 ఉంటాయి అని అనుకుంటారు....సమాజం కూడా అదే నిజం అని పేపర్లలో టివిలలో ప్రసారం చేస్తుంది...పూర్వం భార్యలని భర్తలు తిట్టినా కొట్టిన కూడా విడాకులు అనే పదం వచెది కాదు..అది భయం వల్ల కానివ్వండి, గౌరవం వల్ల కానివ్వండి ..కాని ఈ రోజు మాకు స్వతంత్రం కావాలి అని గోలపెట్టి మొదటి మెట్టుగా ఆర్ధిక స్వతంత్రం లో భాగం గా జాబులు చేస్తూ మొగాడు, మొగుడు ఆంటే, కేవలం ఒక వ్యక్తీ నాతొ ఉండాలి అనుకునే వ్యక్తీ మాత్రమె , నేను సంపాదిస్తున్న తను కూడా.... నేను దేంట్లో తక్కువ ? అనే భావాలతో...మొగుడి మాటను వినని స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. ఇంకా ఈ భావపరాకాష్ట ఎక్కడిదాకా వెళ్ళింది ఆంటే నేను చెప్పినట్టే ఉండాలి , నేను చెప్పినట్టే చేయాలి అని అనేవరకు ..వినకపోతే, గృహహింస చట్టం, వరకట్న చట్టాల ప్రయోగం,
ఎ మనిషి కైనా తను మాత్రమె చేయగాలే కొన్ని పనులమీద కొంచెం గర్వం ఉంటుంది..అది ఆమోదయోగ్యమే ..ఎందుకంటే ఆ పని తను మాత్రమె చేయగలడు, అలాగే భర్త చేయగలిగిన పనులు అన్ని భార్య చేయలేదు, ఉదాహరణలు చాలా ఉంటాయి నేను ఇక్కడ ప్రస్తావించాను. భర్త తను మాత్రమె చేయగలిగే పనులు చేస్తాడు కాబట్టి భార్య మీద తన అధికారం ఉండాలి అనుకుంటాడు, ఆమోదయోగ్యం కూడా ....తత్ కుదరదు నువ్వు ఎంత గోప్పోడివి అయితే మాత్రం సమాజం నా వెనకాల ఉంది నువ్వు నాకు తలొగ్గి ఉండాల్సిందే ఆంటే అప్పుడు మొదలవుతుంది " విడాకులు" అనే పదం.అందరు అనుకున్నట్టు విడాకుల ద్వార ఎక్కువగా నష్ట పోయేది భార్య కాదు భర్తే ...అన్నివిధాల కూడా ....
ఏదేమైనా గాని పురుషాధిక్యం అనబడే పదం ఎప్పటి నుండో ఉంది కాని విడాకులు ఈ మధ్యనే ఎందుకు ఎక్కువయ్యి ఆంటే ! మేము నీకు ఈ మాత్రం తక్కువ కాదు అనే ఆడవారి వల్ల అని నా అభిప్రాయం, " ఆంటే నీ ఉద్దేశం లో ఆడవారు అణిగి ఉండాల్సిందే నా " అన్నారనుకోండి " అణిగి ఉండటం వేరు అనుకూలంగా ఉండటం వేరు " అని నా సమాధానం.....కాబట్టి మహిళలు భర్త కు అనుకూలంగా ఉండటం అలవర్చుకుంటే ..ఈ గొడవా ఉండదు ..
నేను పురుషాధిక్యం తో మాట్లాడుతున్న అనుకుంటున్నవారు నా కామెంట్ ని మళ్ళి చదవండి ,
:)
/భర్త తను మాత్రమె చేయగలిగే పనులు చేస్తాడు కాబట్టి భార్య మీద తన అధికారం ఉండాలి అనుకుంటాడు, ఆమోదయోగ్యం కూడా ./
RAAFSUN gaaru,
మీ ఆవిడ ఇ౦ట్లొనె ఉన్నారా :)
కాబట్టి మహిళలు భర్త కు అనుకూలంగా ఉండటం అలవర్చుకుంటే
Yes, this is 100% true,Well said Raafsun Gaaru.
Everyone has to make compromises not only love, but is companionship, friendship and understanding each other.
The moment you understand that things are not all that fine,
The first thing people need to stop doing is stop playing the blame game.
So as long as we believe that the cause is outside, we are never going to solve the problems. Look inwards, and in this lies, the solution to the problems we face.
But how many are willing to criticize themselves? Not many. If they cannot introspect, then they are going to suffer.
Time is thought to be the solution. If you look closely, time is not the one that solves the problem.
What happens is that you begin to see the same thing in a different light. Your perception of the problem changes. It is this change that usually solves the problem.
This is one aspect, which we are never taught in schools, and we never try to learn outside too.
I also think that kids play a vital role in avoiding divorce, as sometimes in conflicting situations between their parents, they cool down their parents and avoid divorce to happen. Thanks to these lovely kids who do that for saving their parents relationship and their own future.
Marriages are not like fairy tales.
కర్ణుడి చావుకి వంద కారణాలున్నట్లుగా ఈ విడాకులకి మాత్రం ఆడవారే ఎక్కువ కారణం అని నేనంటాను.
అమ్మల జోక్యం పెరిగిపోవడం.
ఒక్కరే సంతానం ఉండటం.
ప్రొద్దున్న పూట 10 గంటలకు మీరు బస్ ఎక్కితే అందరి ఆడవాళ్ళ చేతుల్లో సెల్ ఫోను... వాళ్ళ అమ్మలకి ఒకటే కంప్లైంట్లు, అందరూ వింటున్నారన్న ధ్యాస కూడా లేకుండా అత్తగారు డ్రైపర్లు సరిగ్గా మార్చటం లేదని వాళ్ళమ్మకి ఫిర్యాదు చేసే వారు ఒకరైతే, భర్త మీద ఫిర్యాదుతో ఒకరు.వాళ్ళ పిల్లలకి వారు చేసుకోడానికి వాళ్ళకి ఎందుకు అంత ఇబ్బందో అర్ధం కాదు.
పని ఒత్తిడి ఉన్నపుడు చేయగల పనులే ఎంచుకోవాలి. అలా అయితే మరి ఆత్మాభిమానం దెబ్బతినదూ. సమాన హక్కులు ఏమయిపోవాలి ?
ఎంతో కష్టపడి సాధించుకున్న 498A దుర్వినియోగమవుతున్న కేసులే అధికం.
ఇదివరకు మగవారు చాలా కఠినం గా ఉండేవారు, ఇప్పుడలా లేరు, చాలా కోఆపరేటివ్ గా ఉంటున్నారు. అయినా కూడా ఈ ఆడవాళ్ళకి సంతృప్తి లేదు.
ఉద్యోగాలు సంపాదించుకోవడం లో ఉన్న తెలివితేటలు సంసారం చక్కదిద్దుకోవడం లో ఉండటం లేదు.
ఎంతసేపూ వేలు ఎదుటివైపే !
పోనీ అక్కడైనా సరిగ్గా ఉంటున్నారా అంటే అక్కడ "తన్ హాయీ" లు నడిపేవారు కొందరైతే దానిని సమర్ధించేవారు కొందరు.
ఇక్కడే ఉన్న ఒక బ్లాగరు ఒకసారి ఒక పోస్టు వేసారు. వాళ్ళ అమ్మాయిని ఎవడో ప్రపోజ్ చేసాడట, వాడికి పిల్లలున్నారట ఉద్యోగం చేసే ఆడవాళ్ళంటే అంత అలుసా ?? అని ఆవేశం గా అడిగారు.
ఈ రోజుల్లో ఒక పెళ్ళాన్ని, ఒక కూతుర్ని/కొడుకుని చూసుకోడానికే చస్తున్నారు, వాడు ఇంకొకరికి ప్రపోజ్ చేసాడంటే ధైర్యవంతుడే అని చెప్పుకోవాలి.
ప్రపోజ్ చేయడం మగవాడి హక్కు, ఇష్టం లేకపోతే సున్నితంగా అక్కడే అతనితో చెప్పొచ్చు, అమ్మదాకా తీసుకుని రానవసరం లేదు. మగవాడితో పోటీ పడటం తెలిసినపుడు తనకి ధీటుగా సమాధానం చెప్పే నేర్పు కూడా తెలుసుకోవాలి. అతడేమీ తనకి పిల్లలు లేరని మోసం చేయలేదు కదా, ఉన్నారనే నిజం చెప్పాడు, నిజాయితీ గా అడిగాడు, పైకొకటి లోపల ఒకటి పెట్టుకుని నటించడం లేదు.
ఇదే బ్లాగర్ కి "తన్ హాయి" కౌశిక్ నచ్చాడు, కూతురికి ప్రపోజ్ చేసినవాడు నచ్చలేదు. ఎందుకో నాకు అర్ధం కాలేదు.
ఇటువంటి కూతురు తన సంసారం గురించి ఎన్ని కంప్లైంట్లు చేసి ఉంటుంది ?
పని ఒత్తిడి వల్ల కావచ్చు, మరి ఏ ఇతర కారణమైనా కావచ్చు ఆడవారికి సహనం అనేది కనపడటం లేదు.
ఈ రోజుల్లో కట్నం కూడా ఎవరూ తీసుకోవడం లేదు, అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వడం కూడా కష్టం అయిపోయాయి.
ఈ ఆడవారితో ఎలా నడుచుకోవాలో నేర్పడానికి ఇపుడు కౌన్సిలింగ్ అబ్బాయిలకే ఇవ్వాలేమో ????
పాతకాలంలో ఏమో నాకు తెలీదు కానీ, ఇప్పుడు మాత్రం సంసారాలు సర్వ నాశనం కవటనికి మొదటి రెండు కారణాలు, భార్య , ఆమె తల్లి అనేది నా అభిప్రాయం కూడా. ఈ మధ్య ప్రతి మూణ్ణెళ్ళ కొకసారి
ఒకమ్మాయి దగ్గరినించి (మా కమ్యూనిటీ లో ఉండేవాళ్ళే) ఒక సారి మా ఇంటికొస్తారా ఒక విషయంలో మీ సలహా కావాలి అని ఓ ఫొనె కాల్ తో మొదలౌతుంది . ఆ తర్వాత దగ్గరి మిత్రులతొ సలహాలు, సంప్రదింపులు..చివర్లో దాదాపు మా అందరికి అర్థమైంది ఏంటంటే..పైన చెప్పిందే.
మౌళి గారు,
అభిప్రాయాలని భయాలు కప్పెయకూడదు :) ఏమంటారు?
నీహారిక గారు,
మీ వివరణాత్మక అభిప్రాయం కేక....సమాజమే అలా ఉంది మార్చాల్సిన పని (మారల్సినది కుడా) మనది. ఏమంటారు?
పావని గారు .
మీరు చెప్పింది అక్షరాల నిజం....అందుకే మహిళలని గౌరవించాలి అంటే ..గౌరవించే విధంగా ప్రవర్తించాలి కదా...
@@@రాజ్యలక్ష్మి గారు,
టపా మీది ...గొడవ నాది..థాంక్స్ ఫర్ అల్లోవింగ్ అవర్ కామెంట్స్ అండి...
పెళ్ళి అనే వ్యవస్థ ఎంత త్వరగా పడిపోతే మగ వారికి అంత మంచిది. ఇటువంటి సంఘటనలు (విడాకుల సంఖ్య పెరిగే కొద్ది)జరిగేకొద్ది మగ వారికి, అది బాగా అర్థమౌతుంది. ఎదీ జరిగినా మన మేలుకే కనుక, ఈ విడాకుల సంఖ్య పెరగటం అనేది భవిషత్ లో మగ వారికి చాలా బాగా లాభిస్తుంది. మనదేశం లో పెళ్ళి అవసరం ప్రస్తుతం కాలంలో మగ వారికి లేదు. కాని వారికి ఆ విషయం తెలియదు. అతను చిన్నతనం నుండి విచక్షణ లేకుండా తల్లి దగ్గర, స్కుల్స్ లో పెంచబడ్డాడు. తల్లి చిన్నతనం నుంచి ఇంటి పేరు,కుటుంబ ప్రతిష్ట్ట, స్కుల్ లో కులం మొద|| భావాలతో నింపి పెట్టారు. ఎప్పుడైతే పెళ్ళి పేటాకులౌతుందో అప్పుడు వాడికి తల్లి, సమాజం లో చెప్పినవి అన్ని వట్టి కథలని అర్థమవ్వటమేకాక, తన తల్లి ఇన్నిరోజులు తాను ఊహించుకొన్నంత తెలివిగలది కాదని అర్థమౌతుంది. సమాజం ఎంత స్వార్ధ పారమైనదో అర్థమౌతుంది. దానితో పాటుగా పెళ్ళి విఫలమవ్వటం లో పెద్ద పాత్ర పోషించే అత్తగారి మీద, ఆడవారి స్వభావం మీద అన్నిటి మీద తన విచక్షణతో సమీక్షిస్తాడు. దెబ్బతిన్నపుడు అసలు తెలివి వికసిస్తుంది. తనకు పెళ్ళి ద్వారా పిల్లలు కావలను కోవటం అనేది అసలికి తనకొచ్చిన ఆలోచన కాదని. అది సమాజం మగ వాడి నెత్తిన రుద్దిన అయిడియా అని తెలిసి వస్తుంది. ఈ అనుభవాలను నలుగురితో పంచుకొంటె చాలు రానున్న రోజుల్లో ఎక్కువ మంది మవవారు పేళ్ళి చేసుకోరు. చేసుకొన్న తగిన జాగ్రత్తలు తీసుకొంటారు. మగవారు హాపిగా ఉంటారు. పేళ్లి లేకపోతే చేతి నిండా డబ్బులు, కావాలనుకున్న కలలు, కోరికలు అన్నితీర్చు కోవచ్చు. చేసుకొని కోర్టు చుట్టు తిరిగే కన్నా చేసుకోకుండా ఆ డబ్బులతో దేశ, విదేశాలు తిరగవచ్చు.
___________________________________
అసలికి ఆది నుంచి వివాహ మనేది మగ వారికి కలుగ చేసిన గొప్ప మేలు ఎమీ లేదు, పైపేచ్చు వారిని బలహీనులుగా చేస్తూ వచ్చింది. వంశం,వారసత్వం అనే ఆలోచనలను ప్రవేశపెట్టి వారిని అందులో మన పుర్వీకులు మగఋషులు ఇరికించారు. మగ వారు పెళ్ళి గురించి ఆలోచించటం మానేసి, ఆనందంగా జీవితాన్ని ఎలా గడపవచ్చో దానికి ఉన్న వివిధ మార్గాలు ఎమిటో తెలుసుకుంటే చాలు.
andarilo oka manchi aalochana rekittinchaaru
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి