2, జనవరి 2015, శుక్రవారం

మౌన సమీరాలు....!!

మంచు పూల ముత్యాల సరాలు 
మదిని దోచిన ముగ్ధ మోహనాలు
మాటల చాటున మౌన భాష్యాలు
మనసు మెచ్చిన మధుర గీతికలు
మయూరపు నడకల హొయలు
మణిమేఖల దరహాస చంద్రికలు
మలయమారుత పవన తాకిడులు
మరల రాని వసంతాల జ్ఞాపికలు
మళ్ళి మళ్ళి రా రమ్మని పిలిచే
మరు జన్మకు తీరని ఋణాలు
మరపురాని నీ మౌన సమీరాలు....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner