హ త త నల సల సల నహ
UI UUI UUI IIII IIUI IIUI IIIUI
వారి జాప్తుండు పంచేంద్ర గణములు వనజారి యునుగూడి వెలయుచుండ
2. మధ్యాక్కర : అక్కరల వరుసలో రెండవది. మధ్యాక్కర అని పేరు. మధ్యలోకి విరిచిన సమద్విఖండన
లక్షణము గలది గనుక మధ్యాక్కర అని పేరు. నన్నయ, ఎర్రన వాడినారు. తక్కిన కవులు వాడలేదు. విశ్వనాథ మధ్యాక్కరలు తెలుగునాట ప్రసిద్ధములు.
2 ఇం.గ. +1 సూ.గ. 2 ఇం.గ.+ 1 సూ.గ. = మొత్తం 6 గణములు. 3వ గణము పై యతి.ప్రాస ఉండును.
4 పాదములు ఇట్లే వ్రాయ వలయును. నన్నయ 4 గణముల పై అంటే 5వ గణాద్యక్షరమును యతిగా పాటించాడు. ఎర్రన చతుర్థ గణాద్యక్షరమును యతిగా పాటించాడు. ఎర్రన యతి గేయ ఛందో వైఖరికి సన్నిహితము.
ఇం ఇం సూ ఇం ఇం సూ
భ ర హ ర భ న
UII UIU UI UIU UII III
ఈపురు షుండు నీ స్త్రీయు నిద్దరే యింతియుఁ బతియు.
3.మధురాక్కర : పాదమునకు 1 సూ.గ. + 3 ఇం.గ.+ 1 చం.గ. = మొత్తము 5 గణములు. 3 గణముల పై యతి. ప్రాస కలదు.
సూ ఇం ఇం ఇం చం
న సల త భ నగగ
III IIUI UUI UII IIIUU
తనర జనకుండు నన్నప్ర దాతయు నుభయత్రాత
న సల సల నల నవ
III IIUI IIUI IIII IIIUI
యును న నఁగ నింతు లకు మువ్వురొ గినగుగు రువులు వీర
న సల నల ర రల
III IIUI IIII UIU UIUI
లనఘ నుపనేత మఱియుని రంత రా ధ్యాపకుండు
న నల త సల నలల
III IIII UUI IIUI IIIII
ననఁగ బురుషున కి య్యేవు రనఁయంబు ను గురువులు.
4.అంతరాక్కర : 1 సూ.గ.+ 2 ఇం.గ.+ 1 చం.గ = 4 గణములు. తృతీయ గణాంత్యాక్షరము యతి. ప్రాస కలదు.
సూ ఇం ఇం చం
న భ ర నహ
III UII UIU IIIUI
ఇను డొ కండును నింద్రు లి ద్దరును నొక్క
న భ ర నహ
III UII UIU IIIUI
వనజ వై రియు గూడి వై భవ మొనర్ప
న భ ర నహ
III UII UIU IIIUI
గనక వస్త్రుని గృత్త కై టభుని గొల్తు
న భ ర నల
III UII UIU IIIII
రనుచు జెప్పుదు రంతరా క్కర బుధులు.
దీనికి తేటగీతితో పోలిక కలదు.యతి స్థలము ఒక అక్షరం దాటితే అచ్చంగా తేటగీతే. 5.అల్పాక్కర : 2 ఇం.గ.+ 1చం.గ. =మొత్తము 3 గణములు.2గణములమీద యతి.ప్రాస ఉండును.
ఇం ఇం చం
సల భ నహ
IIUI UII IIIUI
ఒగి నిద్ద రింద్రులు నొకవిధుండు
నగ భ నహ
IIIU UII IIIUI
నెగడు న ల్పాక్కర నియతి తోడ
సల నగ నహ
IIUI IIIU IIIUI
జగతీ ధ రుని పదా బ్జములు గొల్తు
నల ర నహ
IIII UIU IIIUI
రగణిత భక్తి నం చభినుతింప.
- See more at: http://magazine.maalika.org/2014/09/02/%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%B2%E0%B1%81/#sthash.vLOV3sUL.dpuf
మన తెలుగు సాహితీ ముచ్చట్లలో క్రిందటి వారం ప్రాఙ్నన్నయ యుగము గురించి కాస్త తెలుసుకున్నాము... ఈ వారం దాని తరువాతి యుగమైన నన్నయ యుగము గురించిన వివరణ చూద్దాము.
1000 - 1100 : నన్నయ యుగము
దీనిని "పురాణ యుగము" లేదా "భాషాంతరీకరణ యుగము" అని అంటారు. నన్నయ్య ఆది కవి. ఈయన మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని, ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెలుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ,నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించిన వారే.అందుకే నన్నయ్య ఆది కవి అయినారు.ఇక ఈ వారం అక్కరలలోని రకాలైన మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర, అల్పాక్కరల గురించిన వివరణలు చూద్దా...
1. మహాక్కర : 1 సూ. గ + 5 ఇం.గ.+1 చం.గ = 7 గణములు పాదమునకు. యతి 4 గణముమీద. ప్రాస ఉండును. ఇట్లు 4 పాదములు వ్రాసినచో మహాక్కర అగును. దీనిని ప్రాచీన తెలుగు కవులెవ్వరును వాడలేదు.
హ త త నల సల సల నహ
UI UUI UUI IIII IIUI IIUI IIIUI
వారి జాప్తుండు పంచేంద్ర గణములు వనజారి యునుగూడి వెలయుచుండ
2. మధ్యాక్కర : అక్కరల వరుసలో రెండవది. మధ్యాక్కర అని పేరు. మధ్యలోకి విరిచిన సమద్విఖండన
లక్షణము గలది గనుక మధ్యాక్కర అని పేరు. నన్నయ, ఎర్రన వాడినారు. తక్కిన కవులు వాడలేదు. విశ్వనాథ మధ్యాక్కరలు తెలుగునాట ప్రసిద్ధములు.
2 ఇం.గ. +1 సూ.గ. 2 ఇం.గ.+ 1 సూ.గ. = మొత్తం 6 గణములు. 3వ గణము పై యతి.ప్రాస ఉండును.
4 పాదములు ఇట్లే వ్రాయ వలయును. నన్నయ 4 గణముల పై అంటే 5వ గణాద్యక్షరమును యతిగా పాటించాడు. ఎర్రన చతుర్థ గణాద్యక్షరమును యతిగా పాటించాడు. ఎర్రన యతి గేయ ఛందో వైఖరికి సన్నిహితము.
ఇం ఇం సూ ఇం ఇం సూ
భ ర హ ర భ న
UII UIU UI UIU UII III
ఈపురు షుండు నీ స్త్రీయు నిద్దరే యింతియుఁ బతియు.
3.మధురాక్కర : పాదమునకు 1 సూ.గ. + 3 ఇం.గ.+ 1 చం.గ. = మొత్తము 5 గణములు. 3 గణముల పై యతి. ప్రాస కలదు.
సూ ఇం ఇం ఇం చం
న సల త భ నగగ
III IIUI UUI UII IIIUU
తనర జనకుండు నన్నప్ర దాతయు నుభయత్రాత
న సల సల నల నవ
III IIUI IIUI IIII IIIUI
యును న నఁగ నింతు లకు మువ్వురొ గినగుగు రువులు వీర
న సల నల ర రల
III IIUI IIII UIU UIUI
లనఘ నుపనేత మఱియుని రంత రా ధ్యాపకుండు
న నల త సల నలల
III IIII UUI IIUI IIIII
ననఁగ బురుషున కి య్యేవు రనఁయంబు ను గురువులు.
4.అంతరాక్కర : 1 సూ.గ.+ 2 ఇం.గ.+ 1 చం.గ = 4 గణములు. తృతీయ గణాంత్యాక్షరము యతి. ప్రాస కలదు.
సూ ఇం ఇం చం
న భ ర నహ
III UII UIU IIIUI
ఇను డొ కండును నింద్రు లి ద్దరును నొక్క
న భ ర నహ
III UII UIU IIIUI
వనజ వై రియు గూడి వై భవ మొనర్ప
న భ ర నహ
III UII UIU IIIUI
గనక వస్త్రుని గృత్త కై టభుని గొల్తు
న భ ర నల
III UII UIU IIIII
రనుచు జెప్పుదు రంతరా క్కర బుధులు.
దీనికి తేటగీతితో పోలిక కలదు.యతి స్థలము ఒక అక్షరం దాటితే అచ్చంగా తేటగీతే.
5.అల్పాక్కర : 2 ఇం.గ.+ 1చం.గ. =మొత్తము 3 గణములు.2గణములమీద యతి.ప్రాస ఉండును.
ఇం ఇం చం
సల భ నహ
IIUI UII IIIUI
ఒగి నిద్ద రింద్రులు నొకవిధుండు
నగ భ నహ
IIIU UII IIIUI
నెగడు న ల్పాక్కర నియతి తోడ
సల నగ నహ
IIUI IIIU IIIUI
జగతీ ధ రుని పదా బ్జములు గొల్తు
నల ర నహ
IIII UIU IIIUI
రగణిత భక్తి నం చభినుతింప.
సేకరణ : వికీపీడియా నుండి మరియు మల్లిన నరసింహారావు గారి వ్యాసం నుంచి
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి