23, మార్చి 2011, బుధవారం

బాలు గారికి మనవి .....!!

బాలు గారికి,
ఈ టి వి సగర్వంగా సమర్పిస్తున్న పాడుతా తీయగా ప్రోగ్రాం లో విజేతను....అందరికి ఎంతో నచ్చే పాటలతో అలరిస్తున్న పిల్లలలో మీకు ఇష్టమైనవారికి కాకుండా ప్రతిభకు పట్టం కట్టమని సవినయంగా మనవి చేస్తున్నాను. పాట బాగుందా లేదా అని కాకుండా పాటకు పిల్లలు సరిగా న్యాయం చేసారో లేదో చూడండి. పాటల సాహిత్యం గురించి మీకు నచ్చక పొతే ముందే వాళ్లకు చెప్పి మీకు నచ్చే పాటలు ఇవ్వండి, అంతే కాని పాడిన తరువాత పాట సాహిత్యం బాలేదు, ఇలాంటి పాటలు ఎందుకు రాస్తారో!! లాంటి మాటలతో బాగా పాడిన చిన్నారులను చిన్నబుచ్చకండి దయచేసి. కోపం తో కాకుండా అర్ధం చేసుకుని అందరూ మెచ్చే విధంగా విజేతను ప్రకటిస్తారని కోరుకుంటూ....

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Saahitya Abhimaani చెప్పారు...

పాటల ఎంపికలో బాలు గారి పాత్ర ఏమీ ఉండదు. అంతా ఈ టివి వారి ఆధ్వర్యమే. లేకపోతె అనేకానేక చౌకబారు పాటలు ఆ పిల్లలచేత పాడిస్తారా!!

Sudha Rani Pantula చెప్పారు...

పాటలవిషయంలో బాలుగారి ఎంపికకి ఛాయిస్ ఉండి ఉంటే ఇలాంటి చౌకబారు పాటలు పాడించరనే నమ్ముతున్నా.ఈటీవీవారిసౌజన్యంలో జరుగుతోంది ఈ ఎంపిక.ఆఖరినిముషం వరకూ బాలుగారికి దీనిమీద చెప్పే అవకాశం లేకపోయిఉండవచ్చు.ఎవరినీ బాధపెట్టాలనే దృష్టిగాని,ప్రతిభని తొక్కేసే నీచప్రకృతి గానీ బాలుగారికి లేదు.ఉండదు.

సుజాత వేల్పూరి చెప్పారు...

శివ గారి మాటలు నిజమే! పిల్లల ఎంపిక, ఎవరితో పాడించాలి, ఎవరికి ఎక్కువ మార్కులు వేయాలి ఇవన్నీ కేవలం బాలూ చేతిలో ఉండవు. అసలు ఈ ప్రతిభా పాటవ పోటీలు, రియాలిటీ షోలు వీటిలో ఫలితాలు దాదాపుగా ముందే నిర్ణయమవుతాయి. ఈ మధ్య ఈ తరహా పద్ధతి మరీ విస్తరించింది.

న్యాయనిర్ణేతలుగ గా బాలూ శైలజ చక్కని పాత్ర నిర్వహిస్తారు. మిగతా వారు 'పిల్లలు" అనే సాఫ్ట్ కార్నర్ తో మార్కులు వేసినా బాలూ, శైలజ మాత్రం జాగ్రత్తగా పరిశీలించి సూక్ష్మమైన అంశాలను కూడా పట్టించుకుని జాగ్రత్తలు చెప్తారు. అందువల్ల చూసేవారికి వారి కఠినత్వం కనపడుతుందే తప్ప నైపుణ్యం కనపడదు.

పిల్లల అభివృద్ధి కోరేవారు వారిలో లోపాలను ప్రస్తావిస్తేనే వారు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.ఎంతో అద్భుతంగా పాడినట్లు ప్రేక్షకులకు అనిపించిన పాటలో సైతం తప్పులుండొచ్చు. అవి మైన్యూట్ తప్పులే కావొచ్చు. మన కోటిలాగానో, చంద్ర బోస్ లాగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టడం పిల్లల భవితకే చేటు. ఈ విషయంలో నా వోటు బాలూకే! (ప్రస్తుతం టీవీలో వస్తున్న పాటల కార్యక్రమాలన్నీ చూస్తున్నారా?)


ప్రముఖ దర్శకులు సాలూరి రాజేశ్వర రావు గారు బాలూ పాడేటపుడు "అలా కాదు, ఇలా పాడు" అని విసుక్కున్నట్లు బాలూ అనేకసార్లు గుర్తు చేస్తారు. ఆ విసుగు, ఆ వ్యాఖ్యల్లోంచి పాఠాలు నేర్చుకోవాలే కానీ తిట్టుకుంటే లాభం లేదు.

పిల్లలని నిరాశపరచాలని బాలూ ఎప్పటికీ అనుకోడు. ఇంతకు ముందు సబీహా అనే అమ్మాయి శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం లేకుండానే బాలూ సూచనలతో ప్రతిభను మెరుగు పరుచుకుని (ఆ అమ్మాయి ఉచ్చారణను, గమకాలు పలకలేకపోవడాన్ని అనేకసార్లు బాలూ ఎత్తి చూపారు)ఫైనల్స్ దాకా వచ్చింది.

పాటల ఎన్నికలో బాలూ పాత్ర నామమాత్రం! మనక్కూడా "పిల్లలు"అనే సాఫ్ట్ కార్నర్ తోనే బాలూ తన పాత్ర సరిగ్గా నిర్వహించలేదని అనిపిస్తుందేమో!

సినీ సంగీత కార్యక్రమాల విషయంలో బాలూని మించిన న్యాయనిర్ణేత ఇంకెవరూ ఉండరని నా స్థిరాభిప్రాయం!

చెప్పాలంటే...... చెప్పారు...

ఫైనల్ గా బాలు గారిదే నిర్ణయం పాటల విష్యం లో......శివ, సుధా, సుజాత గారు మీ అమూల్యమైన అభిప్రాయాలకు చాలా సంతోషం..బాలు గారిది పాత్ర లేదంటే నేను ఒప్పుకోను, తప్పులు చెప్ప వద్దని కాదు అందరిని ఒకలా చూడమనే చెప్పేది బాలు గారు అది చేయడం లేదు చాలా ఎపిసోడ్ల లో అది చూసాను అందుకే రాసాను

Balu చెప్పారు...

Sujatha gaaru.. paatala yempikalo baalu gaari prameyam vundakapovachchu ane vishayamlo meetho kontha varaku angeekaristhaanu kaani. yevariki yenni maarkulu veyyaali, yevarini nagginchaali ane vishayamlo mee abhipraayam correct kaadu. yendukante alaanti match fixing laki baalu gaaru angeekarincharani naa namakam. Oka vela vere chotla alaa jarigithe jarigi vundavachchu..

చెప్పాలంటే...... చెప్పారు...

బాలు గారు ఈ విష్యం లో మీతో ఏకీభవిస్తాను కొంత వరకునే మొత్తం గా కాదు....బాలు గారు తనకిష్టమైన వాళ్ళని అందలం ఎక్కించడం చూస్తూనే వున్నాను ఈ మధ్యలో

Rishi చెప్పారు...

>>బాలు గారు తనకిష్టమైన వాళ్ళని అందలం ఎక్కించడం చూస్తూనే వున్నాను ఈ మధ్యలో

నేను ఈ మధ్య ఈయన షో చూడలేదు కానీ ఓ నాలుగైదు సంవత్సరాల క్రితం అయితే నాకూ మీలాగే అనిపించింది.

ఒకసారి ఒక పిల్లాడు బాలూ గారి పాటే పాడాడు. బాలూ గారి లాగే పాడటం అసంభవం. పైగా ఆయన పాడేటప్పుడు బాగాలేకపోతే మరలా రికార్డ్ చేస్తారు కానీ ఇక్కడ అలా కుదరదు కదా.

సూచనలు ఇవ్వడం తప్పు లేదు కానీ అది హద్దు మీరి క్రిటిసిజమయ్యింది అనిపించింది నాకు.

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు అన్నది నిజమే రిషి గారు. చూస్తూ ఊరుకోలేక ఇలా టపాలు రాయాల్సి వస్తోంది. కొందరికేమో బాలు గారిని తప్పు పడుతున్నానని కోపం గా వుంది, నాకు అనిపించిన నిజం చెప్తున్నాను....అంతే .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner