30, మార్చి 2011, బుధవారం

టీంఇండియా గెలవాలి....కప్ మనదే కావాలి....!!

గెలవాలి గెలవాలి భారతీయులుగా గెలవాలి. ఆడాలి ఆడాలి భారతీయులుగా ఆడాలి...అప్పుడే గెలుపు తలుపు తడుతుంది....వంద కోట్ల మంది భారతీయుల కల నిజమౌతుంది....ఎన్నో రోజులుగా ఎదురు చుసిన తరుణం వచ్చేసింది, బాధ్యతగా, కలసికట్టుగా ఆడితే తిరుగులేని విజయం మనసొంతం. రికార్డులు, రివార్డులు, అవార్డులు, డబ్బులు కాకుండా సమిష్టిగా జట్టు విజయానికి కృషి చేస్తే అదే అదే భరతమాతకు అంకితమిచ్చే గెలుపుని అందుకున్న వారమై ఎగరేస్తాం భరత జాతి విజయకేతనం. ప్రపంచమంతా రెప రెపలాడుతూ సగర్వంగా నింగికెగురుతుంది మన జెండా!! ఆ క్షణం కోసమే ప్రపంచ మంతా వున్న కోట్లాది మంది ఎదురు చూస్తున్నతరుణం వచ్చేసింది. ఇదే అసలైన పోరు...గెలుపు కోసం మనం ఎదురు చూడటం కాకుండా ప్రపంచమంతా ఉత్కంఠభరితంగా ఈ రోజు ఫలితం కోసం ఎదురు చూడటమనేది ప్రపంచ చరిత్రలోనే ఇంతకు ముందు లేదు. ఎప్పుడైనా భారత పాకిస్తాన్ జట్ల మద్య జరిగే క్రికెట్ పోటికి వున్నంత ఉత్కంఠత మరే జట్ల మద్య వుండదు. యావత్ ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న క్షణాలు దగ్గరకు
వచ్చేసాయి ఫలితం కోసం ప్రతి ఒక్కరు
ఎదురు చూస్తూనే వున్నారు మరి ఏమౌతుందో ఏమో....!!
అందరి పూజలు ప్రార్ధనలు ఫలించి టీంఇండియా గెలవాలి....
రోజు ఉత్కంఠ భరితమైన ఆట కోసం తప్పక చూడండి
www.cricdude.com


2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

చూద్దామండి,భారతీయులందరి ఆశతో పాటు సచిన్ కల కూడ నిజమవ్వాలని కోరుకుందాం.
ఆల్ థె బెస్ట్ ఇండియా

చెప్పాలంటే...... చెప్పారు...

అందరూ మనస్పూర్తిగా ప్రఘాడంగా కోరుకునేది కుడా అదే.....థాంక్యు లత గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner