21, జులై 2010, బుధవారం

అమ్మ

అమ్మ పాటలలో నాకెంతో ఇష్టమైన పాట ఇది....

ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం

ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం

అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి

అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి

అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు

అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు

అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి

అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని

శ్రీరామరక్ష
అంటూ నీళ్ళు పోసి పెంచింది

ధీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది

నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో

పాటలు నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

మాలా కుమార్ చెప్పారు...

ఈ పాట బాగుంటుందండి . మంచి పాట చెప్పారు .

చెప్పాలంటే...... చెప్పారు...

అవును మాలా గారు నాకు చాల ఇష్టం ఈ పాట అందుకే గుర్తు చేసుకున్నాను మీకు నచ్చినందుకు థాంక్ యు

Unknown చెప్పారు...

ఎంతో గొప్ప పాటని మళ్ళీ మీ వద్ద గుర్తు చేసుకున్నాను.
చాలా మంచి పాట.

"అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని"
అద్భుతం


శివ పార్వతి

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా సంతోషం నా పోస్ట్ మీకు నచ్చినందుకు శివ పార్వతి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner