4, జనవరి 2015, ఆదివారం

ఏక్ తారలు....!!

3/1/15
1. కలసిన బంధం_కడ వరకు తోడుగా
2. సమీరం చేతులెత్తేసింది_మన మధ్యన దానికి చోటు చిక్కలేదని
3. లెక్కల్లో అలసిపోయా_చుక్కలన్నీ అక్షింతలుగా రాలుతుంటే
4. నే వచ్చి చాలా సేపయ్యింది_తలపులే తలుపులు వేసుకున్నాయి
5. ఊహల వాకిలి విశాలంగా ఉంది_నీ మనసులానే
6. నీ ప్రేమామృతాన్ని గ్రోలినందుకేమో_మనసెప్పుడో అమరత్వాన్ని అందుకుంది
7. అల్లుకున్న అనుబంధం_వదలలేనంటూ మారాం చేస్తోంది గోముగా
8. స్వర్ణానికేం తెలుసు_రాళ్ళల్లో ఇసుకల్లో దాగిన నీ మేని మెరుపులు
9. వలపు విరి జల్లుకు_వేసవి వర్షాలతో పనేంటి
10. విశ్వ జనీనమైన ప్రేమతో_ప్రపంచానికే అమ్మ అయ్యింది
11. చలికాలంలో దాయలేనివి_కోట్లు
12. ముత్యాలన్నీ దొర్లి పోయాయి_నీ నవ్వుల ముందు చిన్నబోయి
13. యుగాల తపస్సు_ నిను చేరాలన్న వెదుకులాటలోనే నిరంతరం
14. నీ జ్ఞాపకాలతో_భారంగా ఉన్నా...  బావుంది
15. చెంతనే ఉన్నా_నీ స్పర్శకు పులకరిస్తూ
16. గెలుపోటముల్లో చెరి సగం_భావాల ప్రవాహం పంచుకుంటూ
17. శీతలానికి వెచ్చగా తగిలింది_నీ నిట్టూర్పు గాలి
18. ఆ చెలిమి పరిమళమే అనుకుంటా_ఎటు వెళ్ళినా నాతోనే
19. గుప్పెడు గుండె ఉప్పెనయ్యింది_నీ ముందు దాసోహమంటూ
20. ఎంత దూరంగా ఉన్నా_పక్కనే ఉన్నాయి నీ జ్ఞాపకాలు
21. జారిపోతున్నాయని దోసిలి పట్టా_అందమైన కావ్యాలన్నీ దాచుకోవాలని  

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner