8, మార్చి 2011, మంగళవారం

నిన్నటి పాడుతా తీయగా....లో

ఈసారి పాడుతా తీయగా గురించి టపా రాయాల్సిన అవసరం రాదేమో అనుకున్నాను కాని రాయక తప్పడం లేదు. బాలు గారు ముందుగా నన్ను క్షమించాలి...నిన్నటి ఎపిసోడ్ లో అంజని నిఖిల పాడిన వేదం లా ఘోషించే గోదావరి పాటలో (శోభ అంటాము కాని షోభ అనం కదా) శోభిల్లే కి షోభిల్లే అని పాడాలని చెప్పారు. ముందుగా లలో బాలు గారు చూసుకోవాలి ఒక్కో సారి బానే చెప్తారు మరోసారి మరోలా చెప్తే పిల్లలు ఎలా పాడాలో తెలియని అయోమయం లో పడిపోతారు. అంజని నిఖిల బానే పాడుతుంది కాని పాడేటప్పుడు మద్యలో చాలా సార్లు గాలి శబ్దం కుడా వినిపిస్తుంది మరి అది గమనించారో లేదో బాలు గారు..నిన్నటి ఎపిసోడ్లో నాకనిపించింది రాఘవేంద్ర చాలా బాగా పాడాడు అని...మరి ఎందుకు బాలు గారు తప్పుగా తీర్పు చెప్తున్నారో తెలియడం లేదు. అంజని నిఖిల కంటే చాలా బాగా పాడాడు రాఘవేంద్ర. దయ చేసి బాలు గారు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలని కోరుకుంటున్నాను.........

20 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

నిజమే కదా. నేను చూసి తెల్లబోయా ఏంటి బాలుగారు అంతటి వారు ఇలా శ,ష కి తేడా ఇలా చెప్తున్నారు అని.

చెప్పాలంటే...... చెప్పారు...

అదే కదా నాకు అర్ధం కానిది ఏంటో మరి బాలు గారు ఇలా చెప్పడం ఏమి బాలేదు

లత చెప్పారు...

నిన్నటి ఎపిసోడ్ అయితే చూడలేదు కానీ నిఖిల వాయిస్ లో ఊపిరి శబ్దం బాగా వస్తోంది .
జడ్జెస్ తో కూడా మార్క్స్ వేయిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు

చెప్పాలంటే...... చెప్పారు...

అదే అందరూ అనుకునేది కాని బాలు గారే వేస్తారు మార్కులు ప్రతి సారి అంజని నిఖిల గురించి మీతో నేను ఏకిభవించే ఈ టపా రాసాను......బాగా పాడిన వాళ్లకు సరిగా న్యాయం జరగడం లేదు లత గారు

అజ్ఞాత చెప్పారు...

బాలు పాడిన చాలా పాటల్లో 'శ' ని 'ష' గానే పలికేవారు. ఇప్పుడిలా అంటున్నారు కాని, తన వయసులో వున్నప్పుడు ఈయన ఎలాపాడేవారో..

'షంకరా నాదశరీరా' అనే నాకు అనిపిస్తుంది, కాదు వినిపిస్తుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా మంది అంటున్నారు అండి ఈ మాట కాని బాలు గారు తెలుసుకునేదేప్పుడో మరి!! మీ స్పందనకు ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

బాలు గారు శకారులేమీ కాదు. ఆయన శ పలికే విధానమే సరి ఐనది. మనకు పట్టిన దౌర్భాగ్యమేమంటే (ముఖ్యంగా హైదరాబాదు వాళ్ళకు) శ ను కూడా స లాగా పలకటం. పైపెచ్చు అదే సరయిన ఉచ్చారణగా వాదించటం. శ ను ఎలాపలకాలో ఎం ఎస్ సుబ్బలక్ష్మిగారు పాడిన విష్ణుసహస్రనామం వింటే తెలుస్తుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

నిన్నటిది విని వుంటే తెలిసేది మీకు

అజ్ఞాత చెప్పారు...

అంటే ! ఆయన గురుంచి చెప్పడం కాదు పాపం
ఆయన చాల న్నిష్పక్ష పాతం గ మాట్లాడుతున్నానని అనుకుంటారు.
కాని కొన్ని సందర్భాలుకి అవి సరిపోవటంలేదు.

చెప్పాలంటే...... చెప్పారు...

అదే అండి నా బాధ కూడా... ఇంకా చాలా మందిది కూడా

voleti చెప్పారు...

చాలా మంది పెద్ద వాళ్ళకి కూడా స, శ, ష లు పలకడం లో అనుమానాలుంటాయి. సరైన తెలుగు మాష్టార్లు లేక పోవడం, భాష పై పట్టు లేక పోవడం వల్ల ఇలాటి సందేహాలు వస్తాయి. అలాగే ఇప్పుడు ఎవరూ, పెళ్ళి అని పలకటం లేదు, రాయటం లేదు. పెల్లి, పెల్లాం, (ఇది అధికారిక భాష అయికూర్చుంది) టీవీల్లో, సినిమా వాల్ల (వాళ్ళ) వాడుక భాష ఇదే అయి, ఇదే నిజమనుకుని అందరూ అలాగే పలుకుతున్నారు. అందువల్ల "శ" ని పలకడం తెలీక తికమక పడుతున్నారు. ష+అ = మామూలుగా "ష" అవుతుంది. అదే ష=ఎ = షె (ఇది కొద్దిగా స కి ష కి మధ్య శబ్దం లో పలకాలి.. ఇది "శ" ని తెలియజేస్తుంది. అందువల్ల "శంకరా" అనే పాటలో బాలు గారి పాట కరక్టే.. ఇప్పటి జనం భాషలో అయితే "సంకరా" అని పాడలి. వుదా: నా పేరు శంకర్ నే తీసుకోండి.. ఎవరూ "సంకర్" అని పిలవరు... "షెంకర్" అని పిలుస్తారు.. అదే "షంకర్" అంటే అది తప్పు.

చెప్పాలంటే...... చెప్పారు...

బాలు గారి శంకరా నీ ఏమి అనలేదు నేను....ఈ సోమవారం ఎపిసోడ్ లో బాలు గారు కుడా శ ని ష అని పలకాలని అంజని నిఖిల కి చెప్పారు. ఆ పాప కరక్టు గానే పాడింది, బాలు గారు కన్ఫ్యూజ్ చేసారు అది సంగతి... మీరు చెప్పినవి అన్ని నిజాలే అండి. స్పందించినందుకు ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

చాలామంది ఆంధ్రా ప్రాంతంవాళ్ళు (కవి పండితులు తప్ప) ’శ’ ను ’స్య’ అని అదోలా పలుకుతూ, పైగా అదే సరైన ఉచ్చారణ అంటూ వాదిస్తారు. పైగా ఇలాంటివాళ్ళు ’శ’ను సరిగా ఉచ్చరించేవాళ్ళనే తప్పుబట్టడం తెలుగు భాషకు పట్టిన దౌర్భాగ్యం. ’శ’ను ’స’కు ’ష’కు మధ్యలో.. అదీ ’ష’కు దగ్గరగా పలకాలి. ఇది గ్రహించకుండా తెలుగు భాష ఉచ్చారణలో దిట్ట అయిన బాలు గారిని తప్పుబట్టడం అజ్ఞానం, మూర్ఖత్వం.’సింహాసనం’ అన్న సినిమాలో ’రాజా సీతారాం’ అనే గాయకుడు ’ఆకాస్సంలో ఒక తార .. నా కోసం వచ్చింది ఈ వేళ .. ’ అంటూ పాడిన పాట వింటే ఒళ్ళు కంపరమెత్తుతుంటుంది. చాలా మంది అదే సరైన ఉచ్చారణ అనుకోవడం తెలుగు భాషకు పట్టిన దుర్గతి.

హరి చెప్పారు...

అసలు మన తెలుగు భాషకు శ, ష అనే రెండు అక్షరాలు అవసరమా అనిపిస్తుంది. శ ని పలకడంలో చాలా కన్‌ఫ్యూజన్లు ఉన్నాయి. పై వ్యాఖ్యలలోనే స్య, షె, స్స అని పలకడాన్ని సూచించారు.

నిజానికి శ, ష లను వేరుగా అనవసరం. చాలాసార్లు మనం రెండు అక్షరాలనూ ఒకే సందర్భానికి వాడడం కూడా ఉంది.

ఉదా:

వెంకటేశ్వరుడు - వెంకటేష్

భాషను simplify చేయాలంటే ఈ రెండు అక్షరాల బదులు ఒకటే కొనసాగించడం మంచిది.

అజ్ఞాత చెప్పారు...

హరి గారు చెప్పినట్టు మనం తమిళ అక్షరాలు ఫాలో అయిపోదాం. క, చ, ట, త, ప లు మరో నాలుగైదు నోరు తిరగలి హల్లులు తప్ప ఎక్కువ అక్షరాలు లేవు. మన తెలంగాణాంధ్రులు ఆ నోరు తిరగని వాటిని ఎలాగూ 'సక్కగ' చేసేస్తారు. :P

చెప్పాలంటే...... చెప్పారు...

బాలు గారిని తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదండి తప్పుని తప్పు అని చెప్పాను ఆ ఎపిసోడ్ చూసి వుంటే మీకు అర్ధం అయ్యేది. ఆంధ్రా వాళ్ళు శ స లను సరిగానే పలుకుతారు.అయినా ఆంధ్ర తెలంగాణా సమస్య కాదు ఒక సారి ఒకలా ఇంకో సారి ఇంకోలా చెప్తే చిన్న పిల్లలు ఎలా పలకాలో తెలియని అయోమయం లో పడిపోతారు. మొన్నటి ఎపిసోడ్ లో జరిగినది అదే అంజని నిఖిల బానే పలికింది బాలు గారే తప్పు చెప్పారు
హరి గారి మీ సూచనా బావుంది కదా!!
ఎస్ఎన్కేఆర్ గారు మీరు అన్నది బావుంది :)

voleti చెప్పారు...

పై కామెంట్లు చదివిన తర్వాత ఒక విషయం రాయాలని పించి రాస్తున్నాను. మన తెలుగు భాష లో వున్న అక్షరాలు పలికే టప్పుడు మన నోరు అనేక విధాల తిరుగుతూ వుంటుంది.. అదీ ఒక క్రమ పద్దతిలో..ముఖ్యంగా నాలిక చేసే విన్యాసాలు గమనించండి.(కొన్ని పదాలు పలికేటప్పుడు ముందు భాగానికి కొన్ని పదాలు పలికేటప్పుడు వెనక్కి ఇలా పై అంగుటికి తగులుతూ వుంటుంది.. ఈ గొప్ప తనం ఒక్క తెలుగు లోనే వుంది.. అందుకే శ్రీకృష్ణ దేవరాయలు (కన్నడ రాజు) "దేశ భాషలందు తెలుగు లెస్స" అని పొగిడాడు. తమిళ వాగ్గేయ కారులెందరో తమ కీర్తనలని తెలుగులోనే పాడారు.. (త్యాగరాజు నుండి మొన్నటి సుబ్బులక్క్ష్మి గారి దాకా) మనం తెలుగు వాళ్ళం అయ్యుండీ.. అక్షరాలు పలక లేక వాటిని పూర్తిగా తొలగించాలనుకోడం తప్పు.. తల పాగ చుట్టడం రాక తలవంకర అన్నట్టుంది నేటి దుస్ఠితి..

అజ్ఞాత చెప్పారు...

వోలేటి గారూ, బాగా చెప్పారు మీరు. పలకలేకపోవడం మన దోషం. అది సవరించుకోవాలి కానీ ఉన్న భాషనే కుదించేస్తామంటే ఎలా? ఇప్పటికే చాలా అక్షరాలు తెలుగు నుండి అదృశ్యమైపోయాయి. ఇప్పుడు ఏదో కష్టంగా ఉందని అది తొలగిద్దామంటున్నారు. రేపు ఇంకోటి కష్టమో, తికమకగా ఉండడమో జరుగుతుంది. అప్పుడు అది తీసేస్తారు. అలా అలా తెలుగే తికమకగా ఉంది అని ఈ మాత్రం బ్రతుకుతున్న తెలుగుని శాశ్వత సమాధి చేసేస్తారు.

అజ్ఞాత చెప్పారు...

హరిగారు,
తెలుగుభాషను ఇంకా simplify చేయాల్సిన అవసరముందా? ఇప్పుడేం ఎక్కువైపోయిందని?

వెంకటేశ్వరుడు - వెంకటేష్

అలా మార్చి పలకడం మన దౌర్భాగ్యం. దానికి భాషలో అక్షరాన్నే తొలగించాలనడం భావ్యమా?

చెప్పాలంటే...... చెప్పారు...

వోలేటి గారికి అజ్ఞాత గారికి ధన్యవాదాలు. తొలగించమని సరదాకి అన్న మాటలు లెండి. తేట తెలుగు తీయదనం రుచి అందరికి తెలుసు కదా!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner