16, మార్చి 2011, బుధవారం

అనుకున్నదే అయ్యింది...

అనుకున్నదే అయ్యింది....సౌత్ ఆఫ్రికా తో మన వాళ్ళు ఓడిపోయి చెల్లించిన మూల్యం ఏంటో కనీసం ఇప్పటికైనా అర్ధం చేసుకుంటే...బౌలింగ్ లోనూ, ఫీల్డింగ్ లోనూ కాస్త శ్రద్ధ పెడితే కనీసం చివరి వరకు పోరాడగలిగితే....!! కోట్లాదిమంది భారతీయుల ఆశలను, కలలను సాకారం చేయడానికి ప్రయత్నిస్తారో లేదో మన టీం ఇండియా!! అలనాటి కెప్టెన్ కపిల్ అందించిన అలవికాని ఆనందాన్ని మళ్ళి మనం సొంతం చేసుకోగలమా!! అన్న సందేహం ప్రతి ఒక్క భారతీయుడిలోను ప్రస్పుటం గా కనిపిస్తోంది. జరుగుతున్న మాచ్ లు చూస్తున్న కొద్ది అస్సలు చివరి వరకు పోరాడగలరా!! అనిపిస్తోంది. ఆటలో ప్రతి క్షణం ముఖ్యమే...పరుగైనా, వికెట్టు అయినా, కాచ్ అయినా....ఇలా ప్రతిదీ, టీం లోని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూసుకోక పొతే మూల్యం చెల్లించక తప్పదు. సమిష్టిగా విజయాన్ని అందుకోవడానికి జట్టులో అందరూ ఒక్కటిగా గెలుపే ధ్యేయంగా ఆడితే తప్పక విజయం మనదే అవుతుంది. ప్రపంచ రికార్డుల ఆటగాళ్ళు వున్నారు, పరుగుల రారాజులు, స్పిన్ మాయాజాలం తో ప్రత్యర్ధిని ముప్పుతిప్పలు పెట్టగల సత్తా వున్న స్పిన్ మాంత్రికులు, కొద్దిగా మనసు పెడితే ఫీల్డింగ్ లో ఎదుటి జట్టు కి చుక్కలు చూపించ గల మనవాళ్ళు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో !! ఒక్క వికెట్ పడితే చాలు నీవెనుకే మేము అంటూ అందరూ పెవిలియన్ కి చేరుకుంటారు. ఆడలేకా కాదు, ఆటరాకా కాదు...నిర్లక్ష్యం....!! నా డబ్బులు నాకోస్తున్నాయి, నా రికార్డ్లులు నాకున్నాయి, ఆడినా ఆడక పోయినా...అని అనుకుంటే ఎప్పటికీ ఇలానే ఉంటాము. మన కోసం కాకుండా దేశం కోసం ఒక్కసారి ఆడి చూడండి అందరూ....కోట్లాదిమంది భారతీయుల ఆశిస్సులు కొండంత అండగా మీకందుతున్నప్పుడు బెదురెందుకు?? భయమెందుకు?? దూసుకు పొండి....తిరుగులేని విజయంతో చరిత్రలో సువర్ణాక్షరాలతో చిరకాలం మిగిలిపొండి.... !!
క్రికెట్ గురించి అన్ని వివరాల కోసం పక్కనే వున్న క్రీడాభిమానుల కోసం లింక్ లలో చూడండి లేదా www.cricdude.com ని చూడండి

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

ఎన్ని యేళ్ళు గడిచినా మన వాళ్ళు దండకట్టడం మానరండీ అందుకే చూడాలని కూడా అనిపించడం లేదు.
మొన్న ఇండియా ఓడిపొగానే మిమ్మల్నే తలచుకున్నాను
రెగ్యులర్గా క్రికెట్ గురించి రాస్తున్నారు అని

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా రోజుల తరువాత వద్దు అనుకుంటూనే కొద్ది సేపు చూసాను షరా మామూలే చరిత్ర పునరావృతమైంది అంతే థాంక్యు గుర్తు చేసుకున్నందుకు లత గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner