
కోపగించుకోకండి... మనలో చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు... దైవ ప్రవచనాలు చెప్తూ... వింటూ ఉంటారు.. కాని వారిలో ఎంత మంది ఆచరించి చెప్తున్నారు... మనం చేసే ప్రతి కర్మకు దైవాన్ని బలి చేస్తూ మనం మాత్రం సంతోషంగా ఉండాలనుకోవడం ఎంత వరకు సబబు..? పూజ చేసిన కాసేపు కూడా మన మనసుని నియంత్రించుకోలేక పోతున్నాము... కొందరు అయ్యప్ప మాల వేసుకుంటారు... ఆ మండలం రోజులు ఏదో చేశామనిపించి దర్శనానికి వెళ్లి వచ్చాక మళ్ళి అన్ని మామూలే... మరి కొందరేమో మన పెద్దలు చెప్పిన చందాన చేసేవి శివ పూజలు .. దూరేవి .... అన్నట్టుగా ఉన్నారు... ఒక్కోసారి జనాలు వల్లించే నీతి వాక్యాలకు... వారు చేసే పనులకు పొంతన లేక నాకైతే చాలా కోపం వస్తుంది.... కాని ఏమి చేయలేం నలుగురితో మనమూ అన్నట్టు బతికేయడమే... ఈ లోకం తీరు ఇంతే అని సరిపెట్టుకోవడమే... నీతులు ఎదుటివారికి చెప్పడానికే కాని మనం ఆచరించడానికి కాదని అర్ధం చేసుకోవాలన్న మాట -:). దేవుళ్లకే తప్పని అరిషడ్వర్గాల ముందు మనమెంత అని తలను వంచేసుకోవడమే...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి