తరాల ఆంతర్యాల అనుభవాలకు చిహ్నంగా మిగిలిన విలువలు వెల వెలా పోతున్నాయి. ఈనాటి తల్లిదండ్రులు ఒకప్పటి పిల్లలే అన్న సంగతి మరచి తమ గొప్ప కోసమో లేదా నలుగురిలో తమ హోదాను చాటుకోవడం కోసమో పిల్లల మనసులతో ఆడుకుంటున్నారు. ఈ కార్పొరేట్ చదువులు వచ్చిన తరువాత చదువుని కొనుక్కోవడం మామూలై పోయింది. రాంకుల కోసం తపన మొదలైంది. మన ఇష్టాయిష్టాల కోసం పిల్లల ఇష్టాలు కాలరాయడం ఎంత వరకు సబబు..?
అలా అని తప్పంతా పెద్దలదే అనుకోవడం కూడా పొరపాటే. మధ్య తరగతి కుటుంబాలను తీసుకుంటే పిల్లలు తమలా కష్టపడకూడదని పిల్లలకు అన్ని అమర్చి పెడుతుంటే వాళ్ళకు రూపాయి విలువ, చదువు ఆవశ్యకత తెలియకుండా పోతోంది. విలాసాల మోజులో పడి మానవతా విలువలనే మర్చిపోతున్నారు. సరదాల అవసరాలకు, ఆడంబరాలకు అమ్మానాన్నలను వాడుకుంటున్నారు. ప్రచార మాధ్యమాలు, ముఖ పుస్తకాలు, ట్విటర్లు మొదలైన సేవలు, సెల్ ఫోన్ల వాడకం వచ్చాక ఒకే ఇంట్లో ఉన్నా పెద్దల పిల్లల మధ్య దూరం పెరిగిపోయింది. "ఎవరికీ వారే యమునా తీరే" అన్న నానుడి అక్షరాలా నిజమైంది.
అనుబంధాలను పెంచుకుంటూ, మార్కులతోనూ, రాంకులతోను పిల్లల తెలివితేటల్ని అంచనా వేయడం మానివేసి వాళ్లలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం మొదలుపెడితే ప్రతి విద్యార్థి ఓ అబ్దుల్ కలాం కాక మానడు.
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి