22, నవంబర్ 2012, గురువారం

నా దగ్గరేం లేవని.....!!


కలతనిదురలో నీ రూపం మాయమౌతోంది
మెలకువలో కనిపించని నీ రూపాన్ని 
గీతల్లో పొందుపరుద్దామంటే చేతిలోని
కలం కదలనని మొరాయిస్తోంది
ఆగని కాలం సాగిపోతూనే వుంది
జ్ఞాపకాల పేజీలు మోసుకుంటూ...
ఖాళీగా వెళిపోయింది...!!
కాకపొతే ఒకటే మార్పు....!!
ఒక్క...నీ గురుతుల దొంతరలు
మాత్రం నా దగ్గర వదిలేసింది...!!
ఎందుకని అడిగితే...
మోయలేనంత భారమంది..!!
కాలానికి కూడా తెలిసింది...
నీకే తెలియడం లేదు...!!
నీ జ్ఞాపకాలు తప్ప మోసుకుపోవడానికి
నా దగ్గరేం లేవని.....!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజవనమాలి చెప్పారు...

నీ గురుతుల దొంతరలు

మోయలేనంత భారమంది..!

very nice Manju gaaru.

సుభ/subha చెప్పారు...

జ్ఞాపకం .. ఎప్పుడూ అద్భుతమే కదండీ.. బాగుంది మీ భావం.

the tree చెప్పారు...

చాలా బాగుంది మంజు గారు.

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా సంతోషం నా కవిత మీకు నచ్చినందుకు....ధన్యవాదాలు వనజ గారు,
సుభ గారు, భాస్కర్ గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner