4, జనవరి 2015, ఆదివారం

నీ ప్రేమ కుసుమమం.....!!

వేదన చెందే హృదయాన్ని
అనునయ పరిచే ఆత్మీయతలో 
చెలిమిని చేరువగా చేసిన
అనుబంధం ప్రేమలో పడిందేమో...

పాల మనసు కలత చెందినా
పసితనపు ఛాయలు పోకపోయినా
అభిమానం తాకిడికి అంతులేని
ఆనందం ఉవ్వెత్తున ఎగసి పడిన సంబరం...

పేరు తెలియని బంధం పెంచుకుని
మమకారం మది నిండుగా నిలుపుకుని
మాటల మౌనం వెనుక చుట్టుకున్న
మనసు తరంగమే ఈ స్నేహమేమో...

అల్లుకున్న అక్షరాల సాక్షిగా
జాలువారిన భావాల రూపాలలో
వెల్లివిరిసే సుగంధం నను తాకుతున్న
ఈ పారిజాతాల పరిమళం నీ ప్రేమ కుసుమమం.....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner