14, మే 2016, శనివారం

చేజారిన జ్ఞాపకాలుగా....!!

గతపు గాయాలు చెమరిస్తూనే ఉన్నాయి
వాస్తవంలో వద్దన్నా వెంబడిస్తూ
చేజారిన జ్ఞాపకాలుగా మిగిలిపోతూ..

చేతన సందడి క్షణాలను గుర్తుచేస్తూ
ఆచేతనాన్ని అందుకున్న మదిని
మరపు మాయలో లాలిస్తూ...

కన్నులు దాటని కలలకు
అందని ఊహల పయనానికి
వాయిదాలు వేస్తున్న నెపాలకు లొంగిపోతూ....

ఓటమి గెలుపుని అందుకుని
నీడగ మిగిలిన సాక్ష్యాలను
ఆనందపు నేస్తాలు అనుకుంటూ...

అవధులు తెలియని అమాయకత్వానికి
ఆసరా ఇవ్వలేని అభిమానాన్ని
అందుకున్న అసహజత్వానికి తల ఒగ్గుతూ...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner