18, నవంబర్ 2011, శుక్రవారం
స్తబ్ధత
ఎన్నో రాయాలని వున్నా రాద్దామంటే రావడం లేదు...
ఎందుకో తెలియడం లేదు కారణం ఏమిటో.....
స్థబ్దుగా వున్న మనసో...ఏది పట్టించుకోని తనమో..!!
ఏమో మరి ..!! ఎన్నాళ్ళో ఇలా..!!
కొన్ని పరిచయాలు గుర్తు వస్తే మనసుకు ఆహ్లాదం...మరి కొన్ని గుర్తు వస్తే చెప్పలేని కోపం..!! మనం ఏమి వాళ్లకు చేయక పోయినా మనకోసం ప్రాణం పెడతారు కొందరు. మరికొందరేమో అన్ని చేయించుకొని కనీసం నాలుగడుగుల దూరం లోనికి వచ్చి కూడా రాకపోతే పోయారు కనీసం పెళ్ళికి రమ్మని కూడా పిలవని మంచి వాళ్ళు. ఇక ఇంకొందరేమో దొరికినంతా తినేసి నీది ఏమి తినలేదు ఏమి ఇవ్వనక్కరలేదు అనే రకాలు అది ఒక్కటైతే పర్లేదు వాళ్ళ స్వార్ధం కోసం కాపురాలు కూల్చడానికి కూడా వెనుకాడరు. వీళ్ళకు డబ్బు తప్ప ఇక ఏ బంధం అక్కరలేదు.....
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చక్కగా చెప్పారు! అయినా పుర్రెకో బుద్ధి అన్నారు కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు!
avunu...kaani yemi cheyyagalam cheppandi
కబుర్ల మధ్యలో కాకరకాయన్న మాట. కాస్త బెల్లం(వాళ్ళ అజ్ఞానానికి నవ్వేసుకోవడ౦) కలిపేసి వండేయడమే..మంచి రుచిగా ఉంటుంది ప్రయత్నించి చూడండి.
జ్యోతి, రసజ్ఞ, శశి అందరికి థాంక్యు ....ఎప్పుడూ కబుర్లే వుంటే బాగోదని అప్పుడప్పుడు ఇలా చేదు జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటే కొంతమంది అయినా జాగ్రత్త పడతారు కదా....!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి