ఆ మధ్యెప్పుడో నాకు ప్రతిఘటనలోని పాట గుర్తు వచ్చింది.. ఈ దుర్యోదన దుశ్శాసన ....కలియుగానికి ఆరవ వేదం కూడా చాలదేమో అనిపిస్తోంది.. ఈ వాట్స్ప్ లు ముఖ పుస్తకాలు వచ్చాక మనతో మనం గడిపే సమయం కూడా తగ్గిపోయినట్లుగా ఉంది.. సమయం, సందర్భం లేకుండా ఫ్రెండ్ అని ఆడ్ చేస్తే చాలు టాగ్ లు , గుడ్ మాణింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ... మధ్యలో ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా... పని ఏమి ఉండదో మరి ఏమో ...వయసుతో అస్సలు పనే ఉండదు .. ఇదో గోల అనుకుంటే ఈ యాప్ లతో ఒక గోల ... సరదాగా తీసుకోండి సరదా యాప్లని ... మనం అనే ఒక చిన్న మాట ఎదుటి వారిని ఎంతగా బాధ పెడుతుందో మాట అనే ముందు ఆలోచించండి.. ఈ ప్రపంచంలో అందరు ఏదో ఒక ఇబ్బందిలో ఉన్నవారే.. మనకు మనదే పెద్ద కష్టం కావచ్చు .. ఎప్పుడయినా మనకు మన బాధ్యతలు, ఈ జీవితంలో మనతో ముడి వేసుకున్న బంధాలు ముఖ్యం... వాటి తరువాతే ఏ ఇతర అనుబంధాలు అయినా.. సాధ్యమైనంత వరకు అందరిలో మంచినే చూద్దాం... ఈ సంవత్సరం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను వదలి వేయడానికి ప్రయత్నిస్తూ మరో అడుగు ముందుకు వేద్దాం...!!
30, డిసెంబర్ 2015, బుధవారం
మరో అడుగు ముందుకు వేద్దాం... !!
నేస్తం...

వర్గము
కబుర్లు
శుభాభినందనలు.... !
నా ఆత్మీయురాలు కాట్రగడ్డ భారతి గారు "వెన్నెల పుష్పాలు" కవితా సంపుటి ఆవిష్కరణ ... అదే రోజు సావిత్రి బాయి ఫూలే విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకుంటున్న శుభ సందర్భంగా ఇవే మా మనః పూర్వక శుభాభినందనలు....
మరెన్నో కవితా సంకలనాలు వెలువరిస్తూ .. వారి సమాజ సేవకు తగిన అవార్డులు.. రివార్డులు ... అందుకోవాలని కోరుకుంటూ.... రాబోయే సంవత్సరం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ...
ఆత్మీయ నేస్తం
మంజు

శుభాకాంక్షలు
28, డిసెంబర్ 2015, సోమవారం
వెనక్కు పంపడంలో అంతరార్ధం ఏమిటి..?
ఒకప్పుడు చదువుకోవడానికి వీసాలను ఇవ్వడం కష్టతరం చేసిన అమెరికా ఇప్పుడు వారి ఆర్ధిక వనరులను పెంచుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా అది మన భారత దేశంలో ఉన్నంత అమెరికా పై మోజును ఎలా సొమ్ము చేసుకుంటోందో.. ఇక్కడ వీసాలు ఇచ్చేటప్పుడు వారికి తెలియదా అవి మంచి యూనివర్సిటిలు అవునో కాదో ... వీసా ఇచ్చినట్టు ఇచ్చి అన్ని రకాలుగా డబ్బులు చేసుకుని వెనక్కు పంపడంలో అంతరార్ధం ఏమిటి..? తానా స్వేర్ లు పెద్దలు చాలా మంది చాలా సలహాలు సూచనలు ఇస్తున్నారు ... అవి అన్ని వీళ్ళ కన్నీళ్ళు తుడవవు అని వారికి తెలుసు .. ఇంతకూ ముందు కూడా ఒకప్పుడు F1 వీసాలు ఇవ్వకుండా నిబంధనలు కష్టతరం చేసారు అది ఒకరకం .. అక్కడకు వెళ్ళిన తరువాత వెనక్కు పంపడంలోఅమెరికా అంతరార్ధం ఏమిటి.. మన తెలుగు వాళ్లకు ఎంత చెప్పినా దూరపు కొండలు నునుపు ... నేను అక్కడ చూసిన చాలా చదువుల తరువాత వారు ఇప్పటికి కనీసం మంచి ఉద్యోగాలు చేయక వేరేగా స్థిరపడిపోయారు... నేను H 1 వీసా తో వెళ్ళాను .. నేను చాలా ఇబ్బందులు పడ్డాను మంచి కంపెని అని నమ్మి .. ఇక్కడ ఆ నిజాలు చెప్పేసాను అనుకోండి నామీద యుద్ధం ప్రకటిస్తారు అందరు...
ఇంకో నాలుగు నెలలు పొతే H 1 లాటరీ మోజు మొదలౌతుంది .. అది కూడా ఇదే స్థితి ... డాక్యుమెంట్స్ లేకుండా వీసాలు ఎలా ఇచ్చేస్తారు ... ట్రావెల్స్, అమెరికా కలిసి చేస్తున్న వ్యాపారం ఇది .. మనకు అమెరికా మోజు తీరనంత కాలం వీళ్ళు మనతో ఇలానే ఆడుకుంటారు ... ప్రభుత్వం లేఖలు, తానా కబుర్లు ఇవి అన్ని ఎందుకు ఉపయోగపడవు ... అమెరికాకు ఈ ఆటలు అలవాటే ఏదో ఒక వీసాతో ఇలా ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు ... నిజం చెప్పొద్దు మనకు గొప్పలు చెప్పుకునే అలవాటు అందరికన్నా ఎక్కువే కదా అందుకే ఈ తిప్పలు ... ఇంట గెలవడం ఎలాగు రాదు రచ్చ అభాసు పాలౌతున్నాం మనకున్న డాలర్ల పిచ్చిలో పడి ... గాస్ స్టేషన్లో గంటకు పది డాలర్లు సంపాదించి అదే జీవితం అనుకుంటూ ఇక్కడేమో మా అబ్బాయి అమెరికాలో పెద్ద ఉద్యోగం అంటూ చెప్పుకు తిరిగే తల్లిదండ్రులకు ఈ సంఘటనలు కనువిప్పు కావాలని కోరుకుంటూ .... M.S కాదు మీలో సత్తా ఉంటే ఇక్కడ రాంక్ సంపాదించండి ... అమెరికా వలసలు కొన్ని రోజులు ఆపండి ... !!

26, డిసెంబర్ 2015, శనివారం
ఎందరో స్త్రీమూర్తులు....!!
అణువుకు ఆకృతినిచ్చి
సృష్టిలోని మాధుర్యాన్ని పంచే
తల్లి ప్రేమకు దాసుడైనాడు
ఆ పరమాత్ముడే మానవజన్మను ధరించి
వంటింటి కుందేలన్నారు ఆనాడు
సప్త సముద్రాలను సుళువుగా దాటుతున్నారీనాడు
గగనాన తారకలౌతున్నారెందరో
చరిత్రలో చిరస్థాయిగా మిగులుతున్నారు
ఆత్మవిశ్వాసానికి చిరునామాలుగా నిలుస్తున్నారు
ఇంటా బయటా నిత్య జీవన రణరంగంలో
అలుపెరుగని శ్రామికులుగా చెరగని చిరునవ్వుతో
మొక్కవోని ఆత్మ స్థైర్యంతో నిలబడుతూ కూడా
అహం మృగం చేతిలో అణగద్రొక్కబడుతూ
విజయాన్ని అందుకునే యత్నంలో
సహనాన్ని , ఔదార్యాన్ని మరువక
కాలంతో పోటీపడే ఆ స్త్రీమూర్తుల
ఓరిమికి మీ "అమ్మ" నేర్పిన "సంస్కారం"
మీలో ఉంటే చేతులెత్తి నమస్కరించండి...!!

కవితలు
20, డిసెంబర్ 2015, ఆదివారం
అసలు సమస్య....!!
కార్పోరేట్ స్కూల్ /కాలేజ్ అన్న పదం వస్తే చాలు వెంటనే తల్లిదండ్రులని అనడం పరిపాటి అయిపొయింది అసలు సమస్యను వదిలేసి.. ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అధోగతి పాలు కావాలనో లేదా తమ కళ్ళ ముందే చనిపోవాలనో కోరుకోరు.. పిల్లల అవసరాలు తీర్చడం కోసమే వారు జీవితాన్ని పణంగా పెడుతున్నారు... నేను వారంలో 4 రోజులు వెళ్లి వస్తూనే ఉంటాను అక్కడ ఎంతోమందిని చూస్తూ ఉంటాను ... తల్లిదండ్రులు పిల్లలను మార్కుల కోసం, రాంకుల కోసం ఇబ్బందులు పెట్టరు .. ఈ పిల్లలే కనీసం ఇంట్లో ఉన్నప్పుడు ఓ నిమిషం అమ్మానాన్నలతో మాట్లాడే తీరిక ఉండదు కాని ఇప్పుడు మాత్రం ఫోను కనిపిస్తే వదలరు .... ఇక చనిపోయిన హృతిక్ విషయానికి వస్తే ఇద్దరు పిల్లలు మీడియాకు వైస్ ప్రిన్స్ పాల్ వేధింపు కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తే అది మీడియా వాళ్ళు ఎందుకు రానివ్వలేదు ... పిల్లలు చదవలేదు అన్నది కారణం కాదు వాళ్ళు గుడివాడ గౌతమ్ స్కూల్ పిల్లలు .. వాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుతారు ... మా పిల్లల సంగతి మాకు బాగా తెలుసు ... ఎలాంటి వాళ్ళు అన్నది .. ఈ రోజుకి కూడా కే కే ఆర్ గారు మా వాడు కనిపిస్తే పలకరిస్తారు అంటే అర్ధం చేసుకోండి అలా అని మాడు మొదటి సెక్షన్స్ లో ఉండడు .. ఈ హృతిక్ కూడా అలాంటి వాడే .. వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పలేని విధంగా చేసాడు అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది ఆ వైస్ ప్రిన్స్ పాల్ హోమో ఏమో అని ... నిజానిజాలు తేల్చాల్సిన వాళ్ళు దండిగా డబ్బులు తిని న్యాయాన్ని దాచేశారు... ఇది నాలుగో సంఘటన ఈ నారాయణ కాలేజ్ లలో .. ఇలానే వదిలేస్తే మరెన్నో ... నాదొక్కటే విన్నపం అందరికి ... సమస్య మూలం కార్పోరేట్ వ్యవస్థ ... దాన్ని వేళ్ళతో నాశనం చేయండి ... దీనికి అందరు సహకరించండి .. పిన్నలకు పెద్దలకు ఇదే నా విన్నపం .. మరో హృతిక్ బాలి కాకుండా పాడుకుందాం ... సమస్య చెప్పాను ... పరిష్కారం చెప్పాను ... దీనిలో న్యాయం ఉందో లేదో మీరే చెప్పండి ... !!
వర్గము
కబుర్లు
14, డిసెంబర్ 2015, సోమవారం
వాస్తవ దర్శనాలు....!!
నేస్తం ....
ఎలా ఉన్నావు ...? పలకరింపులు చాలా దూరం జరిగాయి కదూ మన మద్యలో ... ఏంటో ఈ మద్య అందరూ వాస్తవాలు ఒప్పుకుంటుంటే నేను జరుగుతున్న నిజాలను చూస్తూ ఉండిపోతూ ఓ ప్రేక్షకురాలినయ్యా .. సరే ఇక నీకు ఆ వాస్తవ దర్శనాలు చూపించాలి... ఓ ... చెప్పాలి కదా ... ఆ మధ్యేమో ఓ పెద్దాయన పెద్ద మనసుతో తన అవార్డుని వెనక్కు ఇచ్చి తన దొడ్డ మనసుని చాటుకున్నారు.. ఓ మహా నటుడేమో తన నటనతో ఇంకా ఇక్కడే ఇలానే సహనంతో జీవించేస్తా అసహనంతో సహవాసం చేస్తూ తన సహనాన్ని దేశభక్తిని చాటుకుంటూ అంటూ.... ఇప్పుడేమో ఓ పెద్దావిడకి కొత్తగా తన కుటుంబ మూలాలు గుర్తుకు వచ్చాయి కాబోలు అమ్మగారికి ఇన్నాళ్ళుగా ఒక్కసారి వినిపించని అత్తగారి నామజపం ఇప్పుడు నోటివెంట వచ్చిందేవిటి చెప్మా... పక్కనే సముద్రం ఉంటే నిలువ నీడ లేక తాగడానికి గుక్కెడు నీళ్ళు లేక ఎంతో ముందుకు పోయాం ఈ సాంకేతిక యుగంలో అని గుడ్డి భ్రమలో బతుకుతున్న మనకు మరోసారి మానవ తప్పును ఎత్తి చూపి మనల్ని పరిహసిస్తోన్న ప్రకృతి...
పార్టీల ఫిరాయింపులు, ఫోన్ టాపింగులు, కుటిలత్వాలు, కుతంత్రాలు ... పైకేమో ఒకరికొకరు చిరునవ్వుల ఆహ్వానాలు ... మద్యలో ఎవరిని మోసం చేయడానికి..? కార్పోరేట్ స్కూల్స్ వాటికి ధీటుగా ఇప్పుడు కార్పోరేట్ ధవాఖానాలు... ఇసుక దందాలు , కొత్తగా కాల్ మని అంటూ హొరెత్తిస్తున్న న్యూస్ మీడియా .. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అంతం ఎక్కడంటావు .... అంతే కదా అదే నాకు తెలియక ఇక ఇప్పటికి ఇక్కడితో ఆపేస్తూ మరోసారి మళ్ళి పలకరించనా...

మా గల్ఫ్ డాట్ కామ్ లో .....!!
http://www.maagulf.com/view/ 3465/telugusahityam/
మా గల్ఫ్ డాట్ కామ్ లో నా వ్యాసం అంతిమ ప్రయాణం ఎలా ఉంటుందో అన్న ఊహ అనుకోండి వాస్తవం అని అనుకోండి ఎలా అనిపించిందో ... చెప్పండి
ధన్యవాదాలు

ఆలోచనలు
8, డిసెంబర్ 2015, మంగళవారం
మా గల్ఫ్ డాట్ కామ్ వారి ఆన్ లైన్ లో చోటు చేసుకున్న నా అక్షరాలు...!!
మా గల్ఫ్ డాట్ కామ్ వారి ఆన్ లైన్ లో చోటు చేసుకున్న నా అక్షరాలు
వర్గము
కబుర్లు
7, డిసెంబర్ 2015, సోమవారం
కువైట్ ఎన్నారైస్ లో...!!
http://kuwaitnris.com/?p=150048
డాక్టర్ ప్రతాప్ కత్తిమండ గారు కువైట్ ఎన్నారైస్ ఆన్లైన్ పత్రికకు నా పుస్తకం " అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు" గురించి రాసిన మాటలు పై లింక్ లో మీరు చూడండి... మనఃపూర్వక ధన్యవాదాలు ప్రతాప్ గారు ..

4, డిసెంబర్ 2015, శుక్రవారం
అక్షయ తూణీరం లా...!!
మంజు యనమదల గారికి ,
నమస్తే . మీ పుస్తకంపై నా అభిప్రాయాన్ని తెలియ జేస్తున్నాను .
అక్షయ తూణీరం లా మీ అక్షర సముదాయం
అంతర్లీనంగా మనసు ప్రకంపనాన్ని
బహిర్గతం చేసిన ఉత్తమ గేయకావ్యం
సున్నితమైన మనస్సు ప్రతి అవరోదానికీ పడే బాధ
ప్రతి కవితలో తొంగి చూస్తుంది
ఆలంబననూ అనురాగాన్నీ కోరే
స్వచ్చమైన స్ఫటికపు మది
ప్రతిపదంలో ప్రతిఫలిస్తోంది
మనసుపొరల్లో నిక్షిప్తమైన
గాయాలే గేయాలుగా మారినై
చీకటినుండి వెలుతురుకు
ప్రయాణించే మనసుకద
కనిపిస్తోంది అంతర్లీనంగా మీ కవితల్లో
మనోభావాల అలజడితో
స్పందించే హృదయవేదన
ధ్వనిస్తోంది రసావిష్కరణ తో .
------------------------------ --
సోదరుడు -భవభూతి శర్మ
వర్గము
అభిప్రాయాలు
3, డిసెంబర్ 2015, గురువారం
ఏక్ తారలు....!!
1. వెన్నెల వేసారింది_చీకటి పరదాలో నీ వెలుగులకై వెదకలేక
2. వెన్నెలను విరజిమ్ముతున్నా_వేకువ పొద్దులో నీ కోసమై
3. వెన్నెల తుణీరాల అలజడి మదికెరికైంది_నీ ప్రేమలో తడిచి
4. జ్ఞాపకమై అలరించింది_గతాన్ని మరువనివ్వని గాయం
5. పగటి కలైనా_ప్రాతఃకాలపు తలపుల్లో నిన్నువరిస్తూ
6. నీ గెలుపు వీక్షించాలని నిరీక్షిస్తున్నా_ఓటమిని వద్దని వారిస్తూ
7. అమాస అలికిడే లేదు_పున్నమి వాకిట్లో నీ తలపులు నావైతే
8. మలి సంధ్య మాయమైంది_వేకువ కిరణాల్లో నిన్ను చూపిస్తూ
9. మౌనమైన మనసు భావనలు_దాయలేని కన్నీటి సాక్ష్యాలుగా
10. పండు వెన్నెలే ప్రతి క్షణమూ_పక్కుమని నీ నవ్వులు వినిపిస్తుంటే
11. బాధ్యతలను వీడలేని బంధాలు_ మది బరువైన క్షణాల్లో
12. మది అరల్లో నిక్షిప్తాలు_జ్ఞాపకాల నిధులు
13. విరహం కనుమరుగైంది_వెన్నెల వాకిట్లో నిన్ను చూసి
14. నాకు ఇష్టం_నీ మౌనం నాతొ మాట్లాడటం
15. తగవులకు తావే లేదు_మౌనం మనసుతో మాటాడేటప్పుడు
16. నాకు అపురూపం_నేను నీ మౌనమైనప్పుడు
17. పిలుపులకు పండగే_పెదవులు నా పేరే పిలుస్తున్నప్పుడు
18. మౌనమూ మాటలు కలిపింది_నిన్ను కలిసిన సంతసంలో
19. నెయ్యానికి అలంకారాలు_ఆప్యాయతల విందులు
20. మనసు పడిన ప్రేమ_మధుర జ్ఞాపకంగా
21. స్వాతి చినుకునై చూస్తున్నా_మేలిముత్యంగా నీలో ఒదగాలని

ఏక్ తార
2, డిసెంబర్ 2015, బుధవారం
డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి సమీక్ష అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు పై...
ఆప్యాయత
తో పంపిన శ్రీమతి మంజు గారి కవిత్వం పుస్తకం (అక్షరాల సాక్షిగా ... నేను
ఓడిపోలేదు )చదివాను . కొత్త ఒరవడి కవిత్వం ... అన్ని కవితలు చాల బాగున్నాయి
.. మరోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను ... ధన్యవాదములు
అక్షరాల సాక్షిగా ... గెలిచారు
------------------------------
అక్షరాల సాక్షిగా ... గెలిచారు
------------------------------
నిజమే ! ఆమె కవిత్వం లో గెలిచారు ... మనసు పై గెలిచారు ... అక్షరాల
సాక్షిగా మంజు గారి కవిత్వం గెలిచింది . కవిత్వం మనసు లోతుల్ని తట్టి
చూపిస్తుంది . మనసు లోతులను తవ్వి చూపిస్తుంది ... తట్టి లేపుతోంది .. అదే
మంజు గారి || అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు || కవిత్వం . నా అనే భావన
మెదడు తెరపై చిత్రం లా కనిపించేట్టు ప్రతి కవితా ఊహా జనితంగా ఉన్న్నాయి .
కొన్ని కవితల్లో ప్రతి ఒక్కరు
(స్వా )గత చిత్రాలను నెమరు వేసుకోక తప్పదు
"అలసిన గుప్పెడు గుండె ఆరాటం
ఆగిన మెదడు పోరాటం "
వంటి మంచి లయాత్మక వాక్యాలు పాఠకుడి ని ఆలోచింప చేస్తాయి . మెదడులో నిత్యం జరిగే ఆలోచనలు, ఆకర్షణలు , ఘర్షణలు , ఆవేశాలు ఒకదానికొకటి పెనవేసుకున్న సంఘటనలను చెప్పడం జరిగింది . అందుకే కాబోలు "గెలుపోటముల రెక్కలు ఎక్కడో ?" అని ప్రశ్నిస్తారు . మనసు - మనిషి .. ఈ రెండింటి మధ్య మానసిక సంఘర్షణలను బేరీజు వేసి కవిత్వం చెప్పడం లో మంజు యనమదల గారు ప్రసంశ నీయులు .
ఈ అక్షరాల ..... కవితలో
"సగం ఎండిన వేపచెట్టు నీడలో సేద తీరుతూ
గతించిన జీవితం రాల్చిన కన్నీటి చె మ్మలో వేదించే మదికి
వేకువ పిలుపులో తొలి పొద్దు సంతకాలు ... జ్ఞాపకాలు "
నిజంగా మంచి రసాత్మక వాక్యాలు అందించగలిగారు . అద్బుతంగా కవిత్వాన్ని మలిచారు .
"మూసుకున్న ఆ రెప్పల మాటున
ఒలుకుతున్న భావాల ఒరవడి
జారుతున్న కన్నీటికి సాక్ష్యం (అంతర్ముఖం )
కళ్ళల్లో సజీవ సాక్ష్యాలన్నీ రెప్పల మాటునే దాచుకున్న బాధలతో ఒక వేదన చెప్పగలగడం ఒక మానసిక విశ్లేషణకు అడ్డం పడుతోంది .
"అక్ష రం ఏడుస్తోంది ...
మనసు భావాలకు రూపాన్ని చెక్కే శిల్పి
చేతిలో ఉలి తానైనందుకు' .. అక్కడక్కడ కవితల్లో నిరాశ , నిస్పృహలు కనిపించిన అవి మనసు పడే ఆవేదనగా చెప్పవచ్చు
"ఏకాంతం లో నాకు నేనుగా ... ఇష్టంగా !"
నిజమే శిధిల జ్ఞాపకాలు చిద్రమైతే ఒంటరితనం కూడా ఇష్టం గా మార్చుకోక తప్పదు . ఇలా ఎన్నో కవితలు మనసు తలుపు తెరిచి చూపిస్తాయి .
మంజు గారు మంచి మనసున్న మనసు కవి "" అక్షరాల సాక్షిగా
నేను ఓడిపోలేదు "కవిత్వం ఒక సైకాలజీ ఎనాలసిస్ కూడా !. అందుకే ఆమె అక్షరాలకు ఓటమే లేదు. నిత్యం కవిత్వం లో మంజు గారిదే గెలుపు .
అభినందనలు
- డాక్టర్ కత్తిమండ ప్రతాప్
మనఃపూర్వక కృతజ్ఞతలు ప్రతాప్ గారు .. ఒక మెచ్చుకోలు కరువైన ఈ రోజుల్లో మీ అభిమానానికి మాటలు రావడం లేదు .. నేను చాల అదృష్టవంతురాలిని .. మీ వంటి పెద్దల రాతల్లో నా కవిత్వం కనిపించినందుకు .. _//\\_

1, డిసెంబర్ 2015, మంగళవారం
దాటేయాలని ప్రయత్నిస్తున్నా...!!
అంపకాల పంపకాలు
నిన్నో మొన్నో అయినట్లున్నా
పారాణి అడుగుల ఆనవాళ్ళు
అక్కడక్కడా ఎండి కనబడుతున్నా
పచ్చని తాటాకు పందిరి
కాస్త వడబడి రంగు తగ్గినట్టున్నా
పెళ్ళికి వచ్చిన చుట్టపక్కాలు
ఎక్కడివాళ్ళక్కడ సర్దుకుంటున్నా
గుండె గదిని ఖాళి చేయని
నీ జ్ఞాపకాల గుభాలింపులన్ని తరుముతూనే ఉన్నా
వాస్తవాలను వాయిదా వేయలేని
మనసుపై గీసిన అసంపూర్ణ చిత్రంగా మిగిలున్నా
మదిపై రాసిన మరణ శాసనాన్ని
వదలలేని గతాన్ని దాటేయాలని ప్రయత్నిస్తునే ఉన్నా...!!

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)