హాస్యం అనేది అలానే వుండాలి కాని ఒకరిని నొప్పించేదిగా ఉండకూడదు...బోలెడు ఖర్చు పెట్టి ఎంతో శ్రమ పడి తీసే సినిమా ఆహ్లాదంగా వుండాలి...కాని ఒకరిని నొప్పించేదిగా ఉండకూడదు....!!
ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే....సినిమాని వినోద ప్రధానంగానో....లేదా ఒక మంచి విషయాన్ని చెప్పే మాధ్యమం గానో...చూడాలని నా విన్నపం..సినిమాలలో వినోదం కోసమో....కాసేపు నవ్వు కోవడం కోసమో...కొన్ని సన్నివేశాలు తీసినంత మాత్రాన అవి నిజాలు అయిపోవు కదా..!! మంచి చెడు అందరిలోనూ వుంటాయి...అన్ని వర్గాలలోను..ప్రాంతాలలోను...మంచి చెడు వుంటుంది...వేషం...భాష...పద్దతులు...ఇలా అన్ని ఒక్కలా వుండవు కదా..అందరివి...!! మన చేతికి ఉన్న ఐదు వేళ్ళే ఒకలా లేనప్పుడు....ఒక అమ్మ కడుపున పుట్టిన పది మంది ఒకలా లేనప్పుడు వేరు వేరు ప్రాంతాల వాళ్ళు వర్గాల వాళ్ళు ఒకలా ఎలా వుంటారు....??
మరీ ఈ మధ్యనే ఈ సినిమాల గొడవలు ఎక్కువై పోతున్నాయి....అందరికి మేలు జరిగే సమస్యలపై దృష్టి పెడితే....బావుంటుంది...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి